Jr NTR Truck Scene In RRR: జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, యాక్టింగ్.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించింది ఈ మూవీ. అలాగే అనేక మంది హాలీవుడ్ సెలబ్రిటీలను పొగిడేలా చేసింది ఈ చిత్రం. ప్రస్తుతం ఓటీటీలో కూడా రచ్చ చేస్తున్న ఈ మూవీ గురించి ఎంత చెప్పిన తక్కువే.
అయితే తాజాగా 'ఆర్ఆర్ఆర్' మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటర్వెల్ ఎంట్రీ సీన్ ఎంత అద్భుతంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక ట్రక్కులో పులులు, ఎలుగుబంట్లు, జింకలు, నక్కలతో తారక్ ఇచ్చే వైల్డ్ ఎంట్రీ మాములుగా ఉండదు. థియేటర్‌లో చూసిన ప్రతీ ప్రేక్షకుడు నోరు వెళ్లబెట్టేలా చేసింది ఈ సీన్. ఇప్పుడు ఈ ఎంట్రీ సీన్ నెట్టింట్లో సందడి చేస్తుంది. ఓ విదేశీ యూజర్ ఈ సీన్ వీడియోను ట్విటర్‌లో షేర్ చేయగా అతి తక్కువ సమయంలోనే 12 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈ సీన్‌ను షేర్ చేస్తూ ఆ యూజర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ ఇండస్ట్రీ గర్వపడేలా ఉన్నాయి.
చదవండి: అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి..
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికి..
I’ve watched 29 MCU movies.
— Nate Offord (@NateOfford) July 17, 2022
I’ve never seen a shot as ridiculous and incredible as this truck/animal shot in RRR (on Netflix) pic.twitter.com/JTheyZIYB7
'నేను ఇప్పటివరకు 29 ఎమ్‌సీయూ (మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్) చిత్రాలను వీక్షించాను. కానీ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ఈ ట్రక్ లాంటి అత్యద్భుతమైన షాట్‌ను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు' అని ఆ యూజర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. దీంతో ఇటు తారక్ ఫ్యాన్స్, అటు సినీ లవర్స్ తెలుగు సినిమా గొప్పతనం గురించి ఎంతో సంతోషిస్తున్నారు.
చదవండి: ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు
బాయ్‌ఫ్రెండ్ నుంచి కాల్.. తర్వాత మోడల్ ఆత్మహత్య
NTR is the clear winner in RRR multi-starrer with domestic as well as Global accolades.
— BingedHelp (@BingedHelps) July 19, 2022
First Indian movie video with 10 Million+ Views!#NTRGoesGlobal @tarak9999 https://t.co/FZgkZG4BvW
First Ever Indian Video to Cross 10M Views on Twitter & still going strong (nearing 12M now) 🔥@tarak9999 #NTRGoesGlobal #NTR #RRRMovie https://t.co/SV08izQCIK
— Kaushik LM (@LMKMovieManiac) July 19, 2022
Comments
Please login to add a commentAdd a comment