సాక్షి,న్యూఢిల్లీ: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 అంత్యక్రియలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. భారత ప్రభుత్వం తరఫున రాణికి నివాళులు అర్పించనున్నారు. సెప్టెంబర్ 17-19 వరకు ముర్ము పర్యటన ఉంటుంది. ఎలిజబెత్ 2 అంత్యక్రియలు వెబ్‌మిన్‌స్టర్ అబ్బేలో సోమవారం(సెప్టెంబరు 19న) జరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచదేశాల అధినేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
96 ఏళ్ల బ్రిటన్ రాణి సెప్టెంబర్ 8న తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ సెప్టెంబర్ 12 ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషన్ కార్యాలయానికి వెళ్లి భారత్ తరఫున సంతాపం తెలియజేశారు. రాణి మృతి పట్ల భారత్ సెప్టెంబర్ 11న సంతాప దినం నిర్వహించింది.
చదవండి: పంజాబ్‌లో 'ఆపరేషన్ లోటస్'.. 10 మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఆఫర్
Comments
Please login to add a commentAdd a comment