పదేళ్ల తరువాత కాశీ వెళ్లిన 'నీతా అంబానీ'.. ఎందుకో తెలుసా? | Nita Ambani Visits Varanasi To Offer Son's Wedding Invite At Kashi Vishwanath Temple | Sakshi
Sakshi News home page

పదేళ్ల తరువాత కాశీ వెళ్లిన 'నీతా అంబానీ'.. ఎందుకో తెలుసా?

Published Mon, Jun 24 2024 8:21 PM | Last Updated on Tue, Jun 25 2024 10:10 AM

Nita Ambani in Kashi Vishwanath Temple

అనంత్ అంబానీ & రాధిక మర్చంట్ 2024 జులై 12న పెళ్లిచేసుకోనున్నారు. ఇప్పటికే రెండు సార్లు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్న ఈ జంట వివాహం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతుంది. అంతకంటే ముందు రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్ & చైర్‌పర్సన్ నీతా అంబానీ ఈ రోజు (జూన్ 24) వారణాసికి వెళ్లారు.

రాధికా మర్చంట్‌తో తన కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి ముందు నీతా అంబానీ.. కాశీ విశ్వనాథ ఆలయం చేరుకొని అక్కడ ప్రార్థనలు చేశారు. "ఈ రోజు నేను అనంత్ & రాధికల వివాహ ఆహ్వానాన్ని సర్వేశ్వరునికి సమర్పించడానికి పదేళ్ల తరువాత ఇక్కడకు వచ్చాను" అని మీడియాతో చెప్పారు. అంతే కాకుండా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి సంతోషిస్తున్నానని అన్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ వివాహ వేడుకలు జూన్ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. వీరి పెళ్లి జూలై 12 నుంచి 14 వరకు మూడురోజులు జరుగుతుంది. భారతదేశంలో సంపన్నుడైన అంబానీ కొడుకు వివాహనికి సినీ, రాజకీయ, పారిశ్రామిక దిగ్గాలు హాజరయ్యే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement