మధ్యప్రదేశ్‌లోని శ్యోపూర్‌లోగల కూనో నేషనల్ పార్క్‌లో గడచిన రెండు నెలలలో మూడు చిరుతలు, వాటి పిల్లలు మూడు మృతిచెందాయి. స్థానికంగా ఇది సంచలనంగా మారింది. దీనికితోడు ఇదే ఈ జూర్కులో ఉన్న 17 చిరుతలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాయి. ఒక చిరుత కూన కూడా వ్యాధులతో బాధపడుతోంది. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు వాటి ఆరోగ్యం మెరుపడాలని కోరుతూ పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం కర్హల్ తహసీల్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ దేవాలయంలో పులల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. వాటి ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ హోమాలు కూడా నిర్వహిస్తున్నారు. మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ, సుందరాకాండ పారాయణ, హనుమాన్ చాలీసా కూడా చేస్తున్నారు. గ్రామస్తులతో పాటు జంతు ప్రేమికులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
కాగా 2022 సెప్టెంబరు 17న ప్రధాని నరేంద్ర మోదీ కూనో పార్క్‌కు నమీబియా నుంచి తెచ్చిన 8 చిరుతలను అప్పగించారు. వాటిలో ఐదు మగ చిరుతలు, 3 ఆడ చిరుతలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో వాటి సంరక్షణకు చీతా ప్రాజెక్టు ప్రారంభించారు. ఇదేవిధంగా 2023 ఫిబ్రవరి 18 ఇక్కడకు ఆఫ్రికా నుంచి మరో 12 చిరుతలను తీసుకువచ్చారు. వీటిలో 7 ఆడ చిరుతలు, 5 మగ చిరుతలు ఉన్నాయి. కాగా ఈ ఏడాది మార్చి 26న నమీబియా నుంచి తెచ్చిన ఒక చిరుత అనారోగ్యంతో మృతి చెందింది. అలాగే ఏప్రిల్ 23న సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చిన ఒక చిరుత మృతి చెందింది. మే 9న మరో చిరుత మరణించింది. మే 23న ఒక చిరుత కూన మృతి చెందింది. తరువాత కొన్ని చిరుతలు అనారోగ్యం పాలయ్యాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గ్రామస్తులు వాటి ఆరోగ్యం మెరుగుపడాలని కాంక్షిస్తూ పూజలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment