మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పింక్‌ సీక్విన్‌ గౌనుతో మెరిసిన పూజా హెగ్డే! | Pooja Hegde In A Pink Sequin Gown Is A Judge For 71st Miss World 2024 Pageant | Sakshi
Sakshi News home page

మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పింక్‌ సీక్విన్‌ గౌనుతో మెరిసిన పూజా హెగ్డే!

Published Sun, Mar 10 2024 1:26 PM | Last Updated on Sun, Mar 10 2024 3:37 PM

Pooja Hegde In A Pink Sequin Gown Is A Judge For 71st Miss World 2024 - Sakshi

ముంబైలో శనివారం రాత్రి(మార్చి 9న) జరిగిన 71వ మిస్ వరల్డ్ 2024 పోటీలకు ప్రముఖ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ అందాల పోటీల్లో పూజా హెగ్డే పింక్ స్వీక్విన్‌ గౌనులో మరో అందమైన గులాబీలా కనిపించింది. అలా వైకుంఠపురంతో ప్రేక్షకులకు చేరువైన బుట్టబొమ్మ పూజా హెగ్డే లుక్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పొడవాటి స్లీవ్స్ తో కూడిన ఫుల్‌ లెంగ్త్‌ గ్లిట్టర్ పింక్ సీక్విన్ గౌన్‌లో క్యూట్‌లుక్‌తో సందడి చేసింది.

రెడ్‌ కార్పెట్‌పై ఆ డ్రస్‌తో అందమైన గులాబీలా లుక్‌ అదిరిపోయింది. ఎలాంటి నగలు ధరించకపోయినా డీప్‌ నెక్‌తో కూడిన ఆ పింక్‌ డ్రస్‌లో అందానికే రాణిలా అందరి దృష్టిని ఆకర్షించింది.  అలాగే ఈ కార్యక్రమంలో కృతి సనన్‌ ఆకుపచ్చ గౌను, సోనాక్షి సిన్హా ఎరుపు రంగు గౌను, మన్నారా చోప్రా సిల్వర్‌ డ్రస్‌తో రెడ్‌ కార్పెట్‌పై సందడి చేశారు.

కాగా,  ఈ 71వ ప్రపంచ సుందరి పోటీల్లో 12 మంది సభ్యుల ప్యానెల్ లో పూజా హెగ్డే న్యాయ నిర్ణేతగా ఉన్నారు. బాలీవుడ్ నటి కృతి సనన్, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈవో జూలియా ఎవ్లిన్ మోర్లే సీబీఈ, అమృత ఫడ్నవీస్, సాజిద్ నడియాడ్వాలా, భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, రజత్ శర్మ, జమీల్ సయీద్, వినీత్ జైల్ ఈ ఎడిషన్‌కు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

(చదవండి: మిస్‌ వరల్డ్‌ పోటీల్లో నీతా అంబానీకి హ్యుమానిటేరియన్‌అవార్డు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement