మాల్దీవుల్లో మస్తీ.. మజా
మాల్దీవుల్లో మస్తీ.. మజా
Published Thu, Dec 1 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM
‘‘ప్రపంచంలో రకరకాల మనుషులుంటారు. ఒక్కొక్కరిది ఒక్కో మనస్తత్వం. ఎవరి ఇష్టాలు వారివి. కొందరికి సినిమాలంటే ఇష్టం. మరికొందరు క్రీడలు ఇష్టపడతారు. ఇంకొందరు వివిధ దేశాలు చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. వీలు దొరికినప్పుడు కుటుంబంతో కలసి గడుపుతుంటారు మరికొందరు. నాకు మాత్రం బీచ్ అంటే ఇష్టం.. బీచ్ కెళ్లి మత్స్య కన్యలా ఈతకొట్టడమంటే ఇంకా ఇంకా ఇష్టం’’ అంటున్నారు కత్రినా కైఫ్. ‘మల్లీశ్వరి’, ‘అల్లరిపిడుగు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ భామ ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమయ్యారు. అక్కడ స్టార్స్ సరసన క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నారీ బ్యూటీ. ప్రస్తుతం ఓ ఫొటోషూట్ కోసం మాల్దీవులు వెళ్లారు.
ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా కూడా మాల్దీవుల్లో ఉన్నారు. డిసెంబరు 5న మనీష్ యాభయ్యో పుట్టినరోజు. ముందుగానే మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకున్నారు. మనీష్ ఒళ్లో కూర్చుని కత్రినా ఫొటోలు దిగడం వీళ్లిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యానికి ఓ ఉదాహరణ. ఈ ఫొటోలు చూసినవాళ్లు ఈ ఇద్దరి మధ్య సమ్‌థింగ్ నడుస్తోందని కథలు అల్లేశారు. ఆ సంగతలా ఉంచితే.. సాగర తీరంలో బికినీలో కత్రినా చేసిన అందాల విందు అక్కడివారికి కనువిందు అట. బికినీలో తన ఫొటోలను ట్విట్టర్‌లో కూడా పెట్టి, ప్రపంచంలో అందరికీ ఐ-ఫీస్ట్ చేశారు కత్రినా.
Advertisement
Advertisement