పొగాకు వ్యతిరేక ర్యాలీ ప్రారంభించిన యదువీర్
విశ్వ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్యాలెస్‌లోని ఆంజనేయ స్వామి దేవాలయం ఎదుట కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశ్వ పొగాకు వ్యతిరేక ర్యాలీని యదువీర్ కృష్ణదత్త ఒడయార్ ప్రారంభించారు.
ప్యాలెస్ నుంచి మైసూరు బస్టాండ్ వరకు సాగిన ఈ ర్యాలీలో మైసూరు మెడికల్ కాలేజ్, భగవాన్ మహావీర్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు, కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ అధికారులు,ఉద్యోగులు పాల్గొన్నారు. - మైసూరు