scenery
-
Photo Feature : ప్రకృతి గీసిన మల్లాపూర్ అందాలు
పచ్చని పల్లె ప్రకృతి సోయగం కనువిందు చేస్తోంది. ఏటా శ్రావణమాసంలో మల్లాపూర్ శివారు సోమేశ్వర కొండపైన కొలువుదీరిన శ్రీకనకసోమేశ్వర స్వామిని దర్శించుకు నేందుకు తరలివచ్చే భక్తులు ప్రకృతి అందాలను తిలకిస్తూ పులకించిపోతుంటారు. పచ్చని పొలాలు, గుట్టల మధ్యన ప్రకృతి గీసిన మల్లాపూర్ (పల్లె) అందాన్ని సోమవారం భక్తులు సోమేశ్వర కొండపై నుంచి ఆస్వాదిస్తూ ఆనందించారు. -మల్లాపూర్(కోరుట్ల) -
ఆ షాట్‌ను ఎక్కడ చూడలేదని విదేశీయులు ఫిదా..
Jr NTR Truck Scene In RRR: జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, యాక్టింగ్.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించింది ఈ మూవీ. అలాగే అనేక మంది హాలీవుడ్ సెలబ్రిటీలను పొగిడేలా చేసింది ఈ చిత్రం. ప్రస్తుతం ఓటీటీలో కూడా రచ్చ చేస్తున్న ఈ మూవీ గురించి ఎంత చెప్పిన తక్కువే. అయితే తాజాగా 'ఆర్ఆర్ఆర్' మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటర్వెల్ ఎంట్రీ సీన్ ఎంత అద్భుతంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక ట్రక్కులో పులులు, ఎలుగుబంట్లు, జింకలు, నక్కలతో తారక్ ఇచ్చే వైల్డ్ ఎంట్రీ మాములుగా ఉండదు. థియేటర్లో చూసిన ప్రతీ ప్రేక్షకుడు నోరు వెళ్లబెట్టేలా చేసింది ఈ సీన్. ఇప్పుడు ఈ ఎంట్రీ సీన్ నెట్టింట్లో సందడి చేస్తుంది. ఓ విదేశీ యూజర్ ఈ సీన్ వీడియోను ట్విటర్లో షేర్ చేయగా అతి తక్కువ సమయంలోనే 12 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈ సీన్‌ను షేర్ చేస్తూ ఆ యూజర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ ఇండస్ట్రీ గర్వపడేలా ఉన్నాయి. చదవండి: అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికి.. I’ve watched 29 MCU movies. I’ve never seen a shot as ridiculous and incredible as this truck/animal shot in RRR (on Netflix) pic.twitter.com/JTheyZIYB7 — Nate Offord (@NateOfford) July 17, 2022 'నేను ఇప్పటివరకు 29 ఎమ్‌సీయూ (మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్) చిత్రాలను వీక్షించాను. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఈ ట్రక్ లాంటి అత్యద్భుతమైన షాట్‌ను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు' అని ఆ యూజర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. దీంతో ఇటు తారక్ ఫ్యాన్స్, అటు సినీ లవర్స్ తెలుగు సినిమా గొప్పతనం గురించి ఎంతో సంతోషిస్తున్నారు. చదవండి: ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు బాయ్‌ఫ్రెండ్ నుంచి కాల్.. తర్వాత మోడల్ ఆత్మహత్య NTR is the clear winner in RRR multi-starrer with domestic as well as Global accolades. First Indian movie video with 10 Million+ Views!#NTRGoesGlobal @tarak9999 https://t.co/FZgkZG4BvW — BingedHelp (@BingedHelps) July 19, 2022 First Ever Indian Video to Cross 10M Views on Twitter & still going strong (nearing 12M now) 🔥@tarak9999 #NTRGoesGlobal #NTR #RRRMovie https://t.co/SV08izQCIK — Kaushik LM (@LMKMovieManiac) July 19, 2022 -
ఏపీలో అదిరిపోయే టూరిస్ట్ స్పాట్స్.. ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు..
రంపచోడవరం(తూర్పుగోదావరి): మనసు దోచే ప్రకృతి అందాలు.. పరవళ్లుతొక్కే నది సోయగాలు.. ఎటూ చూసినా పచ్చని అడవులు.. ఎత్తైన కొండలు, గుట్టలు.. రారమ్మని పిలిచే చిరుగాలులు.. మధురానుభూతి కలిగించే పడవ ప్రయాణం. ఇలాంటి అందమైన లొకేషన్‌కు వెళ్లాలంటే ఏ గోవానో, ఏ మాల్దీవులకో వెళ్లాల్సిన అవసరం లేదు. రంపచోడవరం వెళితే.. ఈ అనుభూతులన్నీ ఆస్వాదించవచ్చు. అలుపెరగకుండా ప్రయాణం సాగిస్తున్న గోదావరికి ఇరువైపులా ఉన్న పాపికొండల అందాలు అదరహో అనిపిస్తాయి. నది తీరంలో దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయి. మారేడుమిల్లి మండలంలోని జలపాతాల సోయగాలు ఎంత సేపు చూసినా.. తనివితీరవు. తూర్పు కనుమల్లోని పచ్చని గడ్డి కొండల్లో (గ్రాస్ ల్యాండ్) గుడిసె ప్రాంతం ఇక్కడ మరో ఆకర్షణ. ఇలా కనుచూపు మేర ప్రకృతి రమణీయ దృశ్యాలు మరెన్నో ఉన్నాయి. వీటిని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు తరలివస్తారు. రాత్రి సమయాల్లో ఇక్కడే బస చేసి.. ప్రకృతి ఒడిలో సేదతీరుతుంటారు. పాపికొండలు మధ్య బోట్లో ప్రయాణం.. పురాతన ఆలయం రంప శివాలయం రెడ్డిరాజుల కాలం నాటి పురాతన శివాలయం రంపలో ఉంది. రంపచోడవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. రాతితో ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి అనుకుని ఉన్న కొండపై రంప జలపాతం ఉంది. ఏడాది పొడవున జలపాతం ప్రహిస్తునే ఉంటుంది. రంపచోడవరంలో పర్యాటకులు బస చేసేందుకు పర్యాటక శాఖకు చెందిన అతిథి గృహాలు ఉన్నాయి. మారేడుమిల్లి సమీపంలో జలతరంగణి పొల్లూరు జలపాతం ప్రకృతి గుడి..సందడి మారేడుమిల్లి మండలానికి ఓ ప్రత్యేకత ఉంది. రాజమండ్రికి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం విలక్షణమైన గిరిజన జీవనశైలి, విభిన్నమైన ప్రకృతి అందాలకు నిలయం. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండడంతో ఈ ప్రాంతం ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. వివిధ రకాల పంటలకు అనుకూలమైన ప్రాంతం ఇది. పుల్లంగి పంచాయతీలో గుడిసె ప్రాంతం ఉంది. మారేడుమిల్లికి 40 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది. ఆకాశాన్ని హత్తుకునేలా ఎత్తైన కొండలు.. పచ్చని గడ్డితో విశాలంగా ఉంటాయి. సూర్యోదయం వేళ గుడిసె అందాలు తిలకించేందుకు పర్యాటకులు రాత్రికే అక్కడకు చేరుకుని గుడారాల్లో బస చేస్తారు. ఎత్తైన కొండలను తాకుతూ వెళ్లే మబ్బులు పర్యాటకులను అబ్బురపరుస్తాయి. గుడిసె ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు వేలాది తరలివస్తున్నారు. కొంత మంది మారేడుమిల్లిలో బస చేసి తెల్లవారుజామున గుడిసెకు వాహనాల్లో చేరుకుంటారు. మారేడుమిల్లిలో పర్యాటశాఖకు చెందిన త్రీస్టార్ వసతులతో ఉడ్ రిసార్ట్స్, ఎకో టూరిజం ఆధ్వర్యంలో అతిథి గృహాలు పర్యాటకులకు వసతి కల్పిస్తున్నాయి. ఇక్కడ సుమారు 300 వరకు అతిథి గృహాలు ఉన్నాయి. మారేడుమిల్లి నుంచి భద్రాచలం వైపు ఘాట్‌రోడ్డులో 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. జలతరంగణి జలపాతం, వ్యూ పాయింట్, అమృతధార జలపాతం వస్తాయి. ఇక్కడే పాములేరు వద్ద జంగిల్ స్టార్ ఎకో రిసార్ట్స్ కూడా ఉన్నాయి. చింతూరు నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే పొల్లూరు జలపాతం వస్తుంది. ఇక్కడకు ఏడాది పొడవున పర్యాటకులు వస్తారు. ఎత్తైన కొండల నుంచి జాలువారే నీటిధారలు మైమరిపిస్తాయి. పాములేరు రోప్ బ్రిడ్జి మరపురాని మధుర ప్రయాణం దేవీపట్నం–వీఆర్‌పురం మండలాల మధ్య పాపికొండలు విస్తరించి ఉన్నాయి. పాపికొండలు అందాలు తిలకించేందుకు పర్యాటకులకు రెండు ప్రాంతాల్లో బోట్ పాయింట్లను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. దేవీపట్నం మండలం పోశమ్మ గండి వద్ద ఒకటి, వీఆర్‌పురం మండలం పోచవరం వద్ద మరో బోట్ పాయింట్ ఉంది. ముందుగా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న పర్యాటకులు రాజమహేంద్రవరం నుంచి పోశమ్మ గండికి చేరుకుంటారు. అక్కడ నుంచి బోట్లు పర్యాటకులతో బయలుదేరుతాయి. సుమారు నాలుగు గంటల పాటు బోట్‌పై ప్రయాణం చేసి పాపికొండలకు చేరుకుంటారు. జంగిల్ స్టార్ రిసార్ట్స్ ఎత్తైన కొండల మధ్య గోదావరిపై నుంచి వచ్చే చల్లని గాలులు మధ్య బోట్లో ప్రయాణం పర్యాటకులకు ఆహ్లాదం పంచుతుంది. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా ముంపునకు గురైన గిరిజన గ్రామాలను దాటుకుంటూ బోట్లు ముందుకెళ్తాయి. ఈ ప్రయాణంలో పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్‌ను చూడవచ్చు. వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పాపికొండలు అందాలు చూసేందుకు వస్తుంటారు. పోచవరం బోట్ పాయింట్ నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి పర్యాటకులు పాపికొండల విహారయాత్ర చేస్తారు. వీఆర్‌పురం మీదుగా వాహనాల్లో పోచవరం చేరుకుని బోట్లో పాపికొండలకు వెళతారు. కొల్లూరులో రాత్రి బస చేసేందుకు వీలుగా నైట్‌హాల్ట్ హట్స్(వెదురు కుటీరాలు) ఉన్నాయి. -
ప్రతి దృశ్యం అంతులేని కవిత్వం!
ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో తాజా కెరటం లౌకిక్దాస్. కోల్‌కతాకు చెందిన దాస్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డిప్లొమా చేశాడు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ 2020లో ఇతడికి ఎనిమిది షోలు కవర్ చేసే ఛాన్స్ దొరికింది. ప్రస్తుతం కోల్‌కతా కేంద్రంగా తన పాషన్ కొనసాగిస్తున్న లౌకిక్దాస్ మాటలు కొన్ని... ∙నేను ఎప్పుడూ ఫాలో అయ్యే ఏకైక రూల్... ఏ రూల్ ఫాలో కావద్దని! ఎందుకంటే ఫొటోగ్రఫీ అనేది సృజనాత్మకమైనది. దానికి హద్దులు, పరిమితులు లేవు ∙ఫొటోగ్రఫీలోని రకరకాల జానర్స్‌లో ఎన్నో గొప్ప అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా మన కోసం ఎదురుచూస్తున్నాయి ∙ఏ పుస్తకమో ఎందుకు? ‘ప్రకృతి’ అనే అందమైన పుస్తకాన్ని చదివితే ఎంతో జ్ఞానం మన సొంతమవుతుంది. అది మన వృత్తికి ఇరుసుగా పనిచేస్తుంది ∙‘ఈ దృశ్యంలో ఏదో మ్యాజిక్ ఉంది’ అని పసిగట్టే నైపుణ్యాన్ని మన కంటికి నేర్పాలి. -
అంతా..మాయ!
- రంగస్థలంపై... రంజైన దృశ్యం... – రంగస్థలంపై వర్షం, పున్నమి వెన్నెల – సూర్యోదయం, పక్షుల విహారం – యుద్ధాల్లో అస్త్రాల వింతలు – మాయాబజార్ సినిమాకు ప్రామాణికం – కర్నూలులో సురభి కళానైపుణ్యం కర్నూలు(కల్చరల్) : ఘటోత్కచుడు వియ్యాల వారి విందుకు వచ్చి..తన చేతిని అలా ఊపగానే..అక్కడి లడ్డూలు, జిలేబీలు..జంతికలు అతని నోట్లోకి వెళ్లడం, పరచిన చాపలు, జంఖానాలు వాటంతట అవే చుట్టుకోవడం, మాయల పకీరు ఓం.. హ్రీం.. హరోం హర! అని మంత్రాలు పఠించగానే ఉన్న వస్తువులు మాయమై కొత్త వస్తువులు ప్రత్యక్షం కావడం., ఉన్నపళంగా వాన కురవడం.,తంబూరా వాయిస్తూ మేఘాల్లోంచి నారదుడు నేలకు దిగడం. ఇవన్నీ సినిమాల్లో అయితే మామూలే. కానీ రంగస్థలంపై.. ప్రేక్షకుల కళ్లెదుట ఈ దృశ్యాలు జరుగుతుంటే ఆశ్చర్యపోవాల్సిందే. పౌరాణిక నాటకాల్లో దేవతలు ప్రత్యక్షం కావడం, యుద్ధంలో ఇరువైపుల నుంచి అస్త్రాలు ఢీ కొని మెరుపులు పుట్టడం చూస్తే ఆ అనుభూతే వేరు. వేదికపైకి నేరుగా గుర్రాలు, రథాలు రావడం, గాలిలో తేలియాడడం లాంటి దృశ్యాలు ఆవిష్కృతమవుతుంటే ప్రేక్షకులు ఊపిరి బిగపట్టుకొని చూడాల్సిందే. నిజమైన వినోదానికి ప్రతీకలైన ఇలాంటి దృశ్యాలు కేవలం సురభి వారి సొంతం. రంగస్థలంపైనే మంటలు రావడం, వాన కురవడం, సూర్యుడు అస్తమించడం, పక్షులు ఎగిరిపోవడం వంటి దృశ్యాల్లో పదుల కొద్దీ సాంకేతిక నిపుణులు పని చేస్తుంటే ఇలాంటివి ఆవిష్కృతమవుతాయి. కడప నుంచి కర్నూలుకు.. 'సురభి' పేరు తెలియని తెలుగువారు ఉండరు. తెలుగు పౌరాణిక నాటకానికి తమ సాంకేతిక నైపుణ్యంతో వినూత్న జవసత్వాలు తొడిగి ప్రేక్షకులను రంగస్థలం వైపుకు ఆకర్షించి కళారంగంలో విజయపతాక ఎగరేసిన సురభి నాటక సమాజం తెలుగు వారి సృజనాత్మకతకు నిదర్శనం. వైఎస్ఆర్ కడప జిల్లా సురభి గ్రామంలో మొగ్గ తొడిగిన ఈ కళానైపుణ్యం ఆంధ్ర దేశమంతా తన సుగంధాన్ని వెదజల్లింది. మూడు దశాబ్దాల క్రితం సురభి నుంచి కర్నూలు జిల్లాకు తరలివచ్చిన కళాకారుల కుటుంబం ఇక్కడ పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం రోజారమణి అనే కళాకారిణి సురభి కుటుంబం నుంచి వచ్చి కర్నూలులో స్థిరపడి ఇప్పటికీ నాటకాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. రోజారమణి అక్క కుమారుడైన సురభి శంకర్ ప్రస్తుతం రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో సాంకేతిక సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా పౌరాణిక నాటకాలకు సాంకేతిక సహకారాన్ని అందిస్తూ రంగస్థలంపై మాయలు మంత్రాల ఎఫెక్ట్స్ సృష్టికి ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడు. కర్నూలు లలిత కళాసమితి ప్రదర్శిస్తున్న పౌరాణిక నాటకాల్లో అద్భుతమైన వింతలకు ఈయనే రూపకర్త. 2013లో స్వర్ణ నంది సాధించిన 'బభ్రువాహన విజయం'లో వీరిది ప్రధాన పాత్ర. ‘మాయాబజార్’కు నడక నేర్పింది సురభియే... 1950 దశకంలో రాయలసీమకు చెందిన దర్శకుడు కె.వి.రెడ్డి రూపొందించిన మాయాబజార్ చిత్రంలో అద్భుతాలను ప్రవేశపెట్టే ముందు ఆయన సురభి నాటక సమాజాన్ని సంప్రదించారు. రంగస్థలంపై ఈ నాటక సమాజం ప్రదర్శిస్తున్న మాయలు, మంత్రాలు వాటి వెనక ఉండే సాంకేతిక నిపుణుల పనితనాన్ని ఆయన సమగ్రంగా పరిశీలించారు. మాయాబజార్ కథను జనరంజకంగా తెరకెక్కించేందుకు సురభి నైపుణ్యాలను ప్రామాణికంగా తీసుకున్నారు. స్టేజీపై మంటలు.. వర్షం.. రంగస్థలంపై కొన్ని సందర్భాల్లో మంటలు చెలరేగే దృశ్యాలు ప్రదర్శించాల్సి వస్తుంది. పెట్రోలులో ముంచిన తాడును వేదికపై అమర్చి విద్యుత్ తీగలతో మధ్యలో ఫ్లాష్ వెలిగేటట్లు చేస్తే మంటలు చెలరేగుతాయి. ఇదంతా ప్రేక్షకుడికి తెలియకుండా, గమనించకుండా ఆకస్మికంగా మంటలు ఎగిసి వచ్చినట్లుగా ప్రదర్శిస్తారు. వర్షం ఎఫెక్ట్ కోసం తెర వెనుక ఒక పెద్ద క్యాన్‌లో నీరు పోసి ఉంచి సబ్ మెర్సిబుల్ మోటార్‌తో పైకి పంప్ చేస్తారు. ఈ నీరు రంధ్రాలున్న ఒక సన్నని పైపులోకి ప్రవహిస్తాయి. పైపు వెనక లైటింగ్ ఎఫెక్ట్ ఏర్పాటు చేస్తారు. మోటర్ ఆన్ చేయగానే వేదికపై సన్నని జల్లులు కురుస్తాయి. గదలు, అస్త్రాలు ఢీ.. యుద్ధ రంగంలో గదలు, అస్త్రాలు ఢీకొనడం.. వెంటనే మెరుపులు పుట్టడం మనం పాత సినిమాల్లో చూశాం. సరిగ్గా ఇదే ఎఫెక్ట్‌ను రంగస్థలంపై చూస్తాం. దీని వెనుక అనేక దారాలు, కరెంటు తీగలు పనిచేస్తాయి. ఆకాశం నుంచి దిగడం... భూమి మీద నుంచి పైకి రావడం... నారదుడిని మేఘాల నుంచి కిందకు దింపేందుకు కనిపించని తాళ్లతో కట్టి కప్పీపై లాగుతూ, వదులుతూ దాదాపు పది మంది సాంకేతిక కళాకారులు పనిచేస్తారు. భూమని అకస్మాత్తుగా పైకి ఉబికి వచ్చినట్లు చూపిస్తారు. దీనికి స్టేజి కింది భాగం నుంచి ఆపరేట్ చేసే సాంకేతిక నిపుణులుంటారు. వైఎస్సార్ చొరవతో సురభి కళాకారులకు బీసీ హోదా : సురభి శంకర్ జన హృదయ నేత అలనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి చొరవ వల్లే మా సురభి కళాకారులకు బీసీ హోదా సాధ్యమైంది. మేము ఎన్నో ఏళ్లుగా అసలు కులమే లేక అష్టకష్టాలు పడ్డాం. మా పూర్వీకులు మహారాష్ట్ర నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడ్డారు. మాకు ఒక కులము లేదు. మా పిల్లలను పాఠశాలల్లో చేర్పించేటప్పుడు కులం పేరు రాయించడంలో చాలా ఇబ్బందిగా ఉండేది. ముప్పై ఏళ్లుగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. అయితే వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి గారు 'సురభి నాటకాల వాళ్లు' అనే కులం కింద చేర్చి బీసీ–బీ హోదా ఇచ్చారు. దీంతో మాకు సమాజంలో గుర్తింపు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రుణాలు అన్నీ అందుకునే అవకాశం ఏర్పడింది. కర్నూలు నుంచే నా విజయ ప్రస్థానం... 2000 దశకంలో కర్నూలు మున్సిపల్ పాఠశాలలో ప్రదర్శించిన 'పడమటి గాలి' సాంఘిక నాటకానికి నేను సాంకేతిక సహకారం అందించాను. రైతుల కడగండ్లను కళ్లకు కట్టినట్లుగా రూపొందించిన ఈ నాటకంలో సూర్యోదయం, సూర్యాస్తమయం, వర్ష బీభత్సంతో పంట నాశనం కావడం లాంటి దృశ్యాలు చాలా శ్రమకోర్చి చేశాను. దానితో నాకు మంచి పేరొచ్చింది. కర్నూలు టీజీవీ కళాక్షేత్రం స్టేజి డిజైనింగ్ కూడా మేమే చేశాం. రాష్ట్రంలో మూడు చోట్ల సురభి థియేటర్స్ ప్రత్యేక డిజైనింగ్ మేమే చేశాం. -
మనిషి కాదు... మానసిక భ్రమ!
మిస్టరీ చంద్రుడిపై మనిషిని పోలిన ఒక ఆకారం కనిపించడం గురించి ఇటీవల హాటు హాటుగా చర్చ జరిగింది. జసెన్కో అనే ఒక వెబ్ యూజర్‌కు గూగుల్‌లో ఈ దృశ్యం కనిపించింది. దీన్ని యూట్యూబ్‌లో పోస్ట్ చేయడంతో గగ్గోలు మొదలైంది. ‘గ్రహాంతరవాసులు ఉన్నారు’ అనడానికి... ఇది తిరుగులేని ఉదాహరణ’ ‘గ్రహాంతరవాసి విగ్రహం అది’ ‘చంద్రుడిపై ఏదో కుట్ర జరుగుతోంది’ ‘భూగ్రహవాసులలాగే చంద్రగ్రహవాసులూ ఉన్నారు’ ఇలాంటి ఎన్నో మాటలు వినిపించాయి. ‘‘అది నీడ కాదు కచ్చితంగా పురాతన విగ్రహం’’ అని కాస్త గట్టిగానే చెబుతున్నాడు టామ్ రోజ్ అనే పారనార్మల్ ఎక్స్‌ప్లెయినర్. ‘ఎగ్జామినర్’ అనే పత్రికలో ఆయన విశ్లేషణాత్మకమైన వ్యాసం కూడా రాశాడు. ఈ చర్చ ఉధృతిని గమనించిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా స్పందించింది... ‘‘డిజిటల్ ముందు కాలంలో తీసిన ఫొటో అది. ఎలాంటి మురికైనా అంటి ఉండే అవకాశం ఉంది. మనిషిని పోలిన ఆ దృశ్యం... నెగెటివ్ మీది దుమ్ము, మరకలు ఏదైనా కావచ్చు’’ అని ప్రకటించింది. మరోవైపు మానసిక విశ్లేషకులేమో... ‘పారౌడోలియ’ అన్నారు. ఇంతకీ ‘పారౌడోలియ’ అంటే ఏమిటి? ‘రోజువారిగా మనం చూసే దృశ్యాల్లో పరిచిత ముఖాలు, ఆకారాలను చూసే మానసిక భ్రమ!’ ఇలా నాసా, మానసిక విశ్లేషకులు స్పష్టమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ- ‘‘ఆ దృశ్యం గురించి లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. కొత్త నిజాలు కనిపెట్టాల్సి ఉంది’’ అంటున్నారు ఔత్సాహిక పరిశోధకులు!