నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో అన్‌స్టాపబుల్. ప్రస్తుతం రెండో సీజన్ కొనసాగుతోంది. ఇటీవల ఈ షోలో యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్‌లు పాల్గొని సందడి చేశారు. ఈ షోలో హీరో శర్వానంద్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి ప్రేమలో ఉన్నారంటూ వచ్చిన వార్తలపై శర్వానంద్ స్పందించారు.
బాలకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు శర్వానంద్ నవ్వుతూ సమాధానలిచ్చారు. మీరు సాధారణంగా హీరోయిన్లను ఎలా ఎంపికచేసుకుంటారు అని అడగ్గా.. ఆ విషయంలో నేను చేసేదేం లేదు. అంతా డైరెక్టర్లు చెప్పింది చేయడం తప్ప. నాకు ప్రత్యేకంగా ఎంపిక అంటూ లేదు' అంటూ సమాధానమిచ్చారు. మరీ అదితి రావు సంగతేంటీ? అని బాలయ్య ప్రశ్నించగా.. 'ఆమె మహాసముద్రంలో సిద్ధార్థ్‌కి జోడీగా నటించింది.. కానీ నాకు జోడీగా నటించలేదు అని అన్నారు. దానికి బాలయ్య ‘నిజ జీవితంలో కూడా సిద్ధార్థ్‌కి జంటగా మారిందా?’ అని శర్వానంద్‌ను మళ్లీ అడిగాడు.
(చదవండి: సిద్దార్థ్, అదితిల సీక్రెట్ డేటింగ్? వైరల్‌గా హీరో పోస్ట్)
దీనికి శర్వానంద్ బదులిస్తూ.. ' ఏమో నాకేం తెలియదు, సిద్ధార్థ్ బయట ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. అతను సోషల్ మీడియాలో ‘స్వీట్ హార్ట్’ అంటూ ఓ పిక్ పోస్ట్ చేశాడు. కానీ అది నాకు అర్థం కాలేదు.' అని అన్నారు. కాగా.. సిద్ధార్థ్, అదితిరావు హైదరీ, శర్వానంద్ కలిసి మహాసముద్రం సినిమాలో నటించారు.
ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్ ముందు సిద్ధార్థ్, అదితిరావు హైదరీ జంటగా మీడియాకు చిక్కారు. దీంతో అప్పటి నుంచి సిద్ధార్థ్, అదితిలు ప్రేమలో మునిగితేలుతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, సినిమా ఈవెంటస్ కలిసి హజరవుతుండటంతో తరచూ వీరు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇంతవరకు తమ డేటింగ్ రూమర్స్‌పై ఈ జంట స్పందించలేదు. ఇటీవల అదితి బర్త్‌డే సందర్భంగా సిద్ధార్థ్ చేసిన పోస్ట్ వైరలైంది.
(చదవండి: ఆమె చూస్తే తట్టుకోలేదని బాత్‌రూమ్‌కు వెళ్లి ఏడ్చేదాన్ని: అదితి రావు)
Comments
Please login to add a commentAdd a comment