pink colour
-
మిస్ వరల్డ్ పోటీల్లో పింక్ సీక్విన్ గౌనుతో మెరిసిన పూజా హెగ్డే!
ముంబైలో శనివారం రాత్రి(మార్చి 9న) జరిగిన 71వ మిస్ వరల్డ్ 2024 పోటీలకు ప్రముఖ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ అందాల పోటీల్లో పూజా హెగ్డే పింక్ స్వీక్విన్ గౌనులో మరో అందమైన గులాబీలా కనిపించింది. అలా వైకుంఠపురంతో ప్రేక్షకులకు చేరువైన బుట్టబొమ్మ పూజా హెగ్డే లుక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పొడవాటి స్లీవ్స్ తో కూడిన ఫుల్ లెంగ్త్ గ్లిట్టర్ పింక్ సీక్విన్ గౌన్‌లో క్యూట్‌లుక్‌తో సందడి చేసింది. రెడ్ కార్పెట్‌పై ఆ డ్రస్‌తో అందమైన గులాబీలా లుక్ అదిరిపోయింది. ఎలాంటి నగలు ధరించకపోయినా డీప్ నెక్‌తో కూడిన ఆ పింక్ డ్రస్‌లో అందానికే రాణిలా అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే ఈ కార్యక్రమంలో కృతి సనన్ ఆకుపచ్చ గౌను, సోనాక్షి సిన్హా ఎరుపు రంగు గౌను, మన్నారా చోప్రా సిల్వర్ డ్రస్‌తో రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. కాగా, ఈ 71వ ప్రపంచ సుందరి పోటీల్లో 12 మంది సభ్యుల ప్యానెల్ లో పూజా హెగ్డే న్యాయ నిర్ణేతగా ఉన్నారు. బాలీవుడ్ నటి కృతి సనన్, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈవో జూలియా ఎవ్లిన్ మోర్లే సీబీఈ, అమృత ఫడ్నవీస్, సాజిద్ నడియాడ్వాలా, భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, రజత్ శర్మ, జమీల్ సయీద్, వినీత్ జైల్ ఈ ఎడిషన్‌కు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. View this post on Instagram A post shared by Vishal Mohan Jaiswal (@mj.vishal) (చదవండి: మిస్ వరల్డ్ పోటీల్లో నీతా అంబానీకి హ్యుమానిటేరియన్‌అవార్డు!) -
ది 'పింక్' లేడీ ఆఫ్ హాలీవుడ్
మనలో అందరికీ ఏదో ఒకటి లేదా రెండు రంగులు ఇష్టమైనవై ఉంటాయి. ఆ ఇష్టమైన రంగు దుస్తులు, ఇతర అలంకరణ వస్తువులను అప్పుడప్పుడు వాడి సంతృప్తి పొందుతుంటాం. కానీ, తనకు ఇష్టమైన ఒక రంగును కొన్నేళ్లుగా అమితంగా ప్రేమిస్తూ, దానినే ధరిస్తూ, ఆ రంగుతోనే ఇంటినంతా అలంకరించుకొని, ఆ రంగులోనే జీవిస్తున్న అందమైన లేడీ ఒకరున్నారు. పేరు కిట్టెన్ కే సెరా. వయసు 56 ఏళ్లు. అమెరికాలోని టెక్సాస్‌లో ఉంటుంది. టీవీ నటిగా గుర్తింపు పొందింది. తను చేసే టీవీ కార్యక్రమాలన్నింటిలోనూ పింక్ దుస్తుల్లోనే కనిపించేది. బెవర్లీ హిల్స్ చివావా2 సినిమాలోనూ పింక్ కలర్ ఆహార్యంతోనే నటించింది. ‘ది పింక్ లేడీ ఆఫ్ హాలీవుడ్’ అని ఈమెను అంతా ముచ్చటగా పిలుచుకుంటారు. ముప్పై ఏళ్లకు పైగా గులాబీ రంగు తప్ప మరేమీ ధరించని ఈ పింకమ్మ జుట్టు రంగు పింక్, గోళ్ల రంగు పింక్, పెదాల రంగు పింక్, దుస్తులు పింక్... చివరకు తను వాడే కారు పింక్, ముద్దులొలికే కుక్క రంగు పింక్... ఇలా లైఫ్‌ని అంతా పింక్మయంగా మార్చుకున్న కిటెన్ కే సెరా ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికల మీదా పింక్గానే కనిపిస్తూ ‘వరల్డ్ పింక్ క్వీన్’ అంటూ అభిమానుల చేత పిలిపించుకుంటుంది. అమ్మాయిల చెంపలను గులాబీ రంగు బుగ్గలు అంటూ పొగిడే కవులు ఈ గులాబీ లేడీని చూస్తే ఏమని పొగిడెదరో.. అనిపించకమానదు. -
