
గజపతి ప్యాలెస్ కల్యాణమండపంలో జరుగుతున్న షూటింగ్
పర్లాకిమిడి: స్థానిక బీఎన్ ప్యాలెస్, గజపతి ప్యాలెస్‌లలో ఒడియా చలన చిత్రం సుందర్‌ఘడ్ సాల్మన్‌ఖాన్‌లోని కొన్ని పెళ్లి సన్నివేశాలను బుధవారం చిత్రీకరించారు. ఈ షూటింగ్‌లో హీరో బాబూసేన్, మిహిర్ దాస్, హాస్యనటుడు పప్పు పంపం, హీరోయిన్లు, జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. అలాగే బీఎన్ ప్యాలెస్‌లో కూడా కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించినట్లు చిత్ర దర్శకుడు అశోక్ పతి తెలిపారు. పర్లాకిమిడిలోని గజపతి ప్యాలెస్, బీఎన్.ప్యాలెస్‌ల దగ్గరలో గండాహతి జలపాతాలు, చంద్రగిరి టిబెటియన్ల బౌద్ధమందిరం వంటి మంచి లోకేషన్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. రోజోపండగకు ఈ ఒడియా చలనచిత్రం రాష్ట్రమంతటా రిలీజ్ చేస్తామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అభిజిత్ మజుందార్. కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ఈ ప్రాంతంలో చిత్రీకరించినట్టు దర్శకుడు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment