అలియా చీర స్పెషల్‌ ఎట్రాక్షన్‌: విషయం తెలిస్తే మీరూ షాకవుతారు! | Alia Bhatt Stuns At The Hope Gala Vintage Saree; Check Details | Sakshi
Sakshi News home page

అలియా చీర స్పెషల్‌ ఎట్రాక్షన్‌: విషయం తెలిస్తే మీరూ షాకవుతారు!

Mar 29 2024 4:56 PM | Updated on Mar 29 2024 5:42 PM

Alia Bhatt Stuns At The Hope Gala Vintage Saree check details - Sakshi

30 ఏళ్లనాటి  చీరలో మెరిసిపోయిన బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అలియా  భట్‌. కొత్తగా  సిద్ధం చేయడానికి 3500 గంటలు పట్టిందట.

30 ఏళ్లనాటి  చీరలో మెరిసిపోయిన బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అలియా 

కొత్తగా  సిద్ధం చేయడానికి 3500 గంటలు పట్టిందట

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అలియా భట్ హోప్ గాలా 2024 ఈవెంట్‌లో అందరి చూపులను తన వైపునకు తిప్పుకుంది. ఇటీవల తన తొలి హోప్ గాలాను లండన్‌లో నిర్వహించింది.  ఈసందర్భంగా  30 ఏళ్ల నాటి వింటేజ్‌ సారీని కొత్తగా డిజైన్‌ చేయించుని మరీ ధరించింది. ఇవరీ రేషమ్‌ సారీలో తన స్టయిలిష్‌లుక్‌తో అందర్నీ మెస్మరైజ్‌ చేసింది. దీనికి  జతగా  టోర్టటైజ్‌ నెక్‌లైన్‌ క్రిస్టల్-ఎంబెడెడ్‌, వెనుక ముత్యాల లైన్లతో తీర్చిదిద్దిన బ్లౌజ్ మరింత  అందంగా నప్పింది.  (వేసవిలో చల్ల చల్లగా : గోండ్‌ కటీరా జ్యూస్‌.. ఒక్కసారి తాగితే..!)

హోప్ గాలా 2024 ఈవెంట్‌కోసం ఈ చీరను ప్రముఖ డిజైనర్లు అబుజానీ, సందీప్ ఖోస్లా స్పెషల్‌గా డిజైన్‌ చేశారట. వీరు దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ఆకులు,పువ్వుల డిజైన్లతో పట్టు దారాలతో ఎంబ్రాయిడరీ చేసినట్టు తెలిపారు. అంతేకాదుఈ చీర వాస్తవానికి 1994లో తయారు  చేసిందట. 30 ఏళ్లనాటి ఈ చీరను మళ్లీ కొత్తగా  సిద్ధం చేయడానికి 3500 గంటలు పట్టిందని తెలిపారు. ఇదే ఈవెంట్‌లో పర్పుల్‌ కలర్‌ డ్రెస్‌తో మెరిసింది అలియా. (ముఖేష్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ : ఆనంద్‌ మహీంద్ర ఫిదా!)

2023లోఅలియా మెట్ గాలా అరంగేట్రంలో లక్ష ముత్యాలతో చేసిన గౌనుతో అందరినీ ఆశ్చర్యపరిచింది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన  అలియా సక్సెస్‌పుల్‌ హీరోయిన్‌గా దూసుకు పోతోంది. బాలీవుడ్‌ స్టార్‌హీరో ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌ని పెళ్లాడింది. పెళ్లి తరువాత ఇద్దరూ వరుస హిట్లతో దుమ్ము రేపుతున్నారు.అలాగే జాతీయ,అంతర్జాతీయబ్రాండ్లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంది. అంతేనా ఒక దుస్తుల బ్రాండ్‌కు సీఈవో వ్యాపార రంగంలోనూ తన సత్తా చాటుకుంటోంది. ఈ స్వీట్‌ కపుల్‌కు రాహా కపూర్ అనే ముద్దుల కూతురుకూడా ఉన్న సంగతి తెలిసిందే. (మర్డర్‌ మిస్టరీని ఛేదించిన పోలీసులు: సెల్ఫీ వీడియో పుణ్యమే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement