రామ్‌చరణ్‌కి అరుదైన గౌరవం దక్కింది. ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్’ (ఐఎఫ్‌ఎఫ్‌ఎమ్) 15వ ఎడిషన్‌లో ఈ హీరో గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. ‘‘రామ్‌చరణ్ వస్తున్నారు. ‘నాటు నాటు..’ పాటకు డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ ఎక్స్ వేదికగా ‘ఐఎఫ్‌ఎఫ్‌ఎమ్’ తెలియజేసింది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి 25 వరకు మెల్‌బోర్న్‌లో ఈ చిత్రోత్సవం జరగనుంది.
ఈ వేడుకలో రామ్‌చరణ్ అతిథిగా పాల్గొనడంతో పాటు భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకుగాను ‘ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్’ అవార్డును కూడా అందుకోనున్నారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ స్పందిస్తూ– ‘‘భారతీయ సినిమా గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని అంతర్జాతీయ వేదికపై సెలబ్రేట్ చేసుకునే ‘ఐఎఫ్‌ఎఫ్‌ఎమ్–2024’లో భాగం అవుతున్నందుకు గౌరవంగా భావిస్తున్నాను. మన చిత్ర పరిశ్రమకుప్రాతినిధ్యం వహించనుండటం నా అదృష్టం. ‘ఆర్‌ఆర్‌ఆర్’ విజయం విశ్వవ్యాప్తం. మెల్‌బోర్న్‌లో ప్రేక్షకులను కలుసుకునేందుకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment