IFFM Awards 2023 Rani Mukerji మెల్‌బోర్న్‌లో (ఆగష్టు 11,2023న) జరిగిన ఐఎఫ్‌ఎఫ్‌ఎం అవార్డ్స్ 2023 ప్రదానోత్సవంలో బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వేలో తన అద్భుతమైన నటనకు గాను రాణి ముఖర్జీ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. ఈ సందర్బంగా ఆమె ధరించిన చీర, ఆమె రూపం అక్కడున్న వారందరినీ మెస్మరైజ్ చేసింది.
మిసెస్ ఛటర్జీ Vs నార్వేని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరించడం చాలా గర్వంగా ఉందంటూ, IFFM జ్యూరీకి తోపాటు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. ఇది తల్లి శక్తి ప్రదర్శించే విశ్వవ్యాప్త కథ అని దీనికి ఉత్తమ నటి అవార్డు రావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా అన్నారు. అలాగే షారుఖ్ ఖాన్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ పఠాన్ IIFMలో పీపుల్స్ ఛాయిస్ అవార్డును అందుకుంది. ఆస్ట్రేలియాలో 4.7 మిలియన్ డాలర్లు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. భర్త, నిర్మాత ఆదిత్య చోప్రా, పఠాన్ టీం తరపున రాణీ ముఖర్జీ ఆస్ట్రేలియాలో ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది.
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన తెలుగు చిత్రం సీతా రామం ఉత్తమ చిత్రం అవార్డును కైవసం చేసుకుంది
ఈ ఈవెంట్‌లో రాణి ముఖర్జీ లుక్ అదిరిపోయింది. ప్రఖ్యాత డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన బ్లాక్ చీరలో అందరి కళ్లను తనవైపు తిప్పుకుంది. విశాలమైన ఈ ఫెదర్ బోర్డ్‌ర్ చీరకు జతగా సీక్విన్డ్ హాఫ్-స్లీవ్ బ్లౌజ్‌తో జత చేసి అద్భుతంగా కనిపించింది. అంతేనా లగ్జరీ బ్రాండ్ మల్టిపుల్ టైర్డ్ పెర్ల్ నెక్లెస్, చక్కటి మేకప్‌తో మరింత స్టన్నింగ్ లుక్స్‌లో కనిపించడం ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.
అంతకుముందు కూడా మసాబా గుప్తా రూపొందించిన నలుపు-రంగు చందేరీ ముల్, వైట్ థ్రెడ్స్ ముడి పట్టు చీరను ధరించింది. దీనిపై దేవనాగరిలో ముద్రించిన 'మా', తెల్లటి టాసెల్ ఎంబ్రాయిడరీ చేయించి ఉండటం విశేషం. దీని ధర రూ. 17,000. దీంతో లేటెస్ట్ సవ్యసాచి డిజైన్డ్ సారీ ధర ఎంత ఉంటుందనే దాని అభిమానుల్లో చర్చ మొదలు కావడం విశేషం
Comments
Please login to add a commentAdd a comment