
న్యూఢిల్లీ: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాకు చెందిన ఎంఎం స్టయిల్స్‌లో రిలయన్స్ బ్రాండ్స్ (ఆర్‌బీఎల్) 40 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఇరు సంస్థ లు ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపాయి. ‘ఎంఎం స్టయిల్స్‌లో 40 శాతం మైనారిటీ వాటా కోసం బ్రాండ్ వ్యవస్థాపకుడు, క్రియేటివ్ డైరెక్టర్ మనీష్ మల్హోత్రాతో ఆర్‌బీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది’ అని పేర్కొన్నాయి. అయితే, డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు.
ఇప్పటిదాకా మనీష్ మల్హోత్రా ప్రైవేట్‌గా నిర్వహిస్తున్న ఈ బ్రాండ్‌లో బైటి ఇన్వెస్టర్ పెట్టుబడి పెట్టడం ఇదే తొలిసారి. భారతీయ కళలు, సంస్కృతిపై అపార గౌరవమే మల్హోత్రాతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకోవడానికి కారణమని పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ పేర్కొంది. అంతర్జాతీయంగా విస్తరించే క్రమంలో రిలయన్స్‌తో భాగస్వా మ్యం గణనీయంగా తోడ్పడగలదని మల్హోత్రా తెలిపారు. 2005లో ప్రారంభమైన ఎంఎం స్టయిల్స్ బ్రాండ్‌కు హైదరాబాద్ సహా ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో 4 పెద్ద స్టోర్స్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment