అతివేగానికి ఇద్దరి బలి | two died with speed | Sakshi
Sakshi News home page

అతివేగానికి ఇద్దరి బలి

Published Tue, Aug 30 2016 1:12 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

two died with speed

ఎమ్మిగనూరు: కర్నూలు – ఆదోని రహదారిలో బోడబండ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పంచాయతీ రాజ్‌ ఇంజనీర్‌తో పాటు డ్రై వర్‌ మృతి చెందారు. విధి నిర్వహణ నిమిత్తం పంచాయతీ రాజ్‌ క్వాలిటీ కంట్రోల్‌ విభాగంలో పని చేస్తున్న ఇంజనీరు మార్కండేయ శర్మ, అసిస్టెంట్‌ సుబ్బరాయుడు, డ్రై వర్‌ మహదేవుడులు కర్నూలు నుంచి ఆదోనికి కారులో బయలుదేరారు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఎమ్మిగనూరు మండలంలో బోడబండ సమీపంలో అదుపు తప్పిన కారు కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇంజినీరు మార్కండేయ శర్మ (50) అక్కడికక్కడే మతి చెందాడు. తీవ్ర గాయలకు గురైన డ్రై వర్‌ మహదేవుడు (30) కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు. తీవ్రగాయాలకు గురైన సుబ్బరాయుడు చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను108లో ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. మతులు మార్కండేయ శర్మకు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో, మహదేవుడికి కర్నూలు ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆదోని డీఎస్పీ శ్రీనివాసులు, ఎమ్మిగనూరు సీఐ శ్రీనివాసమూర్తి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి వివరాలు తెలుసుకున్నారు. ఇంజినీరు మార్కండేయ మరణవార్త తెలుసుకొన్న ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ శ్రీనివాసరెడ్డి, ఏఈలు మల్లయ్య, హుసేన్‌పీరా, యమునప్ప, వెంకటేశులు, జయన్న, భాస్కర్‌రెడ్డి, తదితరులు ఆసుపత్రికి చేరుకొని సంతాపం ప్రకటించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement