ఓ పాట కోసం కరీనా సాహసం | Kareena Kapoor wears 32 kg lehenga for a song in 'Ki and Ka' | Sakshi
Sakshi News home page

ఓ పాట కోసం కరీనా సాహసం

Published Thu, Oct 29 2015 5:28 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఓ పాట కోసం కరీనా సాహసం - Sakshi

ఓ పాట కోసం కరీనా సాహసం

ముంబయి: అసలే షూటింగ్.. ఎన్నో టేక్లు తీస్తేగానీ ఓ సీన్ అద్భుతంగా రాదు. ఇక పాట చిత్రీకరణ అయితే ఎన్నిసార్లు కట్.. యాక్షన్, కట్ యాక్షన్ అనాలో.. నిజంగానే అంత అద్భుతంగా రావడానికి ఓ దర్శకుడికి ఎంత ఓపిక ఉండాలో ఆ నటుడు, నటికి కూడా అంతే ఓపిక ఉండాలి. ఈ ఓపిక బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్కు కాస్త ఎక్కువననే ఈ విషయం వింటే తెలుస్తుంది. ఎందుకంటే ఆమె నటిస్తున్న చిత్రం 'కి అండ్ కా' లోని ఓ పాట కోసం ఏకంగా 32 కేజీల బరువైన వస్త్రాలను(లెహంగా) ధరించిందట.

ఈ వస్త్రాలను ఆమెకు అత్యంత సన్నిహితుడు మిత్రుడు మనీశ్ మల్హోత్రా డిజైన్ చేశాడు. ఈ వస్త్రాలను ధరించి ప్రతికూల వాతావరణంలో రెండు రోజులు షూటింగ్లో పాల్గొంది. కరీనా కపూర్ ఏ చిత్రంలో నటించినా తప్పకుండా ఓసారి మాత్రం ఆ సినిమాలో లెహంగా ధరిస్తుంటుంది. ఇందుకోసం ఆమె స్వయంగా డిజైన్ చేయించుకుంటుంది. ఆ వస్త్రాల్లో మెరిసిపోయి ఫ్యాన్స్ను సంతోష పెట్టడం తనకు చాలా ఇష్టమని కూడా పలుమార్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement