స్వాధీనం చేసుకున్న జంతువులు
చెన్నై,అన్నానగర్: థాయ్‌ల్యాండ్ నుంచి చెన్నైకి బుధవారం విమానంలో అక్రమంగా తీసుకొచ్చిన కోతులు, ఉడత, తొండలను విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని థాయ్‌ల్యాండ్ దేశానికి తిరిగి పంపించడానికి అధికారులు చర్యలు తీస్తున్నారు. చెన్నై మీనమ్‌బాక్కమ్ విమానాశ్రయానికి బుధవారం థాయ్‌ల్యాండ్ నుంచి వచ్చిన విమానంలో ప్రయాణం చేసిన చెన్నైకి చెందిన సురేష్ (28) మీద అనుమానం చెందిన విమానాశ్రయ అధికారులు విచారణ చేపట్టారు. అతను పొంతనలేని సమాధానం చెప్పడంతో అతని లగేజ్‌ని పరిశీలించారు. అందులో ఉన్న నాలుగు ప్లాస్టిక్ పెట్టెలను విప్పి చూడగా అమెరికా దేశాలలో నివసించే 12 ఊసరవెల్లులు, తొండలు, రెండు చిన్న కోతులు, థాయ్‌ల్యాండ్, మలేషియా దేశాలలో నివసించే రెండు జాతుల ఉడతలు ఉన్నాయి. అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని థాయ్‌ల్యాండ్ దేశానికి తిరిగి పంపించడానికి చర్యలు తీసున్నారు. .
Comments
Please login to add a commentAdd a comment