పాప్ స్టార్ 20 ఏళ్ల జస్టిన్ బీబర్‌పై పొరిగింటి వాళ్లు లాస్‌ఏంజెలిస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎందుకనుకుంటున్నారు?
పాప్‌సింగర్ బీబర్‌పై ఫిర్యాదు
పాప్ స్టార్ 20 ఏళ్ల జస్టిన్ బీబర్‌పై పొరిగింటి వాళ్లు లాస్‌ఏంజెలిస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎందుకనుకుంటున్నారు? ఈయన గారి వల్ల చెవులు బద్దలయ్యే శబ్ద కాలుష్యంతో పాటు, ఇంటి చుట్టుపక్కలంతా గంజారుు వాసన ఘువూరుుస్తుండటంతో భరించలేకపోతున్నామని పక్కింటి వాళ్లు గగ్గోలు పెడుతున్నారు.
ఇండస్ట్రీని ఊపేస్తుందట
బాలీవుడ్ నటి అదితి రావ్ బడాయిలకు పోతోంది. గేమ్స్ ప్లే చే సి చాన్సులు కొట్టేయడం తనకు తెలియదని వగలు పోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో తనకెలాంటి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ లేదని చెప్పుకొచ్చింది. అలాగని తన జర్నీలో కష్టాలు లేవనుకుంటే పొరపాటేనని తెలిపింది. తనకొచ్చిన నటనతోనే ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తానని గొప్పలు చెబుతోంది.
మనీష్‌కు లక్కీ చాన్స్
బాలీవుడ్ హాట్ అండ్ వెటరన్ బ్యూటీ రేఖ కొత్త లుక్కులో అదిరిపోనుంది. రేఖ అప్‌కమింగ్ మూవీ ‘ఫితుర్’లో ఈ భామ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసే చాన్స్ మనీష్ మల్హోత్రా కొట్టేశాడు. తానెంతగానో ఆరాధించే నటికి చీరలు డిజైన్ చేసే చాన్స్ రావడం సంతోషంగా ఉందంటున్నాడు మల్హోత్రా.