ఒకప్పుడు కటిక దారిద్యంతో చాలా తిప్పలు పడ్డాడు. కాలేజీ పీజులు చెల్లించడానికి పుస్తకాలు అమ్మాడు. నేడు ప్రపంచమే ఆశ్చర్యపోయే రేంజ్‌లో ఫ్యాషన్ ప్రపంచానికి ఐకానిక్ డిజైనర్‌గా ఎదిగాడు. అతడి బ్రాండే భారదేశంలోని అతిపెద్ద లగ్జరీ బ్రాండ్‌గా కితాబులందుకుంది. అంతేగాదు బాలీవుడ్ సెలబ్రిటీల మోస్ట్ వాంటెడ్ వెడ్డింగ్ డిజైనర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇంతకీ అతడెవరంటే..
ఫ్యాషన్ ప్రపంచానికి అలానాటి సంప్రదాయ దుస్తులతో కొంత హంగులు తీసుకొచ్చి ప్రపంచమే కళ్లప్పగించి భారత్ ఫ్యాషన్ వైపు చూసేలా చేశాడు. అతడే సబ్యసాచి ముఖర్జీ. అద్భుతమైన హస్తకళకు, అచంచలమైన నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం ఈ కాస్ట్యూమ్ డిజైనర్. సబ్యసాచి బ్రాండ్ ఓ డిజైన్ మాస్ట్రో పీస్‌గా ఫ్యాషన్ పరిశ్రమలో నీరాజనాలు అందుకుంటోంది. అయితే అతడి జీవితమేమి గోల్డెన్ స్పూన్ బేబీలా సాగలేదు.
సబ్యసాచి ఫిబ్రవరి 23, 1974లో పశ్చిమబెంగాల్‌లోని మానిక్తలాలో జన్మించాడు. భారతీయ బ్రాండ్ 'సబ్యసాచి' వ్యవస్థాపకుడు. అంతేగాదు ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో బోర్డు సభ్యుడైన అతిపిన్న వయస్కుడు. అయితే అతడి బాల్యంలో దుర్భరమైన జీవితాన్ని గడిపాడు. ఆయన తన ప్రాథమిక విద్యను అరబిందో విద్యామందిర్‌లోనూ, మాధ్యమిక విద్యను కోల్‌కతా సెయింట్ జేవియర్ కళాశాలలోనూ పూర్తి చేశాడు. అతడి ఎన్నుకున్న ఫ్యాషన్ కెరీర్‌ని కుటుంబ సభ్యులంతా వ్యతిరేకించారు. ఓ పక్క ఇంట్లో కటిక దారిద్యం మరోవైపు ఊహకందని ప్యాషన్ ప్రపంచం..అయినా సరే తన లక్ష్యాన్ని, కోరికను వదిలిపెట్టలేదు.
కాలేజీ ఫీజల కోసం పుస్తకాలు అమ్ముతూ నానాపాట్లు పడి చదువు పూర్తి చేశాడు. తాను ఫ్యాషన్ రంగంలో నిలదొక్కుకునేంత వరకు రకరకాల ఉద్యోగాలు చేశాడు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సని ఏదోలా పూర్తి చేసి, వెంటనే తన సొంత లేబుల్‌ని ప్రారంభించాడు. అందులో తన డిజైన్ చేసిన దుస్తులను విక్రయించే యత్నం చేశాడు. అయితే ఆ క్రమంలో చాలా ఇబ్బందులు పడేవాడు. చివరికీ తన డిజైన్‌లు ఎవరైన కొంటారా? అనే అనుమానం ఎదురయ్యేంతకు చేరిపోయాడు.
అలాంటి సమయంలో సరిగ్గా 2001లో లాక్మే ఫ్యాషన్ వీక్ అతడి పాలిట వరంలా వచ్చింది. అందులో తన కలెక్షన్స్‌ని ప్రదర్శించి చూశాడు. అది మొదలు ఇక వెను తిరిగి చూసే అవకాశం లేకుండా అచంచలంగా ఎదుగుతూ..ఎన్నో అవార్డులు, సత్కారాలు అందుకున్నాడు సబ్యసాచి ముఖర్జీ.
బ్రాండ్ విశిష్టత..
సబ్యసాచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతన వస్త్రాలు, సాంస్కృతిక సంప్రదాయాలు వంటి మూలాలను ఆధారం చేసుకుని డిజైనర్ వేర్‌లను రూపొందించడం ఈ బ్రాండ్ విశిష్టత. అతని డిజైన్‌లు నిగూఢమైన అర్థాన్ని, కాలనుగుణ ఫ్యాషన్‌కి సరిపోయేలా వివరణను ఇచ్చేలా ఉండేవి. అతడి క్రియేటివిటీకి "ఫెమినా బ్రిటిష్ కౌన్సిల్"కి "ది మోస్ట్ ఔట్‌స్టాండింగ్ అండ్ యంగ్ డిజైనర్ ఆఫ్ ఇండియా అవార్డు వంటి ఎన్నో అవార్డులు ప్రశంసలు వచ్చాయి. పైగా అంతర్జాతీయ ఖ్యాతీని తెచ్చిపెట్టాయి.
అంతేగాదు బాలీవుడ్ దిగ్గజ తార వివాహ డ్రెస్‌లను రూపొందించే డిజైనర్‌గా పేరుతెచ్చుకున్నారు. అతడి డిజైన్‌లు రెడ్ కార్పెట్‌పైనే గాక మ్యాగజైన్ కవర్‌లపై కూడా మెరిశాయి. ఇక సబ్యసాచి బ్రాండ్ నికర విలువ దాదాపు రూ. 114 కోట్లు ఉంటుందని అంచనా. ఇది భారతదేశపు అత్యంత అద్భుతమైన లగ్జరీ డిజైనర్ బ్రాండ్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. ఈ బ్రాండ్ కాలిఫోర్నియా, అట్లాంటా, లండన్,దుబాయ్ వంటి దేశాల్లో కూడా స్టోర్‌లను కలిగి ఉంది.
(చదవండి: జస్ట్ రెండు కుట్టు మిషన్‌లతో.. ఏకంగా వెయ్యి కోట్ల సామ్రాజ్యం!)
Comments
Please login to add a commentAdd a comment