IFFM
-
ఐఎఫ్ఎఫ్ఎమ్కి అతిథిగా రామ్‌చరణ్
రామ్‌చరణ్‌కి అరుదైన గౌరవం దక్కింది. ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’ (ఐఎఫ్ఎఫ్ఎమ్) 15వ ఎడిషన్‌లో ఈ హీరో గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. ‘‘రామ్‌చరణ్ వస్తున్నారు. ‘నాటు నాటు..’ పాటకు డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ ఎక్స్ వేదికగా ‘ఐఎఫ్ఎఫ్ఎమ్’ తెలియజేసింది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి 25 వరకు మెల్బోర్న్లో ఈ చిత్రోత్సవం జరగనుంది.ఈ వేడుకలో రామ్‌చరణ్ అతిథిగా పాల్గొనడంతో పాటు భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకుగాను ‘ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్’ అవార్డును కూడా అందుకోనున్నారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ స్పందిస్తూ– ‘‘భారతీయ సినిమా గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని అంతర్జాతీయ వేదికపై సెలబ్రేట్ చేసుకునే ‘ఐఎఫ్ఎఫ్ఎమ్–2024’లో భాగం అవుతున్నందుకు గౌరవంగా భావిస్తున్నాను. మన చిత్ర పరిశ్రమకుప్రాతినిధ్యం వహించనుండటం నా అదృష్టం. ‘ఆర్ఆర్ఆర్’ విజయం విశ్వవ్యాప్తం. మెల్బోర్న్లో ప్రేక్షకులను కలుసుకునేందుకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. -
ఐఎఫ్ఎఫ్ఎం అవార్డ్స్ 2023: అదరగొట్టిన నటి, బ్లాక్ చీర ధరపై చర్చ
IFFM Awards 2023 Rani Mukerji మెల్బోర్న్లో (ఆగష్టు 11,2023న) జరిగిన ఐఎఫ్ఎఫ్ఎం అవార్డ్స్ 2023 ప్రదానోత్సవంలో బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వేలో తన అద్భుతమైన నటనకు గాను రాణి ముఖర్జీ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. ఈ సందర్బంగా ఆమె ధరించిన చీర, ఆమె రూపం అక్కడున్న వారందరినీ మెస్మరైజ్ చేసింది. మిసెస్ ఛటర్జీ Vs నార్వేని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరించడం చాలా గర్వంగా ఉందంటూ, IFFM జ్యూరీకి తోపాటు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. ఇది తల్లి శక్తి ప్రదర్శించే విశ్వవ్యాప్త కథ అని దీనికి ఉత్తమ నటి అవార్డు రావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా అన్నారు. అలాగే షారుఖ్ ఖాన్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ పఠాన్ IIFMలో పీపుల్స్ ఛాయిస్ అవార్డును అందుకుంది. ఆస్ట్రేలియాలో 4.7 మిలియన్ డాలర్లు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. భర్త, నిర్మాత ఆదిత్య చోప్రా, పఠాన్ టీం తరపున రాణీ ముఖర్జీ ఆస్ట్రేలియాలో ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన తెలుగు చిత్రం సీతా రామం ఉత్తమ చిత్రం అవార్డును కైవసం చేసుకుంది ఈ ఈవెంట్లో రాణి ముఖర్జీ లుక్ అదిరిపోయింది. ప్రఖ్యాత డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన బ్లాక్ చీరలో అందరి కళ్లను తనవైపు తిప్పుకుంది. విశాలమైన ఈ ఫెదర్ బోర్డ్ర్ చీరకు జతగా సీక్విన్డ్ హాఫ్-స్లీవ్ బ్లౌజ్‌తో జత చేసి అద్భుతంగా కనిపించింది. అంతేనా లగ్జరీ బ్రాండ్ మల్టిపుల్ టైర్డ్ పెర్ల్ నెక్లెస్, చక్కటి మేకప్‌తో మరింత స్టన్నింగ్ లుక్స్‌లో కనిపించడం ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అంతకుముందు కూడా మసాబా గుప్తా రూపొందించిన నలుపు-రంగు చందేరీ ముల్, వైట్ థ్రెడ్స్ ముడి పట్టు చీరను ధరించింది. దీనిపై దేవనాగరిలో ముద్రించిన 'మా', తెల్లటి టాసెల్ ఎంబ్రాయిడరీ చేయించి ఉండటం విశేషం. దీని ధర రూ. 17,000. దీంతో లేటెస్ట్ సవ్యసాచి డిజైన్డ్ సారీ ధర ఎంత ఉంటుందనే దాని అభిమానుల్లో చర్చ మొదలు కావడం విశేషం View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) -
స్టేజ్‌పై తమన్నా తీరుకు సౌత్ ఫ్యాన్స్ ఫిదా, ఏం చేసిందంటే..
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది. ఓ అవార్డు ఫంక్షన్ కార్యక్రమంలో స్టేజ్‌పై తమన్నా వ్యవహించిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. రీసెంట్గా ఆస్ట్రేలియాలోని జరిగిన ఐఎఫ్ఎఫ్ఎమ్ (ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్) అవార్డు కార్యక్రమానికి తమన్నా ముఖ్య అతిథిగా హాజరైంది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చదవండి: ఆమె అంటే క్రష్, ఆ స్టార్ హీరోయిన్‌తో నటించాలని ఉంది: నాగ చైతన్య ఈ క్రమంలో ఈవెంట్ నిర్వాహకులు ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరోయిన్లు తమన్నా, తాప్సీ పన్ను సైతం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా తాప్సీ చెప్పులు ధరించే జ్యోతి ప్రజ్వలన చేయగా.. తమన్నా మాత్రం దక్షిణాది సంస్కృతి ఉట్టిపడేలా వ్యవహరించి, సౌత్ ప్రజలు ఔరా అనేలా చేసింది. జ్యోతి ప్రజ్వలన చేసే ముందు చెప్పులు పక్కకు విడిచి దీపం వెలిగించింది. ఆ పక్కనే ఉన్న ఈవెంట్ ఆర్గనైజర్ తమన్నాను.. ఇలా ఎందుకు చేశారు అని అడ్గగా.. ఇది దక్షిణాది సంస్కృతి అని బదులులిచ్చింది. చదవండి: రూ. 2 కోట్లు ఇస్తే రిటర్న్ పంపించాడు: విజయ్‌పై పూరీ ఆసక్తికర వ్యాఖ్యలు ఇందుకు సంబంధించిన వీడియోను తమన్నా ఫ్యాన్ ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ అంత తమన్నాకు ఫిదా అవుతున్నారు. ‘తమన్నాకు దక్షిణాది నేర్పించింది ఇదే’ ,‘సంస్కృతిని గౌరవించడమంటే ఇదే కదా’, ‘చిన్న చిన్న విషయాలే గొప్పగా నిలబెడతాయి’, ‘భారతదేశ గొప్ప వారసత్వ సంస్కృతిని తమన్నా చూపించింది’ అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Karthick_Speaks ✳️🏅 (@suriya_tamannaah) View this post on Instagram A post shared by Karthick_Speaks ✳️🏅 (@suriya_tamannaah) -
సినిమాల్లోనే కొనసాగుతా..
తాను సినిమాల్లోనే కొనసాగుతానని, రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనేదీ లేదని ప్రస్తుతం ఆస్ట్రేలియాలో విహరిస్తున్న బాలీవుడ్ నటి విద్యాబాలన్ చెప్పింది. ఒక భారతీయురాలిగా ఓటు మాత్రం వేస్తానంది. మెల్బోర్న్లో శుక్రవారం ఆరంభమైన భారత మెల్బోర్న్ చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఎం) సందర్భంగా ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఈ సంగతి తెలిపింది. ఐఎఫ్‌ఎఫ్‌ఎంకు మూడోసారీ ప్రచారకర్త ఎంపికయినందుకు సంతోషంగా ఉందని చెప్పిన విద్య... పద్మశ్రీ అవార్డు స్వీకరించేందుకు ఢిల్లీకి సోమవారం వస్తోంది. ‘ప్రతిభ ఉన్న దర్శకులు, నటులతో కలసి పనిచేయడాన్ని తాను ఇష్టపడుతాను. ప్రత్యేకంగా అవార్డుల కోసం ఏ ఒక్క పాత్ర/సినిమా చేయలేదు. సత్తా చూపిస్తే అవార్డులు వాటంతట అవే వస్తాయి’ అని ఈ 36 ఏళ్ల బ్యూటీ చెప్పింది. విద్యాబాలన్ గర్భిణి అంటూ వచ్చిన వార్తలనూ ఈమె కొట్టిపారేసింది. పస్తుతం స్వల్ప విరామం మాత్రమే తీసుకున్నానని, తరచూ షూటింగ్‌లకు వెళ్తున్నానని వివరించింది. అయితే విద్య గత రెండు నెలలుగా షూటింగులకు వెళ్లడం లేదు. ఆమె తాజా సినిమా బాబీ జసూస్ జూన్ లేదా జూలైలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కామెడీ సినిమాలో విద్య డిటెక్టివ్‌గా కనిపిస్తుంది. సమర్‌షేక్ దీనికి దర్శకత్వం వహించగా, నటి దియామీర్జా, ఆమె ప్రియుడు రాహుల్‌సంఘా ఈ సినిమాను నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో కనిపిస్తానని చెప్పింది. సుజొయ్ ఘోష్ తాజాగా తీస్తున్న దుర్గారాణి సింగ్‌లో విద్యాబాలన్‌ను కథానాయికగా తీసుకోవాలని అనుకున్నా, చివరికి కంగనా రనౌత్‌కు అవకాశం దక్కిందని వార్తలు వచ్చాయి. దీని గురించి అడిగితే కంగనకు ఆ సినిమాలో అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని విద్యాబాలన్ చెప్పింది.