ప్రేమకు నీరాజనం!
అందమైన ప్రేమకథతో, యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ‘నీరాజనం’. మహేశ్, సబ్యసాచి, కారుణ్య ముఖ్యతారలుగా అవన్ ఆళ్ల దర్శకత్వంలో దాడి అప్పలనాయుడు నిర్మించనున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది.
‘‘ఎవరికి ఎవరు నీరాజనం చెప్పారనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే’’ అని దర్శక,నిర్మాతలు తెలిపారు.