Remodeling
-
రీమోడల్ ప్రయోగం సక్సెస్
చిత్తూరు రూరల్: ఆర్టీసీ బస్సు రీ మోడల్ ప్రయోగం ఫలించింది. చిత్తూరు–2 డిపోకు చెందిన బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మార్పు చేశారు. ఇందుకు రూ.72 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. 2 గంటలు చార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు పరుగులు పెట్టనుంది. డీజిల్ భారం ఆర్టీసీకి పెద్ద తలనొప్పిగా మారింది.ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఎలక్ట్రిక్ బస్సుగా మార్పు చేయాలని భావించి.. రెండేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని వీర వాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఈ బాధ్యతను అప్పగించింది. అన్ని పనులు పూర్తయ్యాక విజయవాడకు చెందిన ఆర్టీసీ టీమ్ ఆ ఎలక్ట్రిక్ బస్సును పరీక్షించింది. అనంతరం బస్సును చిత్తూరు–2 డిపోకు తీసుకొచ్చారు. బస్సు ప్రత్యేకతలు ఇవే... చిత్తూరు–2 డిపో గ్యారేజీకి గత వారం ఈ బస్సు చేరింది. ఇందులో ఆరు హెవీ డ్యూటీ బ్యాటరీలు ఉన్నట్లు గుర్తించారు. ఈ బ్యాటరీల చార్జింగ్కు 1.30 నుంచి 2 గంటల సమయం తీసుకుంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 180 నుంచి 200 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఈ బస్సు గేర్ సహాయం లేకుండా స్విచ్ టైప్‌తో ఆటోమెటిక్‌గా నడుస్తుంది. గంటకు 80 కి.మీ వేగంతో నడిచేలా తీర్చిదిద్దారు. ఎలక్ట్రిక్ మోటార్‌తో చక్కటి స్టీరింగ్‌ను ఏర్పాటు చేశారు. పాత పద్ధతిలో బ్రేక్ సిస్టం, డ్రైవర్‌కు సౌకర్యార్థంగా డాష్‌బోర్డును బిగించారు. దీని ద్వారా బ్యాటరీ పరిస్థితి, బస్సు ఏ గేర్‌లో వెళుతోంది.. అనే విషయాలను తెలుసుకునే వీలుంది. ఇక బస్సు కింద భాగంలో అమర్చిన పరికరాలు వర్షానికి తడవకుండా అల్యూమినియంతో పూర్తిగా కప్పేశారు. తిరుపతి–తిరుమల మార్గంలో.. కొత్తగా రూపుదిద్దుకున్న ఎలక్ట్రిక్ బస్సును తిరుపతి–తిరుమల మార్గంలో తిప్పనున్నారు. ఈ క్రమంలో అలిపిరి వద్ద చార్జింగ్ స్టేషన్ పనులు జరుగుతున్నాయి. అలాగే తిరుపతి బస్టాండులో కూడా ఒక చార్జింగ్ పాయింట్ పెట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని పరీక్షలు పూర్తయిన తరువాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బండిని రోడ్డుపైకి తీసుకొస్తారని సమాచారం. డ్రైవర్‌కు అనుకూలమైన బస్సు. గేర్లు లేకుండా నడపవచ్చు. బ్యాటరీ, మోటార్ సాయంతో వెళుతుంది. ఈ బస్సుతో డీజిల్ భారం తగ్గనుంది. పొగ రాదు.. వాయు కాలుష్యం ఉండదు. – ఇబ్రహీం, డిప్యూటీ సీఎంఈ, చిత్తూరు -
నలభై ఏళ్లనాటి డ్రెస్...మరింత అందంగా.. ఆధునికంగా...
ఆయన దేశాన్ని పాలించే మహారాజు. ఆయన భార్య మహారాణి. లెక్క ప్రకారం వారికి దేనికీ కొదవే ఉండదు. వాళ్లు వేసుకునే పాదరక్షల నుంచి హెయిర్ క్లిప్‌ల వరకు అన్నీ ఖరీదైనవిగా ఉంటాయి. మహారాణిగారు ఏ కార్యక్రమానికైనా వచ్చారంటే ఆమె సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తారు. దీనికి తగ్గట్టుగానే వారు రెడీ అవుతుంటారు. ఈ సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరిస్తూ సరికొత్త ఫ్యాషన్‌కు ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తున్నారు స్పెయిన్ మహారాణి లెట్జియా ఓరి్టజ్ రోకసోలానో. కార్యక్రమానికో డ్రెస్ కొనకుండా, తన దగ్గర ఉన్న పాత డ్రెస్సులను సరికొత్తగా తీర్చిదిద్ది వివిధ కార్యక్రమాలకు వాటినే వాడుతూ ఫ్యాషన్ ఐకాన్లకే సవాళ్లు విసురుతున్నారు. ఎప్పుడూ స్టైలి‹Ùగా కనిపించే లెట్జియా రెండు రోజులక్రితం రాయల్ ప్యాలెస్‌లో చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరాకు ఆహా్వనం పలికే క్రమంలో నలభై ఏళ్లనాటి డ్రెస్‌లో ఫ్యాషనబుల్‌గా కనిపించారు. ఈ గౌనుకు పెద్ద చరిత్రే ఉంది. లెట్జియా అత్తగారు క్వీన్ సోఫియా నలభై ఏళ్ల క్రితం ధరించిన ఈ గౌనును ఇప్పటి మహారాణి ధరించడం విశేషం. పొట్టి చేతులు, పింక్ పేస్టల్ కలర్లో ఫ్రాక్. పువ్వులతో మోకాళ్ల కింద వరకు స్కర్ట్‌ను ధరించారు. మహారాజు జువాన్ కార్లోస్–1తో కలిసి, క్వీన్ సోఫియా 1981లో రోమ్ను సందర్శించారు. ఆ సమయంలో సోఫియా ఈ డ్రెస్‌ను ధరించారు. ఆనాటి డ్రెస్‌ను వార్డ్రోబ్ లో నుంచి తీసి దానిని వెండి, రత్నాలతో మరింత అందంగా డెకొరేట్ చేసి, సిల్వర్ బెల్ట్‌తో ధరించి చూపరులను ఆకట్టుకుంది లెట్జియా. అంతేగాక ఈ వారం లో జరిగిన రెటీనా ఈసీవో అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న లెట్జియా ఒక నలుపు రంగు గౌనును వేసుకున్నారు. ఈ గౌనును సేంద్రియ వెదురుతో తయారు చేయడం విశేషం. ఇద్దరమ్మాయిలకు తల్లి అయిన లెట్జియా, ఒకపక్క తల్లిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే వివిధ అధికారిక కార్యక్రమాల్లో తరచూ పొల్గొంటూ ఉంటారు. ఆమె ధరించే డ్రెస్‌లు ఎంతో సింపుల్‌గా స్టైలిష్‌గా ఉండడమేగాక, దాదాపు రీసైక్లింగ్ చేసినవి కావడంతో అంతా లెట్జియా డ్రెస్‌లను ఆసక్తిగా గమనిస్తుంటారు. -
వావ్.. వజీర్..
సాక్షి. వైరా రూరల్: యూట్యూబ్ అతడికి మార్గదర్శిగా నిలిచింది. అందులో నుంచి బుల్లెట్లను రీమోడలింగ్ చేసే విధానాన్ని నేర్చుకుని.. ఎన్నో పాత బుల్లెట్లను కొత్తగా మార్చాడు. ఈతరం బుల్లెట్ల మాదిరిగానే అవి ఉండటంతో ప్రజల్లో ఆదరణ పెరిగింది. దీంతో ఆ వృత్తినే జీవనోపాధిగా మార్చుకుని “బుల్లెట్’లాగా దూసుకుపోతున్నాడు.. వైరాకు చెందిన వజీర్. తాను రీమోడలింగ్ చేసిన బుల్లెట్ల ఫొటోలు యూట్యూబ్, ఓఎల్‌ఎక్స్‌లలో పెట్టి విక్రయిస్తున్నాడు. ప్రత్యేకంగా ఫేస్బుక్లో పేజీ రూపొందించి ఫాలోవర్ల సంఖ్యను పెంచుకున్నాడు. యూట్యూబ్ చానెల్ ఏర్పాటు చేసి ఎందరో సబ్స్క్రైబర్లను సాధించాడు. 1994 అంతకంటే ముందు వచ్చిన డీజిల్ బుల్లెట్ వాహనాలకు రీమోడలింగ్ చేసి భవిష్యత్‌లో స్థిరపడాలనే లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు వెళ్తున్నాడు. విశేషం ఏంటంటే.. ఇంత వరకు అతను ఎక్కడా షాపు పెట్టలేదు. చదవండి: రాష్ట్రంలో విరివిగా కరోనా పరీక్షలు ఇలా మొదలైంది.. బుల్లెట్ వాహనాలకు రీమోడలింగ్ చేసే షేక్ వజీర్ ఏడేళ్ల కిందట టోరస్ 1995 మోడల్‌కు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. దానిని కొన్ని రోజులు నడిపిన తర్వాత ఆ బైక్ రిపేర్‌కు వచ్చింది. దానికి మరమ్మతులు చేయించేందుకు చాలా షాపులు తిరిగాడు. కానీ ఏళ్ల కిందట బుల్లెట్ కావడంతో రిపేర్ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. 1994 కంటే ముందు మోడల్ డీజిల్ బుల్లెట్లకు అప్పటి మెకానిక్‌లు ఆర్డీఓ అప్రూవల్తో పెట్రోల్ వాహనాలుగా మాత్రమే కన్వర్షన్ చేసేవారు తప్ప రిపేర్ మాత్రం చేసే వారు కాదు. ఇలాంటి బైక్‌లను మరమ్మతు చేయడం నేర్చుకుంటే జీవితంలో స్థిరపడవచ్చనే అనే ఆలోచన అప్పుడు అతడికి వచ్చింది. యూట్యూబ్ ద్వారా గుంటూరులో మాత్రమే ఇంజిన్ రిపేర్ చేసే వారు ఉంటారని తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్లి ఇంజిన్ రీపేర్ చేయడం, అమర్చడం నేర్చుకున్నాడు. యూట్యూబ్ ద్వారా వాహనంలోని వివిధ భాగాలు వీడదీయడం, వాటిని అమర్చడం నేర్చుకున్నాడు. తాను కొనుగోలు చేసిన బుల్లెట్‌పై ప్రయోగం చేసి సత్ఫలితం సాధించాడు. షాపు పెట్టుకునేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో యూట్యూబ్‌లో చానల్ రూపొందించాడు. తాను రీమోడలింగ్ చేసే ప్రతి వావాహనాన్ని అందులో ఆప్‌లోడ్ చేసి ప్రపంచమంతా వీక్షించే విధంగా దానిని రూపకల్పన చేశాడు. కుంగిపోకుండా.. వజీర్ ఎంబీఏ చేసి ఏదైనా ఉద్యోగంలో స్థిరపడాలని కోరిక. డిగ్రీలో కొన్ని సబ్జెక్టులు తప్పడంతో తన తండ్రి సైదులుకు ఉన్న చికెన్ షాపులో పని చేసుకుంటూ.. చదువుకునే వాడు. ఈ క్రమంలో తన తండ్రి మత్స్యకారుడు కూడా కావడంతో సుమారు ఆరేళ్ల కిందట చేపల వేటకు వెళ్లి ఈదురు గాలులకు రిజర్వాయర్‌లో గల్లంతై మృతిచెందాడు. దీంతో కుటుంబ భారం మొత్తం ఇతడిపై పడడంతో చదువును మధ్యలోనే ఆపేశాడు. తండ్రి మృతి తర్వాత చికెన్ షాపులో కూడా వ్యాపారం తగ్గడంతో.. అతడికి తెలిసిన చికెన్ షాపులో పనిచేస్తూ.. అన్ని తానై తన చెల్లి వివాహం చేశాడు. ప్రస్తుతం కొణిజర్లలో చికెన్ షాపు పార్ట్‌టైంగా నిర్వహిస్తూ.. ఇంట్లో బుల్లెట్ రీమోడలింగ్ చేస్తున్నాడు. ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే.. డీజిల్ బుల్లెట్లు 1996 తర్వాత పూర్తిస్థాయిలో బ్యాన్ అయ్యా యి. కానీ, వాటి క్రేజ్ మాత్రం తగ్గలేదు. కారణం ఈ ద్విచక్రవాహనం లీటర్ డీజిల్‌కు 70 కిలోమీటర్ల మైలేజ ఇస్తాయి. ఫేస్బుక్, యూట్యూబ్, ఓఎల్‌ఎక్స్‌ల ద్వారా నాటి బుల్లెట్లు ఎక్కడ దొరకుతాయో.. తెలుసుకొని అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు ఉంటే.. వాటిని కొనుగోలు చేస్తాడు. అనంతరం దాని భాగాలు మొత్తం పూర్తి స్థాయిలో వీడదీసి, దానికి కావా ల్సిన స్పేర్ భాగాలను కొని మొత్తం ఫిట్టింగ్ అంతా పూర్తి చేస్తాడు. నూతన సీట్లు కావాలంటే వాటిని సైతం తయారు చేస్తాడు. పెయింటింగ్, రాయల్ ఎన్ఫీల్డ్ అనే స్టిక్కర్ కూడా వేస్తాడు. మొత్తం రీమోడలింగ్ అయిన తర్వాత తన సోషల్ మీడియా ద్వారా విక్రయానికి సిద్ధం చేస్తాడు. ఇలా ఇప్పటికే ఎన్నో బుల్లెట్లను రీమోడలింగ్, రీస్టోర్ చేశాడు. -
5 కోట్ల నిధులతో ఆసుపత్రి అభివృద్ధి
-
ఎంఎంటీఎస్‌కు కొత్త సొబగులు
సాక్షి, సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ కొత్త సొబగులను అద్దుకుంది. సరికొత్త సదుపాయాలతో, మరిన్ని భద్రతా ప్రమాణాలతో ప్రయాణికుల ముందుకు రానుంది. గులాబీ, తెలుపు రంగుల్లో రూపొందించిన సరికొత్త ఎంఎంటీఎస్ రైళ్లను బుధవారం ప్రారంభించనున్నారు. మెట్రో తరహా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటరైజ్డ్ కంట్రోలింగ్ వ్యవస్థ కలిగిన కొత్త మెట్రో రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. మహిళల కోసం కేటాయించిన బోగీల్లో సీసీటీవీలను ఏర్పాటు చేశారు. సమయపాలన పాటించండి.. బుధవారం నుంచి కొత్త రైళ్లను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దక్షిణ మధ్య జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా రైళ్ల నిర్వహణపై మంగళవారం రైల్‌నిలయంలో సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజనల్ మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎంఎంటీఎస్ రైళ్ల సమయపాలనకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని ఆయన ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైళ్ల జాప్యానికి తావు ఉండరాదన్నారు. రైళ్ల నిర్వహణ, సమయపాలనపైన క్షేత్రస్థాయి పరిశీలన కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. బుధవారం ఉదయం 4.30 గంటలకు, తిరిగి ఉదయం 6 గంటలకు కొత్త ఎంఎంటీఎస్ రైళ్లు ఫలక్‌నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి మార్గం లో అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక హంగులతో.. ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ వ్యవస్థ, జీపీఎస్ ఆధారిత రూట్ మ్యాపింగ్, రైల్వేస్టేషన్ల సమాచారం, ఎల్ఈడీ డిస్ప్లే వంటి ఆధునిక హంగులతో ఈ 12 బోగీల రైళ్లు అతి తక్కువ చార్జీలతో అత్యధిక దూరం రవాణా సదుపాయాన్ని అందజేయనున్నాయి. ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రస్తుతం 1.5 లక్షల మంది పయనిస్తున్నారు. అందుబాటులోకి రానున్న కొత్త రైళ్ల వల్ల ప్రయాణికుల సంఖ్య 2.5 లక్షల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. 30 శాతానికి పైగా ప్రయాణికుల భర్తీ రేషియో పెరుగుతుందన్నారు. ఆధునాతన నియంత్రణ వ్యవస్థ.. కొత్త ఎంఎంటీఎస్ రైళ్లు పూర్తిస్థాయి ట్రైన్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (టీసీఎంఎస్) ద్వారా నడుస్తాయి. దీనివల్ల పట్టాలపైన పరుగులు పెట్టే రైళ్ల కదలికలను మరింత కచ్చితంగా అంచనా వేసేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కడ ఏ చిన్న అవాంతరం ఎదురైనా అధికార యంత్రాంగం సత్వరమే స్పందించి తగిన చర్యలు చేపడుతుంది. ఆధునాతన రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. దీనివల్ల విద్యుత్ బాగా ఆదా అవుతుంది. అన్ని బోగీల్లో వీఆర్ఎల్ఏ బ్యాటరీలను ఏర్పాటు చేశారు. దీంతో లైటింగ్ పుష్కలంగా ఉంటుంది. అలాగే గాలి, వెలుతురు బాగా వచ్చే విధంగా కోచ్‌ల లోపలి భాగాలను రూపొందించారు. భద్రత పటిష్టం.. ఫలక్‌నుమా, ఉప్పుగూడ, యాఖుత్పురా తదితర స్టేషన్లలో రైళ్లపై తరచుగా రాళ్ల దాడులు జరుగుతున్నాయి. ఇది ప్రయాణికుల భద్రతకు పెద్ద సవాల్‌గా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు, అసాంఘిక శక్తులు ఈ తరహా దాడులకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త రైళ్లకు ప్రత్యేకంగా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. రాళ్లు విసిరినా ప్రయాణికులకు తాకకుండా జాగ్రత్తలు చేపట్టారు. మరోవైపు మహిళల బోగీల్లో సీసీటీవీలను ఏర్పాటు చేశారు. దీంతో మహిళల బోగీల్లోకి మగవారు ప్రవేశించడం, పోకిరీలు, ఈవ్టీజర్ల బెడద నుంచి రక్షణ లభించనుంది. ఎల్ఈడీ డిస్ప్లే.. కొత్త ఎంఎంటీఎస్ రైళ్లలో లోపల, బయట ఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. ఎప్పటికప్పుడు స్టేషన్ల వివరాలు ప్రదర్శితమవుతాయి. మెట్రో రైళ్ల తరహాలో ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో స్టేషన్ అనౌన్స్మెంట్ ఉంటుంది. అలాగే తరువాత రాబోయే స్టేషన్ అనౌన్స్మెంట్ కూడా వినిపిస్తుంది. ఒక్కో ట్రైన్ ధర రూ.4 కోట్ల వరకు.. ప్రస్తుతం నగరంలోని ఫలక్‌నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్‌నుమా–నాంపల్లి–లింగంపల్లి, తదితర మార్గాల్లో 9 కోచ్‌లు ఉన్న 10 ఎంఎంటీఎస్ రైళ్లు ప్రతి రోజు 121 ట్రిప్పులు నడుస్తున్నాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు వివిధ మార్గాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. 2003లో కేవలం 6 కోచ్‌లతో ప్రారంభించిన రైళ్లను 2010లో 9 కోచ్‌లకు పెంచారు. ఇప్పుడు 12 కోచ్‌లతో తయారు చేసిన 4 కొత్త రైళ్లు వచ్చేశాయి. ఒక్కో ట్రైన్ ధర రూ.4 కోట్ల వరకు ఉంటుంది. మరో 4 రైళ్లు త్వరలో నగరానికి రానున్నాయి. దీంతో 8 కొత్త రైళ్ల వల్ల ట్రిప్పుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఎంఎంటీఎస్ రైళ్లలో 700 సీట్లు మాత్రమే ఉన్నాయి. మరో 2,000 మంది నిల్చొని ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంది. కొత్త రైళ్లలో 1150 సీట్లు ఉంటాయి. మరో 4,000 మంది నిల్చొని ప్రయాణం చేయవచ్చు.. అంటే ఒక ట్రిప్పులో ప్రయాణికుల సంఖ్య 2700 నుంచి ఏకంగా 5150 వరకు పెరిగే అవకాశం ఉంది. ఎంఎంటీఎస్ రెండో దశ సికింద్రాబాద్–బోయిన్పల్లి, పటాన్చెరు–తెల్లాపూర్, సికింద్రాబాద్–ఘట్కేసర్ మార్గాల్లో ఈ కొత్త రైళ్లను నడుపుతారు. దీంతో ప్రయాణికుల సంఖ్య కూడా ఇప్పుడు ఉన్న 1.5 లక్షల నుంచి 2.5 లక్షలకు పైగా పెరిగే అవకాశం ఉంది. రూ.10 చార్జీ.. 40 కి.మీ ప్రయాణం.. కొత్త ఎంఎంటీఎస్ రైళ్లతో ప్రయాణికులకు మరింత మెరుగైన, నాణ్యమైన రవాణా సదుపాయం లభిస్తుంది. ఒకేసారి ఎక్కువ మంది ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుంది. ట్రిప్పులు కూడా బాగా పెరుగుతాయి. కేవలం రూ.10 గరిష్ట చార్జీలతో 40 కిలోమీటర్లకు పైగా రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న రైళ్లు కేవలం ఎంఎంటీఎస్ రైళ్లే. – సీహెచ్ రాకేష్, సీపీఆర్వో, దక్షిణ మధ్య రైల్వే -
చెరువుల పరిరక్షణ ప్రైవేట్‌కు...
సాక్షి,సిటీబ్యూరో : గ్రేటర్ పరిధిలోని చెరువులను దశలవారీగా పరిరక్షించి, సుందర తటాకాలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన జీహెచ్ఎంసీ సమయాభావం, నిధుల కొరత నేపథ్యంలో సదరు పనులను ప్రైవేట్‌కు అప్పగించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పీపీపీ పద్ధతిలో చెరువుల్లోని మురుగునీటిని ప్రక్షాళన చేసి సుందర తటాకాలుగా తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చే సంస్థలకు బాధ్యతలు అప్పగిస్తారు. పనులు పూర్తి చేసి పిక్నిక్ స్పాట్స్‌గా తీర్చిదిద్దే సంస్థలకే కొన్నేళ్లపాటు నిర్వహణ బాధ్యతలను కూడా అప్పగించడంతోపాటు, అక్కడ ఏర్పాటు చేసే జలక్రీడలు, బోటింగ్, వినోద కార్యక్రమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పొందేందుకు అవకాశం కల్పిస్తారు. నిర్ణీత వ్యవధి ముగిశాక తిరిగి అవి జీహెచ్ఎంసీ పరమవుతాయి. తద్వారా ఓ వైపు చెరువుల కబ్జాను నిరోధించడంతోపాటు పరిసరాల ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందజేయవచ్చునని భావిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో కబ్జాకు గురైనవి పోను మిగిలిన దాదాపు 170 చెరువులను పిక్నిక్ స్పాట్స్‌గా అభివృద్ధి చేస్తామని జీహెచ్ఎంసీ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా పనులు ముందుకు సాగడం లేదు. మరోవైపు ఆయా చెరువుల్లో గుర్రపుడెక్క పెరిగి దోమల తీవ్రతతో పరిసరాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మునిసిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌కు అందిన ఫిర్యాదుతో సరూర్‌నగర్ చెరువుతోపాటు మరో 10 చెరువులను అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమైన రూ. 287 కోట్ల నిధుల ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేసినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. ఇందులో మూడు చెరువులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్సార్) కింద అభివృద్ధి చేసేందుకు వివిధ సంస్థలు ముందుకు రావడంతో, వాటికి సంబంధించిన నిధులతో మీరాలం చెరువు, ఉప్పల్ నల్లచెరువు, తదితర చెరువులను అభివృద్ధి చేస్తామని మేయర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని చెరువుల అభివృద్ధికి భారీగా నిధులు కావాల్సి ఉండటం.. పనులు పూర్తిచేసేందుకుసమయం పట్టనుండటంతో పీపీపీ కింద అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చేవారికి అవకాశం కల్పిస్తామన్నారు. ప్రక్షాళన ఇలా.. చెరువులోని గుర్రపుడెక్క, మురికినీటిని పూర్తిగా తోడేస్తారు. ప్రక్షాళన అనంతరం చెరువులు తిరిగి కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటారు.డ్రైనేజీ లైన్లను దారి మళ్లిస్తారు. ఎస్టీపీలను నిర్మిస్తారు. కేవలం వర్షపునీరు మాత్రమే చెరువులో చేరేలా ఏర్పాటు చేస్తారు. సుందరీకరణ ఇలా.. చెరువుల కట్టలను పటిష్టం చేయడంతోపాటు చెరువు చుట్టూ వాకింగ్‌ట్రాక్, సైకిల్‌ట్రాక్ ఏర్పాటు చేస్తారు. మొక్కలు పెంచుతారు. పిల్లల ఆటసామాగ్రి, బోటింగ్ సదుపాయాలతో పిక్నిక్స్పాట్స్గా తీర్చిదిద్దుతారు. కెఫ్టేరియా, పార్కింగ్ తదితర సదుపాయాలు కల్పిస్తారు. ఓయూ రింగ్ రోడ్డుపైనా దృష్టి.. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న మోహిని చెరువును సైతం త్వరలో అభివృద్ధిచేయనున్నారు. ఈ పనులను జీహెచ్ఎంసీ స్వయంగా చేపట్టనుంది. దీంతోపాటు ఓయూలోని రహదారి గుండా వాహనాల రాకపోకలను నిరోధించి, ప్రత్యేకంగా ప్రహరీ తదితర ఏర్పాట్లతోపాటు ప్రస్తుతం ఓయూ రోడ్డుగుండా వెళ్తున్నవారు ఆయా ప్రాంతాలకు చేరుకునేందుకు చుట్టూ రింగ్ రోడ్డు నిర్మించాలనే యోచనలోనూ ఉన్నారు. సేకరణ అవసరమైతే.. అక్కడ నివాసాలుంటున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. సదుపాయాలు ఇవీ 1.చెరువు/సరస్సు స్థలం మేరప్రహరీ /ఫెన్సింగ్ ఏర్పాటు. 2. ప్రహరీ లోపల చెరువు ఒడ్డునఅందమైన పచ్చిక, ఫౌంటెన్లుతదితర సుందరీకరణ పనులు. 3. నడక మార్గాల ఏర్పాటు. 4. వివిధ రకాల మొక్కలతో పచ్చదనం . 5. కూర్చునేందుకు బెంచీలు..కుర్చీలు.. తదితర ఏర్పాట్లు. 6. పార్కింగ్ సదుపాయం. 7. రాత్రివేళల్లో ప్రత్యేక లైటింగ్. 8. స్నాక్స్, టీ/కాఫీల కెఫ్టేరియా 9. వాననీరు వెళ్లేందుకు బైపాస్ డ్రెయిన్లు 10. టాయ్లెట్లు.. తదితర సదుపాయాలు. -
సికింద్రాబాద్ స్టేషన్ ప్రత్యేకతలు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ఆధునిక హంగులు చుట్టూ వాణిజ్య సముదాయాల అభివృద్ధి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో పనులు త్వరలో టెండర్ల ఆహ్వానం ‘వరల్డ్ క్లాస్’ స్థానంలో ‘రీ మోడలింగ్’ సిటీబ్యూరో: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఇక కొత్త సొబగులు సంతరించుకోనుంది. రీమోడలింగ్‌లో భాగంగా అత్యాధునిక సదుపాయాలు, సరికొత్త హంగులతో స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు. ప్రయాణికులకు అన్నిరకాల సదుపాయాలను అందుబాటులోకి తేవడంతో పాటు, వాణిజ్య సదుపాయాలను కల్పిస్తారు. సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులే కాకుండా నగరవాసులు కూడా సందర్శించేందుకు అనుగుణంగా స్టేషన్ బయట రెండు ఎకరాల విస్తీర్ణంలో వాణిజ్య భవనాలు నిర్మించనున్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్మించనున్న ఈ వాణిజ్య కేంద్రాలలో మల్టిప్లెక్స్ థియేటర్లు, రెస్టారెంట్లు, త్రీస్టార్ హోటల్లు, ఇతర వినోద సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ఈ మేరకు తాజా కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన 25 రైల్వేస్టేషన్ల ఆధునీకరణలో దక్షిణమధ్య రైల్వేలోని సికింద్రాబాద్‌తో పాటు విజయవాడ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రీమోడలింగ్ కోసం త్వరలోనే టెండర్లను ఆహ్వానించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ బుధవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. రెండో దశకు నిధుల కొరత లేదు... ఎంఎంటీఎస్ –2 ప్రాజెక్టుతో పాటు, ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు తలపెట్టిన ఎంఎంటీఎస్–3వ దశ యాదాద్రి ప్రాజెక్టుకు సైతం నిధుల కొరత లేదని జీఎం పేర్కొన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం తెలంగాణలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ.1729 కోట్లు కేటాయించిందని, గత సంవత్సరం అందజేసిన రూ.601 కోట్లకు ఇది రెట్టింపు కంటే ఎక్కువేనని జీఎం సంతోషంవ్యక్తం చేశారు. ఎంఎంటీఎస్ రెండో దశతో పాటు,యాదాద్రి ప్రాజెక్టులను కూడా సకాలంలో చేపట్టి పూర్తి చేస్తామన్నారు. అలాగే చర్లపల్లి రైల్వే టర్మినల్‌కు ఈ ఆర్ధిక సంవత్సరంలోనే శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. పింక్‌బుక్‌లో ప్రకటించాకే పూర్తి వివరాలు... ఈ ఆర్ధిక సంవత్సరం రైల్వే ప్రాజెక్టులు, కొత్త రైళ్లు, కొత్త లైన్లు, దక్షిణమధ్య రైల్వేకు కేటాయించిన నిధులు, తదితర అంశాలపై పింక్ బుక్‌లో ప్రకటించిన తరువాతనే వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. ఈ నెల 3వ తేదీ న పింక్‌బుక్‌లో నమోదు చేసిన అనంతరం పూ ర్తి వివరాలు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. నిజాం హయాంలో నిర్మించిన ఈ చారిత్రాత్మక రైల్వేస్టేషన్ ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు ప్రధాన రైల్వే కేంద్రంగా విలసిల్లుతోంది. ప్రతి రోజు సుమారు 80 ఎక్స్‌ప్రెస్‌లు, 100 ప్యాసింజర్ రైళ్లు, మరో 60 ఎంఎంటీఎస్ రైళ్లు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తాయి. నిత్యం 2.5 లక్షల మంది ప్రయాణికులు సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. అన్ని కేటగిరీల ప్రయాణికులు, ఇతర మార్గాల నుంచి ప్రతి రోజు సుమారు రూ.3.5 కోట్ల ఆదాయం లభిస్తుంది. -
తెలంగాణ పునర్నిర్మాణంలో అందరి పాత్ర కీలకం
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంత అవశ్యమో.. పునర్నిర్మాణమూ అంతకంటే ఎక్కువ ముఖ్యమని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అన్ని వర్గాల పాత్ర కీలకంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌లో చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన అనివార్యమని చెప్పారు. అయితే సంపూర్ణ తెలంగాణ సాధించే వరకు పోరాటం ఆగదన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ విషయంలో ఇప్పటికీ వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నాయని, దీనివల్ల సమస్యల పరిష్కారానికి పోరాటం చేయక తప్పదన్నారు. హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణను మాత్రమే ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్ విషయంలో కేంద్రం ఎలాంటి పేచీ పెడితే ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని కోరారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాతే సంబరాలు చేసుకుందామని కోదండరాం పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలన్న సమైక్యవాదుల కుట్రను తిప్పికొట్టాలని డీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ అన్నారు.