can
-
కామన్ అకౌంట్ నంబర్ అంటే ?
-
కామన్ అకౌంట్ నంబర్ అంటే?
ఫండ్స్‌లో కామన్ అకౌంట్ నంబర్ (క్యాన్) అంటే ఏమిటి? ఇందులో అనుకూల, ప్రతికూలతలు ఏమున్నాయి? – దిలీప్ కామన్ అకౌంట్ నంబర్/క్యాన్ అనేది ఎంఎఫ్ యుటిలిటీస్ వద్ద రిజిస్టర్ చేసుకున్న వారికి ఇచ్చే ఏకీకృత ఖాతా. ఇది మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి అన్ని రకాల లావాదేవీలను నిర్వహించే ఏకీకృత వేదిక. 2015లో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అన్నీ కలసి దీన్ని ఏర్పాటు చేశాయి. ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారులకు సౌకర్యం, సులభతర నిర్వహణ దీని ఏర్పాటు ఉద్దేశ్యంగా ఉంది. ఈ ప్లాట్‌ఫామ్ మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడికి వీలు కల్పిస్తుంది. ఒక ఇన్వెస్టర్ వేర్వేరు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు చెందిన పథకాల్లో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే, విడివిడిగా ఖాతాలు ప్రారంభించి, లావాదేవీలను నిర్వహించుకోవాలి. ఇందుకోసం ప్రతి ఏఎంసీ వద్ద విడిగా నమోదు చేసుకోవాలి. అయితే, క్యాన్‌ను కలిగి ఉండడం తప్పనిసరి కాదు. ఎంఎఫ్ యుటిలిటీ ద్వారానే ఇన్వెస్ట్ చేయాలన్న నిబంధన కూడా లేదు. ఇదొక వేదిక మాత్రమే. ఆ తర్వాత కాలంలో ఎన్నో ఫిన్‌టెక్ కంపెనీలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా, బ్రోకర్ల ద్వారా సులభంగా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. నా వయసు 40 ఏళ్లు. వచ్చే ఏడాది పీపీఎఫ్ గడువు తీరి రూ.15 లక్షలు చేతికి వస్తాయి. ఎన్పీఎస్ తదితర అధిక వృద్ధికి అవకాశం ఉన్న సాధనాల్లోకి ఈ మొత్తాన్ని బదిలీ చేయాలని అనుకుంటున్నాను. పీపీఎఫ్ నుంచి నాకు అందే మొత్తం పన్ను మినహాయింపు కిందకు వస్తుందని తెలిసింది. కనుక ఈ మొత్తాన్ని క్రమానుగతంగా ఈక్విటీ ఫండ్స్‌లోకి మళ్లించేది ఎలా? – సుచిత్ పూతియా పెట్టుబడుల మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌లోకి మళ్లించే సమయంలో మీరు కొన్ని అంశాలను గుర్తు పెట్టుకోవాలి. ఇందులో ముందుగా డ్యురేషన్ ఒకటి. మీరు ఆ మొత్తం సమకూర్చుకోవడానికి పట్టిన కాలంలో సగం కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు మీరు పీపీఎఫ్‌లో 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేశారు. దీంతో ఈ మొత్తం సమకూరింది. కనుక ఏడున్నరేళ్ల పాటు సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయమని కాదు. గరిష్టంగా మూడేళ్లకు మించకుండా నెలవారీ వాయిదాల రూపంలో మీ వద్దనున్న మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీ పెట్టుబడిని సమకూర్చుకోవడానికి ఐదేళ్లు పట్టిందని అనుకుందాం. అందులో సగం అంటే రెండున్నరేళ్ల పాటు క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ నూతన కాల వ్యవధి 15–20 ఏళ్లు అని అంటున్నారు. కనుక ఈక్విటీలకు ఎక్కువ కేటాయించుకోవాలి. ఎందుకంటే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణానికి మించి మెరుగైన రాబడులను ఈక్విటీలు ఇవ్వగలవు. ఎన్పీఎస్ పథకాన్ని ఎంపిక చేసుకుంటే అందులో ఈక్విటీల్లో 75% ఇన్వెస్ట్ చేసే యాక్టివ్ చాయిస్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. 60 ఏళ్లకు వచ్చిన తర్వాత అప్పటికి సమకూరిన మొత్తం నుంచి 60 శాతాన్నే ఉపసంహరించుకోవడానికి ఉంటుంది. మిగిలిన 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ వరకు నిధిని ముట్టుకోని వారు అయితే, ఫ్లెక్సీ క్యాప్ఫండ్స్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి అచ్చమైన ఈక్విటీ పథకాలు. ఉపసంహరణలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఎన్‌పీఎస్‌లో అయితే ఈక్విటీ పెట్టుబడుల్లో అధిక శాతం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కే కేటాయిస్తారు. కానీ, ఫ్లెక్సీక్యాప్ పథకాలు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాల్లోకి పెట్టుబడులను వైవిధ్యం చేస్తాయి. కనుక ఇవి కొంచెం మెరుగైన రాబడులు ఇస్తాయి. ఇప్పటి వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన అనుభవం లేకపోతే, నూరు శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకునే విషయంలో ఆందోళన చెందుతుంటే, అప్పుడు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి ఈక్విటీల్లో 65% వరకే ఇన్వెస్ట్ చేస్తాయి. మిగిలిన 35 శాతాన్ని డెట్‌లో పెడుతాయి. దీనివల్ల ఈక్విటీల్లోని అస్థిరతలను కొంత వరకు తగ్గించుకోవడానికి వీలుంటుంది. ఈక్విటీలతో పోలిస్తే స్థిరమైన రాబడులు ఇస్తాయి. -
ఓ మై డాగ్..! ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయింది
సాక్షి, విశాఖపట్నం: అనవసరంగా ఏ విషయంలోనూ తలదూర్చకూడదని పెద్దలు ఎందుకంటారో ఈ సీన్ చూస్తే అర్థమవుతుంది. ఎరక్కపోయి వచ్చిం ఇరుక్కుపోవడం అంటే ఇలానే ఉంటుందేమోం పాపం. ఆ శునకం తన పరిస్థితి నుంచి బయటపడాలని ఆరాటపడుతూ ముడసర్లోవ ప్రాంతమంతా తిరిగింది. సాయం చేద్దామని స్థానికులు వెళితే భయంతో పరుగెత్తింది. ముడసర్లోవ రిజర్వాయరు పక్కన ఉన్న రామకృష్ణాపురంలో ఓ చిన్న టిఫిన్ దుకాణం ముందు ఓ వీధి కుక్క ఖాళీగా ఉన్న వాటర్ టిన్‌లో తల పెట్టింది. అనుకోకుండా కుక్క తల ఆ టిన్‌లో ఇరుక్కుపోయింది. దీంతో కంగారుపడి ఇరుక్కున్న డబ్బాలో నుంచి తలను వదిలించుకోవాలని తెగ ప్రయత్నించింది. టిన్‌లో ఓ గ్లాస్ ఉండటంతో పరుగెడుతున్నప్పుడు దాని శబ్దానికి మరింత బెదిరిపోయి ముడసర్లోవ పరిసరాల్లో తుప్పలలోకి పరుగెత్తింది. ఆ కుక్కకు సాయం చేయాలన్న స్థానికుల ప్రయత్నం విఫలమైంది. -
వాటర్ క్యాన్ డ్రిప్!
సేంద్రియ ఇంటిపంటల సాగులో ద్రవ జీవామృతం, ఆవుమూత్రం, జీవన ఎరువులను కూరగాయ మొక్కలకు సులభంగా అందించడానికి ఉపయోగపడే అతి తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతి ఇది. పుల్లయ్యగారి బ్రహ్మానందరెడ్డి, అనిత దంపతులు వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో తమ ఇంటి వద్ద పెరట్లో కొన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయడం రెండు నెలల క్రితం ప్రారంభించారు. తాము నివాసం ఉండే భవనం పక్కనే 40 అడుగుల వెడల్పు, 70 అడుగుల పొడవున ఖాళీ స్థలం(ఎర్ర నేల)లో సేంద్రియ పెరటి తోట సాగు చేస్తున్నారు. ఈ పెరటి తోటకు రోజువారీగా నీటిని, జీవామృతం, జీవన ఎరువులు వంటి ద్రవ రూప ఎరువులను తక్కువ సమయంలో, తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో అందించడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించారు. ఇంటిపైన నిర్మించిన వాటర్ ట్యాంకు నుంచి నీటిని సరఫరా చేసే పైపునకు గేట్ వాల్ సిస్ఠం ఏర్పాటు చేసుకొని.. ఇన్లైన్ డ్రిప్పర్ లైన్ల ద్వారా నీటిని కూరగాయ మొక్కలకు అందిస్తున్నారు. రోజువారీగా నీటిని అందించడానికి ఇది పనికొచ్చింది. అయితే, ద్రవ రూప ఎరువులను కూడా నీటితోపాటే అందించేదెలా? అని ఆలోచించారు. తాగునీటి సరఫరా కోసం ఉపయోగించే 20 లీటర్ల వాటర్ క్యాన్‌ను ఏర్పాటు చేసి, దీని ద్వారా డ్రిప్ లైన్‌ను అనుసంధానం చేస్తూ సునాయాసంగా ద్రవ రూప ఎరువులను సైతం ఇంటిపంటలకు ఇవ్వగలుగుతున్నారు. తొలుత నీరు.. తర్వాత ద్రవ రూప ఎరువులు.. మిత్రుడు ప్రకృతి వ్యవసాయదారుడు ప్రవీణ్‌కుమార్ రెడ్డి తోడ్పాటుతో అనేక రకాల ప్రయోగాలు చేసే క్రమంలో ఈ ‘లో కాస్ట్ ఫర్టిగేషన్ సిస్టమ్ ఫర్ కిచెన్/టెర్రస్/అర్బన్ గార్డెనింగ్’ను రూపొందించామని బ్రహ్మానందరెడ్డి తెలిపారు. వడకట్టిన ద్రవజీవామృతం లేదా ఆవు మూత్రం లేదా అజోస్పిరిల్లమ్, ఫాస్పోబాక్టీరియా వంటి జీవన ఎరువుల ద్రావణాలను 3 రోజులకు ఒక్కో రకాన్ని ఇంటిపంటలకు అందిస్తున్నారు. 20 లీటర్ల వాటర్ క్యాన్‌లో 2 నుంచి 4 లీటర్ల ద్రవ జీవామృతం లేదా ఆవు మూత్రం లేదా జీవన ఎరువుల ద్రావణాన్ని కలుపుతారు. పెరటి తోటలో బ్రహ్మానందరెడ్డి, అనిత ద్రవ రూప ఎరువుల సరఫరా ఇలా.. వాటర్ క్యాన్‌కు పైన ఎయిర్ వాల్వ్ బిగించారు. ఎయిర్ వాల్వ్ మూతను విప్పి.. అందులో నుంచి వాటర్ క్యాన్లోపలికి ద్రవ రూప ఎరువులను వడకట్టి పోస్తారు. ఆ తర్వాత డ్రిప్ ద్వారా నీటిని వదులుతారు. వాటర్ క్యాన్ లోపలకు నీరు వెళ్లేందుకు కింది భాగం నుంచి ఒక ఇన్లెట్, బయటకు నీరు పోవడానికి పై భాగంలో ఒకటి, కింది భాగంలో మరొకటి అవుట్ లెట్లను బిగించారు. ద్రవ రూప ఎరువులను వాటర్ క్యాన్ ద్వారా నీటితో కలిపి వెళ్లేలా చేయాలనుకున్నప్పుడు.. క్యాన్ పై భాగంలోని అవుట్ లెట్ ద్వారా నీటిని బయటకు వెళ్లేలా చేస్తారు. అలా చేయడం ద్వారా 10–15 నిమిషాల పాటు ద్రవరూప ఎరువులు నీటితో కొద్దికొద్ది కలిసి ఇంటిపంటలకు సరఫరా అవుతున్నదని బ్రహ్మానందరెడ్డి తెలిపారు. అవుట్ లెట్ మొదట కింది భాగంలో మాత్రమే ఏర్పాటు చేశానని, అప్పుడు 5 నిమిషాల్లోనే ద్రవ రూప ఎరువు పూర్తిగా వెళ్లిపోయేదన్నారు. క్యాన్‌కు పై భాగంలో అవుట్ లెట్ ఏర్పాటు చేయడం వల్ల 10–15 నిమిషాల పాటు ద్రవ రూప ఎరువుతో కూడిన నీటిని 70 అడుగుల పొడవు డ్రిప్ వరుసలో ఉన్న చివరి మొక్కలకు కూడా అందించగలుగుతున్నామని ఆయన వివరించారు. రసాయనిక అవశేషాల్లేని మిర్చి, వంగ, బీర, సొర, టమాటాలతోపాటు గోంగూర, చుక్క, పాల కూరలను పండించి, బంధుమిత్రులకు కూడా రుచి చూపిస్తున్నామని బ్రహ్మానందరెడ్డి(94411 85563), అనిత సంతోషంగా తెలిపారు. -
ఆక్సీ99.. చేతిలో ఇమిడే ఆక్సీజన్ క్యాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆక్సిజన్ అనగానే ఇప్పటి వరకు ఆసుపత్రుల్లో ఉండే పెద్ద సిలిండర్లే తెలుసు. కానీ ‘ఆక్సీ99’ పేరుతో 120 గ్రాముల బరువున్న క్యాన్ భారత్‌లో తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది. ధర రూ.650. ఇటలీకి చెందిన ఆరోగ్య సంస్థ ఐఎన్జీ ఎల్అండ్ఏ బాషి టెక్నాలజీ సహకారంతో ఢిల్లీ క్రయోజనిక్ ప్రొడక్ట్స్ దీన్ని రూపొందించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో దీన్ని బ్లూవాటర్ ఆల్కలైన్ సొల్యూషన్స్ మార్కెట్ చేస్తోంది. క్యాన్ జీవిత కాలం రెండేళ్లు. 150 ఇన్హలేషన్స్ (స్ప్రేలు) వరకు పనిచేస్తుంది. ఆస్తమా, శ్వాస సంబంధ, తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఇది వాడితే ఉపశమనంగా ఉంటుందని బ్లూవాటర్ సొల్యూషన్స్ సీఎండీ కలిశెట్టి నాయుడు సోమవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆక్సీ ఉత్పత్తులకు ఇండియన్ ఫార్మకోపియా ధ్రువీకరణ ఉందన్నారు. అల్యూమినియంతో తయారైన తేలికైన సిలిండర్లను 75–1,700 లీటర్ల సామర్థ్యంతో కంపెనీ తయారు చేస్తోందని చెప్పారు. అన్ని పట్టణాల్లో పంపిణీదారులను నియమిస్తామన్నారు. 12 రాష్ట్రాల్లో ప్రతి నెల 1,50,000 యూనిట్లను విక్రయిస్తున్నామని ఢిల్లీ క్రయోజనిక్ ప్రొడక్ట్స్ జోనల్ మేనేజర్ శివ్ శర్మ వెల్లడించారు. -
పసుపు క్యాన్ కొంటేనే ‘సుజలధార’
కాశీబుగ్గ : పసుపు క్యాన్‌కు రూ.400 చెల్లిస్తేనే ఎన్టీఆర్ సుజల తాగునీరు అందించే కార్డు అందజేస్తామని నిర్వాహకులు తేల్చిచెప్పడంతో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రజలు విస్తుపోతున్నారు. మున్సిపాలిటీలో 11 చోట్ల, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో 6 చోట్ల సుజలధార పథకాలు ఏర్పాటు చేశారు. తాగునీరు కావాలంటే రూ.400 చెల్లించి పసుపు ట్యాంకు తమ వద్దే కొనుగోలు చేయాలని నిర్వాహకులు చెబుతుండటంతో ప్రజలు మండిపడుతున్నారు. తమవద్ద పాత క్యాన్లు ఉన్నాయని చెబుతున్నా వినడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు కూడా ముఖం చాటేస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక జన్మభూమి కమిటీ సభ్యులు తమ చేతికి మట్టి అంటకుండా కొంతమంది వ్యక్తులను నియమించి ఈ ట్యాంకులను ఒకొక్కటి రూ.400 చొప్పున అమ్ముతున్నారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రి, పురుషోత్తపురం, పలాస హైస్కూల్, మున్సిపల్ కార్యాలయాల వద్ద ఈ వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం రెండు రూపాయలకే 20 లీటర్లు తాగునీరు అందిస్తామని ఏర్పాటుచేసి ప్రారంభించిన నిర్వాహకులు ఇప్పుడు పసుపు క్యాన్ కొనుగోలు చేస్తేనే తప్ప కార్డు ఇవ్వమని చెబుతుండటం తగదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలనని పలువురు కోరుతున్నారు. -
కలిస్తే... గెలుస్తాం
నేడు వరల్డ్ క్యాన్సర్ డే ‘మనమందరం చేయి చేయి కలిపితే క్యాన్సర్‌పై విజయం సాధించగలం’ అనే నినాదంతో ‘టు గెదర్ వియ్ కెన్’ అనే దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని డీఎస్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించనుంది. వరల్డ్ క్యాన్సర్ డేగా పరిగణించే ఫిబ్రవరి 4వ తేదీన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. క్యాన్సర్‌పై విజయం సాధించాలంటే ‘సంయుక్త పోరాటం’ అన్నది కీలకమైన భూమిక పోషిస్తుందన్న అంశాన్ని చాటి చెప్పడమే ఈ కార్యక్రమం (స్పెషల్ డ్రైవ్) ఉద్దేశం. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని డీఎస్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన నిపుణుల బృందం అనేక కార్యకలాపాలను చెప్పట్టనుంది. క్యాన్సర్ వ్యాధిపై పోరాటం చేస్తున్న అనేక మంది కార్యకర్తలు, స్కూలు విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమాలను చేయనుంది. ఇందులో భాగంగా అనేక మంది విద్యార్థులు, రోగులు, వ్యాధి పూర్తిగా తగ్గిన వారితో హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో నేడు ర్యాలీ నిర్వహించనున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) ప్రకారం 2020 నాటికి 17 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతాయని అంచనా. ఇది ఆందోళన కలిగించే అంశం. భారతదేశంలో ఈ వ్యాధి గురించి అవగాహన కలిగించాల్సిన తక్షణ ఆవశ్యకత ఎంత ఉందో ఈ అంకెలు సూచిస్తున్నాయి. ఇప్పటికే క్యాన్సర్ పట్ల మన దేశంలో తగినంత అవగాహన లేదు. అందుకే సమాజంలోని అన్ని వర్గాల్లోకి క్యాన్సర్ విషయంలో విస్తృతమైన పరిజ్ఞానం అందేలా లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో డీఎస్ రీసెర్చ్ సెంటర్ తన డీఎస్ఆర్సీ క్లినిక్ ప్రాంగణంలో ఒక సదస్సును నిర్వహించనుంది. ఇందులో డీఎస్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన నిపుణులు పాల్గొంటారు. ప్రపంచంలో అందే సేవలతో పోలిస్తే భారత్‌లో 2020 నాటికి రోగులకు అత్యుత్తమమైన, నాణ్యమైన సేవలను విశ్వసనీయతతో, నైతిక విలువలతో, సానుభూతితో అత్యంత అందుబాటు ధరలకే అందించాలన్న కృతనిశ్చయంతో డీఎస్ రీసెర్చ్ సెంటర్ పనిచేస్తోంది. ఈ సంస్థ ఎంతోకాలంగా సాంప్రదాయిక ఆయుర్వేద ఆధారిత పోషకాలనూ, వాటితో ఒనగూరే శక్తిసామర్థ్యాలను క్యాన్సర్ నివారణకు, చికిత్సకూ ఉపకరించేలా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పనిచేస్తోంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగులలో వ్యాధి తగ్గుతుందని ఆశాభావాన్ని, నమ్మకాన్ని, సంతోషాన్ని పాదుగొలుపుతోంది. ఈ నెల 4న తమ క్లినిక్‌కు వచ్చే పేషెంట్లకు ఫ్రీ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగించాలని డీఎస్ రీసెర్చ్ సెంటర్ నిర్ణయించింది. ఈ విషయం పైన మరింత సమాచారం కోసం 91 9100943142 040–46664141కు కాల్ చేయవచ్చు.