Alia Bhatt's Rocky Aur Rani Kii Prem Kahaani Teaser - Sakshi
Sakshi News home page

Alia Bhatt: ఒక్క నిమిషంలో ఆలియా భట్ 20 చీరల‍్లో!

Published Tue, Jun 20 2023 2:18 PM | Last Updated on Tue, Jun 20 2023 2:49 PM

Alia Bhatt Rocky Aur Rani Kii Prem Kahaani Teaser - Sakshi

బాలీవుడ్ లో చాలామంది స్టార్స్ తో పోలిస్తే ఆలియా భట్ సమ్‌థింగ్ స్పెషల్. టీనేజ్ లోనే హీరోయిన్ అయిపోయింది. చాలా తక్కువ టైంలోనే స్టార్ డమ్ సంపాదించింది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. హాలీవుడ్ లోనూ ఈమె నటించిన తొలి మూవీ త్వరలో విడుదల కానుంది. ఇలాంటి టైంలో ఆలియా భట్.. ఓ విషయంతో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేసింది. 

(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!)

ఆలియా భట్ ప్రస్తుతం హిందీలో చేస్తున్న మూవీ 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ'.. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జూలై 28న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా టీజర్ ని మంగళవారం రిలీజ్ చేశారు. 1:19 నిమిషాల ఈ వీడియో.. చూడటానికి ఫుల్ కలర్‌ఫుల్ గా ఉంది. మ్యూజిక్ కూడా వినసొంపుగా ఉంది. ఈ టీజర్ చూస్తుంటే.. గతంలో బాలీవుడ్ లో వచ్చిన ఫ్యామిలీ సినిమాలే గుర్తొచ్చాయి.

'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' చిత్రం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా కనిపిస్తున్నప్పటికీ.. ఇందులో ఆలియాభట్ చీరలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఎందుకంటే నిమిషం టీజర్ లోనే దాదాపు 20కి పైగా చీరల్లో ఈ బ్యూటీ సందడి చేసింది. మరి మూవీ మొత్తంలో ఇంకెన్ని చీరల్లో కనిపిస్తుందోనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆలియా భట్ కట్టుకున్న చీరలన్నీ కూడా అమ్మాయిలకు తెగ నచ్చేస్తున్నాయి.

(ఇదీ చదవండి: చరణ్-ఉపాసన బిడ్డకు ఆ నంబర్ సెంటిమెంట్!?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement