Thirsty Dog Dunks Head Into Water Bowl In Visakhapatnam, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

ఓ మై డాగ్‌..! ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయింది

Published Tue, Nov 1 2022 12:38 PM | Last Updated on Tue, Nov 1 2022 1:32 PM

Thirsty Dog Dunks head into water bowl - Sakshi

వాటర్‌ కేన్‌లో తల పెట్టి ఇరుక్కుపోవడంతో ఇబ్బందిపడుతూ పరుగులెడుతున్న కుక్క 

సాక్షి, విశాఖపట్నం: అనవసరంగా ఏ విషయంలోనూ తలదూర్చకూడదని పెద్దలు ఎందుకంటారో ఈ సీన్‌ చూస్తే అర్థమవుతుంది. ఎరక్కపోయి వచ్చిం ఇరుక్కుపోవడం అంటే ఇలానే ఉంటుందేమోం పాపం. ఆ శునకం తన పరిస్థితి నుంచి బయటపడాలని ఆరాటపడుతూ ముడసర్లోవ ప్రాంతమంతా తిరిగింది. సాయం చేద్దామని స్థానికులు వెళితే భయంతో పరుగెత్తింది.

ముడసర్లోవ రిజర్వాయరు పక్కన ఉన్న రామకృష్ణాపురంలో ఓ చిన్న టిఫిన్‌ దుకాణం ముందు ఓ వీధి కుక్క ఖాళీగా ఉన్న వాటర్‌ టిన్‌లో తల పెట్టింది. అనుకోకుండా కుక్క తల ఆ టిన్‌లో ఇరుక్కుపోయింది. దీంతో కంగారుపడి ఇరుక్కున్న డబ్బాలో నుంచి తలను వదిలించుకోవాలని తెగ ప్రయత్నించింది.  టిన్‌లో ఓ గ్లాస్‌ ఉండటంతో పరుగెడుతున్నప్పుడు దాని శబ్దానికి మరింత బెదిరిపోయి ముడసర్లోవ పరిసరాల్లో తుప్పలలోకి పరుగెత్తింది. ఆ కుక్కకు సాయం చేయాలన్న స్థానికుల ప్రయత్నం విఫలమైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement