
అమలాపురం రూరల్: గోదావరిలో ఎంతో అరుదుగా కనిపించే నీటికుక్కలు శుక్రవారం మధ్యాహ్నం పాలగుమ్మి పంట కాలువలో జలకాలాడుతూ వాహనచోదకుల కంట పడ్డాయి. తొలుత అటుగా వెళ్తున్న గ్రామస్తులు, వాహనచోదకులు వాటిని పెద్ద పాములుగా భావించారు. కొందరు నీటికుక్కలని చెప్పారు. ఇటీవల గోదావరి వరదల్లో వచ్చిన నీటికుక్కలు కాలువలోకి కొట్టుకొచ్చినట్లు అమలాపురం పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు ఎల్.విజయ్‌రెడ్డి చెప్పారు. ఇవి ఇక్కడ సంచరించడం చాలా అరుదని, ఎక్కువగా నదీ ప్రాంతాల్లో కనిపిస్తాయని అన్నారు.
ఇవీ చదవండి:
చిల్లర వేషాలు, చీకటి లీలలు.. అబ్బో మనోడు మామూలోడు కాదుగా
అధికారులపై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు నోటి దురుసు
Comments
Please login to add a commentAdd a comment