మిసెస్‌& మిస్టర్‌ అదు-సిద్ధు: డిజైనర్‌ దుస్తుల్లో సింపుల్‌గా ఎంత సక్కగున్నారో! | Aditi Rao Hydari Exudes Old World Charm In Beige Sabyasachi Lehenga | Sakshi
Sakshi News home page

మిసెస్‌& మిస్టర్‌ అదు-సిద్ధు: డిజైనర్‌ దుస్తుల్లో సింపుల్‌గా ఎంత సక్కగున్నారో!

Published Mon, Sep 16 2024 3:10 PM | Last Updated on Mon, Sep 16 2024 5:16 PM

Aditi Rao Hydari Exudes Old World Charm In Beige Sabyasachi Lehenga

చిరకాల ప్రేమికులు అదితి రావ్ హైదరి, సిద్దార్థ్‌ సూర్యనారాయణ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సోమ‌వారం ఉద‌యం తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో  వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం మిసెస్ అండ్‌ మిస్టర్ అదు-సిద్ధు ఫోటోలు సోషల్‌ మీడియాలో  హాట్‌ టాపిక్‌గా నిలుస్తున్నాయి. 

నూతన దంపతులుగా, పెళ్లి  దుస్తుల్లో బట్టల్లో చాలా అందంగా కనిపించారు.  ప్రఖ్యాత డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ   డిజైన్‌  చేసిన దుస్తుల్లో  స్పెషల్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కొత్త పెళ్లికూతురి గెటప్‌లో అదితి రావ్ హైదరీ లేత గోధుమరంగు , గోల్డెన్ లెహంగాలో మెరిసిపోయింది. 

ఈ లెహంగా ఆమెకు  రాయల్ లుక్‌ తెచ్చి పెట్టింది.  లెహంగాకు బంగారు రంగు చారల బ్లౌజ్‌ను, అందమైన చున్నీని  జత చేసింది.  భారీ అలంకారాలు లేకుండా సింపుల్‌గా అదితి  పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అంతేకాదు ఒక  చౌకర్‌, చెవిపోగులు, గాజులులతోపాటు భారీ మెహందీ హడావుడి లేకుండా, కాళ్లకు చేతులతో అర్థ చంద్రాకారంలో పారాణితో మెరిసింది. 

 అటు సిద్ధార్థకూడా సింపుల్‌ స్టయిల్‌నే ఎంచుకున్నాడు.  వైట్‌ కలర్‌ ఎంబ్రాయిడరీ కుర్తాలో,కొల్హాపురి చెప్పులతో  దక్షిణాది పెళ్లికొడుకులా ఆకట్టుకున్నాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement