లండన్: భారతీయ సంతతి యువ ఇంజినీర్ యువతికి ఊహించని ఆహ్వానం అందింది. తన ప్యాలెస్ కు ఓసారి వచ్చి పోవాలంటూ ఏకంగా బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 రోమా అగర్వాల్(29) కు ఆహ్వానం పలికింది. లండన్ లోని షార్ద్ అనే ప్రాంతంలో యూరప్ లోనే అత్యంత ఎత్తయిన భవన నిర్మాణంలో ఇంజినీర్ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఈ సందర్భంగా వారికోసం ఏర్పాటుచేసిన విందు కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఎలిజబెత్ ప్రత్యేక ఆహ్వానం పలికారు.
దీంతో ఆమె తన సహచర ఇంజినీర్లతో కలిసి అత్యంత విలాసవంతమైన బ్రిటన్ ప్యాలెస్ లోకి అడుగు పెట్టనుంది. ఈ సందర్భంగా ఎంఎస్ అగర్వాల్ స్పందిస్తూ మహిళా ఇంజినీర్లపై ఎంతో కాలంగా ఉన్న ఛాందసమైన ఆలోచన తప్పని, యువతులు దీనిని ఆహ్లాదభరితంగా తీసుకొని కెరీర్ మలుచుకొని ఇంజినీర్లుగా రాణించాలని సూచించారు.
మన ఇంజినీర్ అమ్మాయికి రాణి ఆహ్వానం
Published Sun, Oct 25 2015 7:53 PM | Last Updated on Sun, Sep 3 2017 11:28 AM
Advertisement
Advertisement