బాలీవుడ్ నటి అర్చన జోగ్లేకర్ 1990లో పరిచయం అక్కర్లేని పేరు. అర్చన బుల్లితెరతో పాటు బాలీవుడ్‌తో పాటు మరాఠీ, ఒరియా, సినిమాల్లోనూు నటించింది. అంతే కాకుండా ఆమె గొప్ప డ్యాన్సర్ కూడా. అర్చనకు క్లాసికల్ డ్యాన్స్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. కిసీ కా శాంతి కా', 'కర్ణభూమి', 'ఫూల్వతి' వంటి సీరియల్స్‌తో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు వచ్చింది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆ సంఘటన అప్పట్లో ఏకంగా సినిమా ఇండస్ట‍్రీనే కుదిపేసింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం.
(ఇది చదవండి: రెండోసారి తల్లి కాబోతున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్!)
సినిమా షూటింగ్ సమయంలోనే అర్చనపై అత్యాచారయత్నం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఘటన ఆమె నటించిన ఒరియా సినిమా సెట్లో చోటు చేసుకుంది. ఓ చిత్రంలో అర్చన హీరోయిన్‌గా నటించింది. అప్పట్లో వచ్చిన మీడియా కథనాల ప్రకారం మూవీ షూటింగ్ జరిగి సమయంలో ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారయత్నం చేసేందుకు యత్నించాడట. అదే సమయంలో అక్కడున్న వ్యక్తులు ఆమెను రక్షించినట్లు సమాచారం.
అయితే అప్పట్లో ఆ సంఘటనతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా భయాందోళనకు గురైందట. కాగా.. పెళ్లి చేసుకున్న తర్వాత అర్చన అమెరికాలో న్యూజెర్సీలో స్థిరపడింది. ప్రస్తుతం తానే స్వయంగా ఓ డ్యాన్స్ స్కూల్ కూడా నిర్వహిస్తోంది. ఆమె స్కూల్ ద్వారా పిల్లలకు శాస్త్రీయ నృత్యంలో శిక్షణనిస్తోంది. కాగా.. అర్చన సునా చదేయ్, స్త్రీ లాంటి ఒరియా చిత్రాల్లో కనిపించింది.
(ఇది చదవండి: ఒకటే ముక్క..పుష్ప-2 పవర్‌ఫుల్ డైలాగ్ లీక్..!)
Comments
Please login to add a commentAdd a comment