కలిస్తే... గెలుస్తాం
నేడు వరల్డ్ క్యాన్సర్ డే
‘మనమందరం చేయి చేయి కలిపితే క్యాన్సర్‌పై విజయం సాధించగలం’ అనే నినాదంతో ‘టు గెదర్ వియ్ కెన్’ అనే దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని డీఎస్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించనుంది. వరల్డ్ క్యాన్సర్ డేగా పరిగణించే ఫిబ్రవరి 4వ తేదీన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. క్యాన్సర్‌పై విజయం సాధించాలంటే ‘సంయుక్త పోరాటం’ అన్నది కీలకమైన భూమిక పోషిస్తుందన్న అంశాన్ని చాటి చెప్పడమే ఈ కార్యక్రమం (స్పెషల్ డ్రైవ్) ఉద్దేశం.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని డీఎస్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన నిపుణుల బృందం అనేక కార్యకలాపాలను చెప్పట్టనుంది. క్యాన్సర్ వ్యాధిపై పోరాటం చేస్తున్న అనేక మంది కార్యకర్తలు, స్కూలు విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమాలను చేయనుంది. ఇందులో భాగంగా అనేక మంది విద్యార్థులు, రోగులు, వ్యాధి పూర్తిగా తగ్గిన వారితో హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో నేడు ర్యాలీ నిర్వహించనున్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్‌ఆర్) ప్రకారం 2020 నాటికి 17 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతాయని అంచనా. ఇది ఆందోళన కలిగించే అంశం. భారతదేశంలో ఈ వ్యాధి గురించి అవగాహన కలిగించాల్సిన తక్షణ ఆవశ్యకత ఎంత ఉందో ఈ అంకెలు సూచిస్తున్నాయి. ఇప్పటికే క్యాన్సర్ పట్ల మన దేశంలో తగినంత అవగాహన లేదు. అందుకే సమాజంలోని అన్ని వర్గాల్లోకి క్యాన్సర్ విషయంలో విస్తృతమైన పరిజ్ఞానం అందేలా లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో డీఎస్ రీసెర్చ్ సెంటర్ తన డీఎస్‌ఆర్‌సీ క్లినిక్ ప్రాంగణంలో ఒక సదస్సును నిర్వహించనుంది. ఇందులో డీఎస్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన నిపుణులు పాల్గొంటారు.
ప్రపంచంలో అందే సేవలతో పోలిస్తే భారత్‌లో 2020 నాటికి రోగులకు అత్యుత్తమమైన, నాణ్యమైన సేవలను విశ్వసనీయతతో, నైతిక విలువలతో, సానుభూతితో అత్యంత అందుబాటు ధరలకే అందించాలన్న కృతనిశ్చయంతో డీఎస్ రీసెర్చ్ సెంటర్ పనిచేస్తోంది. ఈ సంస్థ ఎంతోకాలంగా సాంప్రదాయిక ఆయుర్వేద ఆధారిత పోషకాలనూ, వాటితో ఒనగూరే శక్తిసామర్థ్యాలను క్యాన్సర్ నివారణకు, చికిత్సకూ ఉపకరించేలా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పనిచేస్తోంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగులలో వ్యాధి తగ్గుతుందని ఆశాభావాన్ని, నమ్మకాన్ని, సంతోషాన్ని పాదుగొలుపుతోంది.
ఈ నెల 4న తమ క్లినిక్‌కు వచ్చే పేషెంట్లకు ఫ్రీ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగించాలని డీఎస్ రీసెర్చ్ సెంటర్ నిర్ణయించింది. ఈ విషయం పైన మరింత సమాచారం కోసం 91 9100943142 040–46664141కు కాల్ చేయవచ్చు.