గులాబీ రంగు వస్త్రాన్ని తొలగించాలని నిరసన
నెహ్రూసెంటర్(మహబూబాబాద్) : మానుకోట కోర్టు సమీపంలో నిర్మాణంలో ఉన్న అమరవీరుల స్థూపానికి చుట్టిన గులాబీ రంగు వస్త్రాన్ని తొలగించి, తెలుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయాలని టీజేఎస్, ఎమ్మార్పీఎస్ నాయకులు పిల్లి సుధాకర్, గుగ్గిళ్ల పీరయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం స్థూపం వద్ద నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది అమరులు కాగా ఏర్పాటు చేసుకున్న స్థూపానికి టీఆర్ఎస్ పార్టీ రంగు అయిన గులాబీ వస్త్రాన్ని చుట్టి అవమానించారని ఆరోపించారు. ఉద్యమకారులు భూక్య సత్యనారాయణ బెజ్జం ఐలయ్య పాల్గొన్నారు. -
బీటీ పత్తిలో గులాబీ రంగు
- గుజరాత్‌కే పరిమితమైన పురుగు ఇప్పుడు రాష్ట్రంలోకి ప్రవేశం సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లాలో సాగు చేస్తున్న బీటీ పత్తిని గులాబీ రంగు పురుగు ఆశించినట్లుగా స్థానిక వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటివరకు కేవలం గుజరాత్లో మాత్రమే బీజీ-2 పత్తిని గులాబీ రంగు పురుగు ఆశిస్తుండగా... ఇప్పుడు వరంగల్ జిల్లాలోనూ ఈ ఏడాది గులాబీ రంగు పురుగును గుర్తించారు. అలాగే ఈ సమస్య మహబూబ్‌నగర్ జిల్లాలోనూ ఉన్నట్లు రాష్ట్ర శాస్త్రవేత్తలు నిర్ధారించారు. వర్షాధార బీటీ పత్తిని రైతులు చాలావరకు ఏరివేసి ఆ పత్తి చేలను వదిలేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పత్తి మొక్కలు పూర్తిగా ఎండి వాటిలో రోగ నిరోధక శక్తి లేకపోవడంతో అది పురుగుకు వరంగా మారి, వదిలేసినచేలల్లో గులాబి రంగు పురుగు ఉధృతమై మిగతా పత్తి చేలను కూడా ఆశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ చేలల్లో గులాబీ రంగు పురుగుతో పాటు పిండినల్లి కూడా ఎక్కువగా ఆశిస్తున్నట్లు గుర్తించారు. గులాబీ రంగు పురుగు లార్వాలు కాయలలోకి ప్రవేశించి పత్తిని, గింజలను తింటాయి. దీనివల్ల పత్తి సరిగా పగలదు. వచ్చే పత్తి నాణ్యత బాగా తగ్గి గుడ్డి పత్తి అవుతుంది. బరువు కూడా బాగా తగ్గుతుంది. నివారణ చర్యలు... పత్తి ఏరినటువంటి చేలల్లో గొర్రెలు, మేకలు, పశువులను తోలి మేపాలి. పత్తి మోడులను రోటవేటర్‌తో భూమిలోకి కలియదున్నాలి. నీటి వసతి ఉన్నప్పటికీ పత్తిని పొడిగించకుండా తీసేసి మొక్కజొన్న లేదా ఇతర ఆరుతడి పంటలు వేసుకోవాలి. గులాబీ రంగు పురుగు నివారణకు క్వినాల్ఫాస్ 400 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 300 గ్రాములు వేపనూనెతో కలిపి పిచికారి చేయాలి. పత్తి మోడులను ఇళ్ల దగ్గర పొయ్యిలో వాడడానికి నిల్వ చేయకూడదు. గులాబీ రంగు పురుగు ఆశించిన పత్తి చేల నుంచి తీసిన పత్తిని అంతకు ముందు నిలువ ఉంచుకున్న పత్తిలో కలుపకూడదు.