Kids frock
-
రిలేషనే కాదు.. ఎదో తెలియని ఎమోషన్.. జుకర్‌బర్గ్ ఫోటో వైరల్
ముగ్గురు ఆడపిల్లల మురిపాల తండ్రి మెటా సీయివో మార్క్ జుకర్‌బర్గ్. మాగ్జిమా (7), ఆగస్ట్(5)లకు తోడుగా గత మార్చి నెలలో ఈ లోకంలోకి వచ్చింది ఔరేలియ. ‘వెల్కమ్ టూ ది వరల్డ్’ అంటూ ఆ చిట్టి ఫోటోను పోస్ట్ చేసి స్వాగతం పలికాడు జుకర్‌బర్గ్. తాజా విషయానికి వస్తే... పెద్దమ్మాయి, రెండో అమ్మాయిల కోసం తానే స్వయంగా త్రీడీ ప్రింటింగ్ డ్రెస్‌లను డిజైన్ చేయడంతో పాటు కుట్టుపని కూడా నేర్చుకున్నాడు జుకర్‌బర్గ్. తాను డిజైన్ చేసిన గౌన్‌ను పిల్లలు ధరించారు. ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు జుకర్‌బర్గ్. ఈ ఫొటో బాగా వైరల్ అయింది. చదవండి: కర్బూజ జ్యూస్ తాగుతున్నారా? అధిక మోతాదులో పొటాషియం ఉండటం వల్ల.. ‘జుకర్ బర్గ్... మీరు ఎన్ని గొప్ప విజయాలు సాధించినా సరే, పిల్లల డ్రెస్ కోసం కేటాయించిన సమయం అత్యంత విలువైనది. భవిష్యత్‌లో మీ పిల్లలకు ఎప్పుడూ గుర్తుండిపోయే విలువైన సందర్భం ఇది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
లేయర్డ్ ఫ్రాక్
న్యూలుక్ పిల్లల ఫ్రాక్ పొట్టిగా అవడం లేదా ఒకే రకమైన ఫ్రాక్‌ని మళ్లీ మళ్లీ వేసుకోవడానికి ఇష్టపడకపోవడం వంటివి అమ్మాయిలున్న అందరిళ్లలో సహజంగా కనిపించేవి. కురుచ ఫ్రాక్లను ఆకర్షణీయంగా మార్చేస్తే.. అమ్మాయిల హ్యాపీగా అందుకుంటారు. కొత్త మోడల్‌గా మారిపోయిన తమ ఫ్రాక్‌లో మరింత అందంగా మెరిసిపోతారు. పొట్టి ఫ్రాక్ పొడుగ్గా! పూర్తి కాంట్రాస్ట్ క్లాత్ లేదా అదే రంగు ప్రింట్లు ఉన్న క్లాత్‌తో కింది భాగాన కుచ్చులు పెడితే ఫ్రాక్ పొడుగవుతుంది. దీనికి అంచు భాగాన మరో క్లాత్‌తో కుచ్చులు పెట్టాలి. ఇలా ఎంత పొడవు కావాలో అంత వరకు ఫ్రాక్ను డిజైన్ చేసుకోవచ్చు. దీంట్లో భాగంగా లేస్ డిజైన్స్ కూడా వాడుకోవచ్చు. ఓవర్ కోట్ డిజైన్ జత చేస్తే ఓ కొత్త రకం ఫ్రాక్ మోడల్ రెడీ. రెండు ఫ్రాక్‌లు ఒకటిగా! ఫొటోలో చూపిన విధంగా రెండు ఫ్రాక్లను ఒకటిగా కలిపి కుట్టవచ్చు. అప్పుడు పొరలు పొరలుగా ఫ్రాక్... బుట్టబొమ్మను తలపిస్తుంది. నేటికాలానికి తగినట్టుగా! అనార్కలీ ఫ్రాక్, ఫ్లోర్ లెంగ్త్ ఫ్రాక్గానూ మార్చుకోవచ్చు. చుడీ మీదకు లేదా పలాజో స్కర్ట్స్ మీదకు వీటిని ధరిస్తే నేటికాలానికి తగిన విధంగా ఉంటుంది.