ఫ్యాషన్‌ ప్రపంచాన్నే ఊపేస్తున్న పేదింటి అమ్మాయిలు | Lucknow Underprivileged girls recreated Sabyasachi Bridal Wear | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్‌ ప్రపంచాన్నే ఊపేస్తున్న పేదింటి అమ్మాయిలు

Published Sat, Nov 9 2024 3:33 PM | Last Updated on Sat, Nov 9 2024 4:54 PM

Lucknow Underprivileged girls recreated Sabyasachi Bridal Wear

 ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్‌ సబ్యసాచి ముఖర్జీ  ప్రేరణతో బ్రైడల్‌ వేర్‌

పాత బట్టలతో నిరుపేద బాలికల అద్భుత సృష్టి : సబ్యసాచి ప్రశంసలు 

లక్నోకు చెందిన నిరుపేద యువతులు అద్భుతాలు సృష్టించారు. పాపులర్‌ ఫ్యాషన్‌ డిజైనర్ల ప్రేరణతో  అందమైన బ్రైడల్ డిజైనర్‌ దుస్తులను తయారు చేశారు. అదీ తమకు దానంగా వచ్చిన బట్టల నుంచి. అలా మనసు ఉండాలేగానీ, ప్రతిభ ఏ ఒక్కరి సొత్తూ కాదని ఈ అమ్మాయిలు నిరూపించారు.  వీరు సృష్టించిన డిజైన్లు,  మోడలింగ్‌ వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. 

ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్‌ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ స్ఫూర్తితో లక్నోలోని నిరుపేద పిల్లల బృందం తమ సృజనాత్మకతను గ్లామరస్ బ్రైడల్ వేర్‌గా అబ్బురపోయే డిజైన్లు, ఆకర్షణీయ మైన దుస్తులతో  ఇంటర్నెట్‌లో సంచలనంగా మారారు. లక్నోకు చెందిన ఇన్నోవేషన్ ఫర్ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన నిరుపేద పిల్లలు. వీరి ప్రతిభకు నెటిజన్లు ఔరా అంటున్నారు.

 సబ్యసాచి ముఖర్జీ  ప్రేరణతోనే వీరు ఈ డిజైన్లను తీర్చిదిద్దారు. వివిధ సంస్థలు, వ్యక్తులనుంచి తమకు విరాళంగా ఇచ్చిన బట్టలు , మిగిలిపోయిన బట్టలు ఉపయోగించి డిజైనర్ ఐకానిక్ డిజైన్లకు పునఃసృష్టి చేశారు. అంతేకాదు వారు రూపొందించిన దుస్తులతో మోడలింగ్ చేయడం మరింత విశేషంగా నిలిచింది. అద్భుతమైన  నైపుణ్యం, సృజనాత్మకత, ప్రతిభతో వారంతా  స్వయంగా  సబ్యసాచిని  ప్రశంసలను కూడా  దక్కించుకున్నారు. తన ఇన్‌స్టాలో కూడా ఈ వీడియోను పోస్ట్‌ చేశారు.

 దీనికి సంబంధించిన వీడియోను ఎన్‌జీవో ఇన్‌స్టాగ్రామ్‌లో  షేర్‌  చేసింది. “మేము లక్నోకు చెందిన NGO, 400+ మురికివాడల పిల్లలతో పని చేస్తున్నాము. ఈ పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాం ఈ డ్రెస్‌లను మా విద్యార్థులే డిజైన్ చేశారు. ఇందులో ప్రదర్శన ఇస్తున్న విద్యార్థులందరూ మురికివాడల ప్రాంతాలకు చెందిన వారే. ఈ పిల్లలు చాలా పేద మరియు నిస్సహాయ కుటుంబాల నుండి వచ్చారు. వారు తమ సృజనాత్మకత ద్వారా డిజైనర్ దుస్తులను రూపొందించారు. వీరంతా  స్థానికులు ,చుట్టుపక్కల వారినుంచి  వచ్చిన దుస్తులతో  వీటిని తీర్చిదిద్దారు. వీడియోలో కనిపిస్తున్న ఈ బాలికలు బస్తీలో నివసిస్తున్న 12 నుండి 17  ఏళ్ల వయస్సున్నబాలికలు’’ అని వివరించింది. ఈ వీడియోను 15 ఏళ్ల ఔత్సాహిక వీడియో గ్రాఫర్స్‌వ చిత్రీకరించారని కూడా వెల్లడించింది.

 కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో, సబ్యసాచి ఇటీవల తన 'హెరిటేజ్ బ్రైడల్'  కలెక్షన్స్‌ మోడల్స్‌ వీడియోను పోస్ట్ చేశాడు: "ఎరుపు రంగు సీజనల్‌ కాదు.., ఐకానిక్." అని పోస్ట్‌ చేశారు. ఈ థీమ్‌తోనే అదే రంగులో లక్నో  గాళ్స్‌ అదే డిజైన్స్‌ను పునఃసృష్టించారు.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement