Wild Life Act
-
ఇండియాలో ఈ జంతువుల్ని పెంచుకోవటం నేరం
న్యూఢిల్లీ : వన్య ప్రాణి సంరక్షణా చట్టం అమల్లోకి వచ్చి నేటితో 49 ఏళ్లు. ఆగస్టు 21, 1972న ఈ చట్టం అమల్లోకి వచ్చింది. అడవి మొక్కలు, జంతువులు, పక్షులను వేటాడటం, హింసించటం, గాయపరచటం, నాశనం చేయటం, వాటి శరీరభాగాలను తీసుకోవటం ఈ చట్ట ప్రకారం నేరం. సరిసృపాలు, పక్షుల గూళ్లను కదల్చటం, నాశనం చేయటం శిక్షార్హం. ఈ చట్టం ప్రకారం ఏ రాష్ట్రమైనా వన్యప్రాణి సంస్థ అనుమతి లేకుండా పార్కులు, వన్యప్రాణి కేంద్రాలకు సంబంధించి హద్దులను మార్చకూడదు. ఈ చట్టం ప్రకారం పులులు, సింహాల వంటి క్రూరమైన జంతువులే కాక మరికొన్ని సాధు జంతువులను పెంచుకోవటం కూడా చట్టవిరుద్ధం.. 1) కొన్ని రకాల తాబేళ్లు : మామూలుగా తాబేళ్లను పెంచుకోవటం నేరంకాదు. కానీ, ఇండియన్ స్టార్, రెడ్ ఇయర్ స్లైడర్ వంటి తాబేలు రకాలను కలిగి ఉండటం చట్ట విరుద్ధం. 2) సముద్రపు జంతువులు : సముద్రపు జంతువులను వాటి నివాస స్థావరాలనుంచి బయటకు తేవటం, అక్వేరియం, నీటి పాత్రలో పెంచటం నిషిద్ధం. 3) పక్షులు : వన్య ప్రాణి సంరక్షణా చట్టం 1972 ప్రకారం ప్యారకీట్స్(చిలుకల్లో ఓరకం), నెమళ్లు, కోయిలలు, మునియా వంటి వాటిని పెంచటం చట్ట విరుద్ధం. 4) కోతులు : వినోదం కోసం కోతులను పెంచుకోవటం, వాటికి శిక్షణ ఇవ్వటం వన్య ప్రాణి సంరక్షణా చట్టం 1972 ప్రకారం నేరం. చదవండి : చిరుత నోట్లో బాబి కాలు.. బసంతి షాక్.. -
పెద్ద పులిని కాపాడుకుందామా !
సాక్షి, నిర్మల్ : బెబ్బులిని చూస్తే అడవి భయపడుతుంది. అలాంటి పులి ఇప్పుడు మనిషిని చూసి బెదురుతోంది. జాతీయ జంతువు అన్న భయం.. కనికరం కూడా లేకుండా.. ఎక్కడ కరెంటు షాక్ పెట్టి చంపుతాడో.. ఎందులో విషం కలిపి ఉసురు తీస్తాడో.. అని దట్టమైన అడవిలో గుండె దిటవు చేసుకుని బతుకు జీవుడా.. అంటోంది. గత కొన్నేళ్లుగా అడవుల జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి ఆదిలాబాద్‌లో పదుల సంఖ్యలో పులులు వేటగాళ్ల ఉచ్చులకు, స్మగ్లర్ల స్కెచ్లకు బలయ్యాయి. 2018 చివరలోనే వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాపై దృష్టిపెట్టి అటవీశాఖ ప్రక్షాళన చేపట్టారు. అప్పటి నుంచి కొంతలో కొంత మార్పు కనిపిస్తోంది. వనంతో వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నారు. నేడు(మార్చి–3) ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా కవ్వాల్ పులులపై కథనం. పెరుగుతున్న పులుల సంఖ్య రాష్ట్రంలోని రెండు అభయారణ్యాల్లో ఒకటైన మన కవ్వాల్ పులుల అభయారణ్యంలో వాటి సంఖ్య పెరుగుతున్నట్లు కేంద్రం చెబుతోంది. ప్రతీ నాలుగేళ్లకోసారి కేంద్ర అటవీ శాఖ పరిధిలోని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) రాష్ట్రాల్లోని పులుల సంఖ్యను లెక్కిస్తుంటుంది. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన వివరాల ప్రకారం తెలంగాణలో 26 పులులు ఉన్నట్లు తేలింది. అప్పటి నుంచి పోలిస్తే వీటి సంఖ్య మరింత పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యంలో 10–12 పులులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గతంతో పోలిస్తే పెరిగిన పులులను కాపాడేందుకు చర్యలు చేపడుతున్నానీ చెబుతున్నారు. నాలుగేళ్లలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) ప్రతి నాలుగేళ్లకోసా పులుల సంఖ్యను వెల్లడిస్తోంది. రాష్ట్రం ఏర్పడ్డాక గతేడాది తొలిసారి ఈ వివరాలు వెల్లడయ్యాయి. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు, టైగర్ రిజర్వ్‌లు ఇలా అటవీ ప్రాంతాలన్నింటిలో పులులను అంచనా వేసేందుకు 2018 జూన్‌లో ఓ వారంపాటు అధ్యయనం జరిపారు. పులి పాదాల గుర్తులు, అడవుల్లో పెట్టిన కెమెరాలు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం లెక్కించారు. ఏడాదిపాటు శాస్త్రీయ సర్వే చేసిన తర్వాత వివరాలు వెల్లడించారు. వాటి ప్రకారం.. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో పులుల సంఖ్య 68 ఉండగా, అప్పుడు తెలంగాణలో 20 ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని కవ్వాల్ అభయారణ్యంలో 3 పులులు ఉన్నట్లు అంచనా వేశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం కవ్వాల్‌లో 10–12వరకు పులులు ఉండొచ్చని అటవీ అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఖతం కవ్వాల్ అభయారణ్యానికి గతంలో వచ్చిన పులి.. వచ్చినట్లే ఖతమైంది. వేటగాళ్ల ఉచ్చులతో, స్మగ్లర్లు వేసిన స్కెచ్‌లతో పెద్దపులులు ప్రాణాలు కోల్పోయాయి. రెండేళ్లక్రితం వరుసగా కవ్వాల్ అభయారణ్యంలోని పులులను హతమార్చారు. వైల్డ్ లైఫ్ క్రైం సెంట్రల్ టీమ్ సభ్యులు ఇచ్చోడలో పులిచర్మం పట్టుకోవడం అప్పట్లో సంచలనమైంది. ఈ కేసులో కూపీ లాగగా, పెంబి మండలం తాటిగూడకు చెందిన గుగ్లావత్ ప్రకాశ్ అదే మండలంలోని పుల్గంపాండ్రి అడవుల్లో ఆ పులిని చంపినట్లు తేలింది. పుల్గంపాండ్రి గ్రామానికి చెందిన హలావత్ మున్యాతో కలిసి విద్యుత్ ఉచ్చుతో పులిని హతమార్చాడు. మాంసాన్ని కాల్చివేసి, దాని చర్మాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తూ దొరికిపోయాడు. ఆ తర్వాత పాత మంచిర్యాల బీట్‌లో చిరుతను హతమార్చడం, అదే క్రమంలో శివ్వారం బీట్‌లో ఏకంగా రాయల్ బెంగాల్ టైగర్‌ను మట్టుబెట్టడం తీవ్ర సంచలనం సృష్టించింది. కవ్వాల్ అడవుల్లోకి వచ్చిన పులిని వచ్చినట్లే చంపుతుండటంపై సర్కారు సీరియస్ అయ్యింది. ఏకంగా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(సీఎఫ్)తో పాటు నాలుగు జిల్లాల్లోని పలువురు డీఎఫ్ఓలు, ఎఫ్ఆర్ఓలు, ఎఫ్‌ఎస్‌ఓలు, ఎఫ్‌బీఓలను బదిలీ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కవ్వాల్ ‘గుడ్’ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఉమ్మడి జిల్లాలోని నాలుగు అంటే..నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోకి వస్తోంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో భాగంగా ఉండే కొండలు, దట్టమైన అడవులతో ఉంటుంది. 2012లో కేంద్రంలో దేశంలో 41వ, రాష్ట్రంలో రెండో పులుల అభయారణ్యంగా ప్రకటించింది. దాదాపు 2,020 చదరపు కిలోమీటర్ మేర విస్తరించి ఉంది. ఇందులో 897 చ.కిలోమీటర్లు పెద్ద పులి సంచరించే కోర్ ఏరియాగా, 1,123 చ. కి. వేటాడే బఫర్ ఏరియాగా విభజించారు. తెలంగాణ ఏర్పడక ముందు ఇక్కడ పులులు శాతం చాలా తక్కువ. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మెరుగైన నిర్వహణ పద్ధతులను అవలంబిస్తుండటంతో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. గతంతో పోలిస్తే ఎన్టీసీఏ జాబితాలో 60.16 శాతంతో కవ్వాల్ రేటింగ్ ‘ఫెయిర్’నుంచి ‘గుడ్’స్థానానికి పెరిగింది. గతంతో పోలిస్తే.. ప్రస్తుతం అనువైన వాతా వరణం కారణంగా క్రమంగా పులుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలు ఫలిస్తున్నాయి. గతంలో కవ్వాల్కు వచ్చిన ఒక్క ఫాల్గుణ పులి ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తిప్పేశ్వర్, తాడోబా తదితర ఏరియాల నుంచి పులులు కవ్వాల్ వైపు వస్తున్నాయి. ‘బచావో’లో భాగంగా అడవులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఏళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై బదిలీ వేటు వేసిన సర్కారు వారి స్థానాల్లో కఠినంగా వ్యవహరించే వారిని నియమించింది. ‘జంగిల్ బచావో– జంగిల్ బడావో’నినాదంతో అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపడుతోంది. సీఎం సీరియస్‌గా ఇచ్చి న ఆదేశాలతో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో సంస్కరణలు కొనసాగుతున్నాయి. అడవులతో పాటు ఇప్పుడు జాతీయ జంతువైన పులిని కూడా రక్షించాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా సీఎఫ్ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో అభయారణ్యంలో పలు చర్యలు చేపడుతున్నారు. అభయారణ్యంలోకి పులి రాకకు అడ్డంకులుగా మారుతున్న వాటిపై దృష్టిపెట్టారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలో అభయారణ్యం పరిధిలో ఉన్న రాంపూర్, మైసంపేట్ గ్రామాలను మైదాన ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇప్పటికే ఈ గ్రామాల పునరావాసం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తనవంతు నిధులు ఇవ్వాల్సి ఉంది. -
వాటిని చంపితే జైలుశిక్ష అనుభవించాల్సిందే!
సాక్షి,శ్రీకాకుళం : ‘జాతీయ జంతువు పెద్దపులిని చంపినా... కొండ చిలువను చంపినా.. ఒకే రకమైన శిక్ష తప్పదని, వణ్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమిస్తే ఎవ్వరినీ విడిచి పెట్టేది లేదని జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ కృపాకర్ గుండాల హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల కొండ చిలువలను హతం చేస్తున్న ఘటనలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని కూడా చట్టం ప్రకారం నేరంగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. వణ్యప్రాణి సంరక్షణ చట్టం (1972) ప్రకారం షెడ్యూల్–1 కేటగిరీలో పెద్దపులి, నెమలి, జింక, ఫిషింగ్ క్యాట్, కొండ గొర్రె, ఏనుగు, చిరుత పులి, ఎలుగు బంటి తదితర జంతువులతోపాటు కొండ చిలువలను చంపితే చట్టప్రకారం ఏడాది నుంచి ఆరేళ్ల వరకు కఠిన జైలుశిక్షతోపాటు భారీ జరిమానా విధిస్తామని వివరించారు. జిల్లాలో 15 రోజుల్లోనే లావేరు, బూర్జ, గార, నందిగాం, పలాస, ఆమదాలవలస తదితర మండలాలతోపాటు ఏజెన్సీ మండలాల్లోనూ పది వరకు కొండచిలువలను చంపేసినట్లుగా పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. ఇది నిజంగా దారుణమన్నారు. కొండచిలువలు ఎక్కడైనా తారసపడితే.. వెంటనే తమ అటవీ శాఖాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో ప్రజలు మరింత అవగాహన కలిగించుకోవాలన్నారు. సచివాలయాల్లో అటవీ శాఖ అధికారుల వివరాలు జిల్లాలో వణ్యప్రాణి సంరక్షణ చట్టం అమల్లో భాగంగా అన్ని మండలాల్లోనూ సచివాలయాలతోపాటు పలు ప్రభుత్వ భవనాల వద్ద స్థానిక అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచుతామని డీఎఫ్‌వో సందీప్ కృపాకర్ తెలియజేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ శాఖ చట్టంపై అవగాహన కలిగించేలా తమ అధికార బృందంతో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నామని వివరించారు. ఇందులో ప్రజలను భాగస్వాములను చేస్తామన్నారు. అదేవిధంగా ఇదే చట్టం ప్రకారం షెడ్యూల్–3లో అడవి పందిని చంపినా కచ్చితంగా నేరంగానే కేసులు నమోదు చేస్తామన్నారు. ఇటీవల పొందూరు మండలంలో ఓ కేసును నమోదు చేసినట్లు గుర్తు చేశారు. అటవీ శాఖ అధికారులు, సిబ్బంది కూడా చట్టాలపై పూర్తి అవగాహనతో ఉండాలని, వణ్యప్రాణులను చంపిన వారిపై ఎక్కడి నుంచి సమాచారం వచ్చినా, వెంటనే అప్రమత్తమై, క్షేత్ర స్థాయిలో వాస్తవాలను గుర్తించి నిందితులపై కేసులను నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇకమీదట వణ్యప్రాణుల సంరక్షణకు అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లుగా ప్రకటించారు. -
మొసలికి చుక్కలు చూపించారు...
బెంగళూరు: ఒకరు, ఇద్దరు ఉన్నప్పుడు మొసలిని చూస్తేనే.. వామ్మో మొసలి అంటూ పరుగుతీయడం సహజం. అదే జనాలు గుంపుగా ప్రాంతాల్లోకి మొసలి వస్తే వాటికి చుక్కలు చూపిస్తారు. అలాంటి ఘటనే కర్ణాటక తూర్పు ప్రాంతంలో ఇటీవలే చోటుచేసుకుంది. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా శివనూర్ గ్రామం సమీపంలో ఓ నీటిమడుగు నుంచి మొసలి బయటకు వచ్చింది. ఆ విషయాన్ని కొందరు గ్రామస్తులు గమనించారు. మనోళ్లు గుంపుగా ఉంటే ఊరకనే ఉంటారా.. ఇక దానిపై రాళ్లతో దాడి చేయడం ప్రారంభించారు. మొసలికి చుట్టూ నిలబడి నవ్వూతూ దాన్ని కన్ ఫ్యూజ్ చేశారు. ఆ తర్వాత రాళ్లు, ఇటుకలు, చేతికి అందిన వస్తువులతో దాని తలపై కొట్టడం మొదలెట్టారు. కొన్ని నిమిషాల్లోనే అది తీవ్రంగా గాయపడి ఎక్కడికి కదలలేక అక్కడే ఉండిపోయింది. ఆ జనాలకు మరింత ఉషారొచ్చేసింది. తొలుత ఓ వ్యక్తి దాని తోక పట్టుకుని లాగడం చేశాడు. అయితే ఎంతకూ మొసలిని కాస్త కూడా కదల్చలేకపోయాడు. వెంటనే ఇంకో వ్యక్తి తోడవడంతో ఇద్దరూ కలిసి మొసలి తోకను పట్టుకుని కాస్త లాగేసరికి అది కదలింది. వెంటనే ఓసారి కాస్త భయపడ్డారు. ఆ తర్వాత మరోవ్యక్తి మరింత సాహసం చేస్తున్నట్లుగా మొసలిపైకి ఎక్కి దాన్ని తొక్కుతూ ఫొటో దిగాడు. మొసలిపై రాళ్లతో దాడిచేయడం ఈ పూర్తి ఘటనను వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో అక్కడ హల్ చల్ చేస్తోంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు పెరిగి పోతున్నాయి. -
సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం
-
సెంట్రల్ యూనివర్సిటీలో జింక కాల్చివేత
♦ షూటింగ్ రేంజ్ కోచ్ తుపాకీతో కాల్చినట్లు అనుమానం ♦ వర్సిటీలో జింక తల, మాంసం స్వాధీనం ♦ పోలీసుల అదుపులో కోచ్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) షూటింగ్ రేంజ్లో కోచ్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి జింక (వన్య మృగం)ను వేటాడాడు. తుపాకీతో కాల్చి చంపాడు. తల వేరు చేసి, చర్మం వలిచి, మాంసం ఓ గదిలో దాచి పెట్టారు. షూటింగ్ ప్రాక్టీస్‌కు వచ్చిన వారు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో గుట్టురట్టయ్యింది. తుపాకీతో కాల్చి వేటాడినట్లు గచ్చిబౌలి పోలీసులు అనుమానిస్తున్నారు. సీఐ జె.రమేశ్ కుమార్ కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు జింకను కోసి, గదిలో దాచారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి వెళ్లి జింక మాంసం, తల, చర్మం, పొట్ట, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. నానక్‌రాంగూడ వెటర్నరీ డాక్టర్ అరుణ అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. తుపాకీతో కాల్చినట్లు ఆనవాళ్లు జింక చర్మాన్ని పరిశీలించగా రెండు చోట్ల తుపాకీ గుళ్లు లోపలికి చొచ్చుకొని వెళ్లినట్లు తెలుస్తోందని సీఐ తెలిపారు. ఉదయం 6 గంటలకే చంపి ఉంటారని పేర్కొన్నారు. మధ్యాహ్న సమయంలో తలను వేరు చేసి చర్మాన్ని వలిచారని, గుట్టు చప్పుడు కాకుండా సెక్యూరిటీ గదిలో దాచి ఉంచారని తెలిపారు. ఎఫ్ఎస్ఎల్కు నమూనాలు జింక మాంసం శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగానే కేసు దర్యాప్తు జరుగుతుందన్నారు. జింకను ఎంతమంది వేటాడారో దర్యాప్తులో తేలుతుందన్నారు. కాగా కుక్కలు చంపేశాయని ప్రధాన నిందితుడుగా భావిస్తున్న షూటింగ్రేంజ్ కోచ్ గోవిందరావు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు కోచ్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెళియాపుట్టికి చెందిన పి.గోవిందరావు చందానగర్‌లో నివాసముంటూ పన్నెండేళ్లుగా సెంట్రల్ యూని వర్సిటీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో ఎయిర్ రైఫిల్, ఎయిర్ పిస్టల్ కోచ్‌గా పనిచేస్తున్నారు. షూటింగ్ రేంజ్లో సాయి సెక్యూరిటీ కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డులు ఉదయం ఐదుగురు, రాత్రి నలుగురు పనిచేస్తుంటారు. అయితే గోవిందరావు సెక్యూరిటీ గార్డులను ఉదయం 6 గంటలకే విధులకు రావాలని ఆదేశించినట్లు తెలిసిందని, ఈ క్రమంలోనే తుపాకీతో వేటాడి ఉంటాడని పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని తెలిపారు. మద్యం మత్తులో ఉన్న గోవిందరావు, శేరిలింగంపల్లిలో నివాసముండే సెక్యూరిటీ గార్డులు బి.చంద్రయ్య (65), ఎన్.రాజయ్య (54)లతో పాటు జింకను కోసిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కోచ్ మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ‘ఉదయాన్నే రావాలని చెప్పాడు. 8 గంటలకు రాగానే జింక షూటింగ్ రేంజ్‌కు కొద్ది దూరంలో చనిపోయి ఉంది. ఎవరు చంపారో తెలియదు’ అని మరో సెక్యూరిటీ గార్డు బాలు ‘సాక్షి’తో చెప్పారు. -
సెంట్రల్ యూనివర్సిటీలో జింక కాల్చివేత