విలాసవంతమైన టవర్స్; లగ్జరీ భవనాలు, ఎత్తైన శిఖరాలకు పెట్టింది పేరైన దుబాయ్‌లో రియల్ ఎస్టేట్‌కున్న డిమాండ్ మామూలుది కాదు. వెర్సైల్స్‌ను తలపించే మార్బుల్ ప్యాలెస్ ధర వింటే షాక్‌వుతారు. మార్కెట్‌లో దీని ధర రూ. 1,600 కోట్లు (750 మిలియన్ దిర్హామ్‌ల) పలుకుతోంది. విలాసవంతమైన భవనాలు ఎక్కువగా ఉండే నగరంలో మార్కెట్‌లో అత్యంత ఖరీదైన ఇల్లు అమ్మకానికి వుంది. ఇలాంటి ఇంద్రభవనంపై మోజుపడుతున్నవారిలో భారతీయుడు ఉండటం విశేషం.
మార్బుల్ ప్యాలెస్ అదిరిపోయే ఫీచర్లు
రియల్ ఎస్టేట్ ఏజెంట్లచే "మార్బుల్ ప్యాలెస్" గా పిలుస్తున్న ఈ భవనాన్ని అతి ఖరీదైన ఇటాలియన్ మార్బుల్ స్టోన్‌తో నిర్మించారు. Luxhabitat Sotheby's International Realty విక్రయిస్తున్న ఈ భవన నిర్మాణం దాదాపు 12 సంవత్సరాలు పట్టిందట. 60వేల చదరపు అడుగుల ఇంటిలో ఐదు బెడ్‌రూమ్‌లు ఉంటాయి. ఇందులో మాస్టర్ బెడ్‌రూమ్ 4,000 చదరపు అడుగులు ఒక పెద్ద భవనాన్ని మించిఅన్నమాట. (ఫేస్‌బుక్ మూత పడనుందా? కోర్టు సంచలన వ్యాఖ్యలు)
ఇంకా 15-కార్ల గ్యారేజ్, 19 రెస్ట్‌రూమ్‌లు, ఇండోర్ అలాగే అవుట్‌డోర్ పూల్స్, రెండు రూఫ్‌లు, 80,000 లీటర్ (21,000 గాలన్లు) కోరల్ రీఫ్ అక్వేరియం, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఎమర్జెన్సీ రూమ్‌లు తదితర ఫీచర్లలో ఉన్నాయి. ఇది 70 వేల చదరపు అడుగుల స్థలంలో గోల్ఫ్ కోర్స్‌కి ఎదురుగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!)
ఈ ఆస్తిని ఎవరైనా కొనుక్కెవచ్చు లేదా అద్దెకు తీసుకోవచ్చు, లేదా టెన్నిస్ లేదా పాడెల్ బాల్ కోర్ట్ కోసం ఉపయోగించవచ్చు అంటున్నారు. బ్రోకర్ కునాల్ సింగ్. ఈయన అంచనా ప్రకారం, కేవలం ఐదు నుండి పది మంది సంపన్నులు దీన్ని కొనుగోలు చేయగలరు. అంతేకాదు గత మూడు వారాల్లో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఇంటిని చూశారు. ఇందులో రష్యాకు చెందిన కొనుగోలు ప్రతినిధి ఒకరు కాగా, రెండో కస్టమర్ ఎమిరేట్స్ హిల్స్‌లో ఇప్పటికే మూడు నివాసాలను కలిగి ఉన్న ఇండియన్ కావడం గమనార్హం. ఆయన భార్య ఇంకొంచెం మెరుగైన దాని కోసం చూస్తోందని అందుకే నిర్ణయం తీసుకోలేదని సింగ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment