Parliament of India Passed the Wild Life Protection Act On August 21 1972 - Sakshi
Sakshi News home page

ఇండియాలో ఈ జంతువుల్ని పెంచుకోవటం నేరం

Published Sat, Aug 21 2021 12:00 PM | Last Updated on Sat, Aug 21 2021 1:15 PM

Wild Life Protection Act 1972 Owning These Animals Is Illegal In India - Sakshi

న్యూఢిల్లీ : వన్య ప్రాణి సంరక్షణా చట్టం అమల్లోకి వచ్చి నేటితో 49 ఏళ్లు. ఆగస్టు 21, 1972న ఈ చట్టం అమల్లోకి వచ్చింది. అడవి మొక్కలు, జంతువులు, పక్షులను వేటాడటం, హింసించటం, గాయపరచటం, నాశనం చేయటం, వాటి శరీరభాగాలను తీసుకోవటం ఈ చట్ట ప్రకారం నేరం. సరిసృపాలు, పక్షుల గూళ్లను కదల్చటం, నాశనం చేయటం శిక్షార్హం. ఈ చట్టం ప్రకారం ఏ రాష్ట్రమైనా వన్యప్రాణి సంస్థ అనుమతి లేకుండా పార్కులు, వన్యప్రాణి కేంద్రాలకు సంబంధించి హద్దులను మార్చకూడదు.

ఈ చట్టం ప్రకారం పులులు, సింహాల వంటి క్రూరమైన జంతువులే కాక మరికొన్ని సాధు జంతువులను పెంచుకోవటం కూడా చట్టవిరుద్ధం.. 
1) కొన్ని రకాల తాబేళ్లు : మామూలుగా తాబేళ్లను పెంచుకోవటం నేరంకాదు. కానీ, ఇండియన్‌ స్టార్‌, రెడ్‌ ఇయర్‌ స్లైడర్‌ వంటి తాబేలు రకాలను కలిగి ఉండటం చట్ట విరుద్ధం. 
2) సముద్రపు జంతువులు : సముద్రపు జంతువులను వాటి నివాస స్థావరాలనుంచి బయటకు తేవటం, అక్వేరియం, నీటి పాత్రలో పెంచటం నిషిద్ధం. 
3) పక్షులు : వన్య ప్రాణి సంరక్షణా చట్టం 1972 ప్రకారం ప్యారకీట్స్‌(చిలుకల్లో ఓరకం), నెమళ్లు, కోయిలలు, మునియా వంటి వాటిని పెంచటం చట్ట విరుద్ధం.
4) కోతులు : వినోదం కోసం కోతులను పెంచుకోవటం, వాటికి శిక్షణ ఇవ్వటం  వన్య ప్రాణి సంరక్షణా చట్టం 1972 ప్రకారం నేరం.

చదవండి : చిరుత నోట్లో బాబి కాలు.. బసంతి షాక్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement