రిలేషనే కాదు.. ఎదో తెలియని ఎమోషన్‌.. జుకర్‌బర్గ్‌ ఫోటో వైరల్‌ | Meta CEO Mark Zuckerberg takes sewing lessons to make dresses for his daughters | Sakshi
Sakshi News home page

రిలేషనే కాదు.. ఎదో తెలియని ఎమోషన్‌.. జుకర్‌బర్గ్‌ ఫోటో వైరల్‌

Published Sun, May 7 2023 12:27 AM | Last Updated on Sun, May 7 2023 3:34 PM

Meta CEO Mark Zuckerberg takes sewing lessons to make dresses for his daughters - Sakshi

ముగ్గురు ఆడపిల్లల మురిపాల తండ్రి మెటా సీయివో మార్క్‌ జుకర్‌బర్గ్‌. మాగ్జిమా (7), ఆగస్ట్‌(5)లకు తోడుగా గత మార్చి నెలలో ఈ లోకంలోకి వచ్చింది ఔరేలియ. ‘వెల్‌కమ్‌ టూ ది వరల్డ్‌’ అంటూ ఆ చిట్టి ఫోటోను పోస్ట్‌ చేసి స్వాగతం పలికాడు జుకర్‌బర్గ్‌.

తాజా విషయానికి వస్తే...
పెద్దమ్మాయి, రెండో అమ్మాయిల కోసం తానే స్వయంగా త్రీడీ ప్రింటింగ్‌ డ్రెస్‌లను డిజైన్‌ చేయడంతో పాటు కుట్టుపని కూడా నేర్చుకున్నాడు జుకర్‌బర్గ్‌. తాను డిజైన్‌ చేసిన గౌన్‌ను పిల్లలు ధరించారు. ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు జుకర్‌బర్గ్‌. ఈ ఫొటో బాగా వైరల్‌ అయింది.
చదవండి: కర్బూజ జ్యూస్‌ తాగుతున్నారా? అధిక మోతాదులో పొటాషియం ఉండటం వల్ల..

‘జుకర్‌ బర్గ్‌... మీరు ఎన్ని గొప్ప విజయాలు సాధించినా సరే, పిల్లల డ్రెస్‌ కోసం కేటాయించిన సమయం అత్యంత విలువైనది. భవిష్యత్‌లో మీ పిల్లలకు ఎప్పుడూ గుర్తుండిపోయే విలువైన సందర్భం ఇది’ అంటూ నెటిజనులు స్పందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement