ఊపిరి సలపనివ్వని ఇష్టం | Shortness of breath | Sakshi
Sakshi News home page

ఊపిరి సలపనివ్వని ఇష్టం

Published Sat, Mar 28 2015 10:37 PM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM

ఊపిరి సలపనివ్వని ఇష్టం

ఊపిరి సలపనివ్వని ఇష్టం

‘‘వదల బొమ్మాళీ... వదులు కానివ్వ బొమ్మాళీ’’ అంటూ అందరూ విస్తుపోయేలా చేస్తోంది మోడల్ అలైరా. వెనిజులాలోని కార్కాస్‌కు చెందిన ఈ మోడల్... అత్యంత బిగుతైన కార్సెట్ (శరీరాన్ని లోపలికి నొక్కిపట్టి ఉంచే డ్రెస్) తరహా గౌన్‌ను ధరించడంలో తనతో ఎవరూ పోటీపడలేరంటోంది. అలైరా... అతి బిగుతైన ఈ డ్రెస్‌ను కొంతకాలంగా దాదాపు రోజంతా వినియోగిస్తూ వార్తల్లోకి ఎక్కింది. తద్వారా తన నడుమును 20 అంగుళాలకు తగ్గించుకోగలిగింది.

అయితే నడుము దగ్గర కాసింత బిగుతుగానైనా బెల్ట్ పెట్టుకోవడం  ఆరోగ్యానికి మంచిది కాదని, అలాంటిది ఇలా అతి బిగుతైన తొడుగును ధరించి ఎక్కువ సేపు ఉండడం ప్రమాదకరమని ఓ పక్క డాక్టర్లు హెచ్చరిస్తున్నా... అలైరా మాత్రం అదేమీ పట్టించుకోనంటోంది. ‘‘నేను వీడని తొడుగులవి... నన్ను కట్టిపడేసే గొడుగులవి’’ అంటూ బెల్ట్, కార్సెట్‌ల పట్ల తన మక్కువను వెల్లడిస్తోంది. నిద్రపోయే టైమ్‌తో సహా రోజంతా తాను వాటితోనే ఉంటానని, స్నాన పానాదుల సమయంలో మాత్రం ఓ గంట వాటి విరహాన్ని అతి కష్టమ్మీద భరిస్తానని అంటోంది అలైరా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement