అత్తగారు క్వీన్ సోఫియా నలభై ఏళ్ల క్రితం ధరించిన ఈ గౌనును రీ మోడలింగ్ చేసి...
ఆయన దేశాన్ని పాలించే మహారాజు. ఆయన భార్య మహారాణి. లెక్క ప్రకారం వారికి దేనికీ కొదవే ఉండదు. వాళ్లు వేసుకునే పాదరక్షల నుంచి హెయిర్ క్లిప్‌ల వరకు అన్నీ ఖరీదైనవిగా ఉంటాయి. మహారాణిగారు ఏ కార్యక్రమానికైనా వచ్చారంటే ఆమె సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తారు. దీనికి తగ్గట్టుగానే వారు రెడీ అవుతుంటారు. ఈ సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరిస్తూ సరికొత్త ఫ్యాషన్‌కు ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తున్నారు స్పెయిన్ మహారాణి లెట్జియా ఓరి్టజ్ రోకసోలానో. కార్యక్రమానికో డ్రెస్ కొనకుండా, తన దగ్గర ఉన్న పాత డ్రెస్సులను సరికొత్తగా తీర్చిదిద్ది వివిధ కార్యక్రమాలకు వాటినే వాడుతూ ఫ్యాషన్ ఐకాన్‌లకే సవాళ్లు విసురుతున్నారు. ఎప్పుడూ స్టైలి‹Ùగా కనిపించే లెట్జియా రెండు రోజులక్రితం రాయల్ ప్యాలెస్‌లో చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరాకు ఆహా్వనం పలికే క్రమంలో నలభై ఏళ్లనాటి డ్రెస్‌లో ఫ్యాషనబుల్‌గా కనిపించారు.
ఈ గౌనుకు పెద్ద చరిత్రే ఉంది. లెట్జియా అత్తగారు క్వీన్ సోఫియా నలభై ఏళ్ల క్రితం ధరించిన ఈ గౌనును ఇప్పటి మహారాణి ధరించడం విశేషం. పొట్టి చేతులు, పింక్ పేస్టల్ కలర్‌లో ఫ్రాక్. పువ్వులతో మోకాళ్ల కింద వరకు స్కర్ట్‌ను ధరించారు. మహారాజు జువాన్ కార్లోస్–1తో కలిసి, క్వీన్ సోఫియా 1981లో రోమ్‌ను సందర్శించారు. ఆ సమయంలో సోఫియా ఈ డ్రెస్‌ను ధరించారు. ఆనాటి డ్రెస్‌ను వార్డ్‌రోబ్ లో నుంచి తీసి దానిని వెండి, రత్నాలతో మరింత అందంగా డెకొరేట్ చేసి, సిల్వర్ బెల్ట్‌తో ధరించి చూపరులను ఆకట్టుకుంది లెట్జియా. అంతేగాక ఈ వారం లో జరిగిన రెటీనా ఈసీవో అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న లెట్జియా ఒక నలుపు రంగు గౌనును వేసుకున్నారు. ఈ గౌనును సేంద్రియ వెదురుతో తయారు చేయడం విశేషం. ఇద్దరమ్మాయిలకు తల్లి అయిన లెట్జియా, ఒకపక్క తల్లిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే వివిధ అధికారిక కార్యక్రమాల్లో తరచూ పొల్గొంటూ ఉంటారు. ఆమె ధరించే డ్రెస్‌లు ఎంతో సింపుల్‌గా స్టైలిష్‌గా ఉండడమేగాక, దాదాపు రీసైక్లింగ్ చేసినవి కావడంతో అంతా లెట్జియా డ్రెస్‌లను ఆసక్తిగా గమనిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment