సాయినాథ్ (ఫైల్)
రఘునాథపాలెం : అతి వేగం.. అతడిని బలిగొంది. మండలంలోని వీవీ పాలెం వద్ద ఖమ్మం–వైరా ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో బీటెక్ ఫైనలియర్ విద్యార్థి ఘంటా సాయినా««థ్(20) అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. పాల్వంచలోని కేటీపీఎస్ ఉద్యోగి ఘంటా కొండలరావు కుమారుడైన సాయినాధ్, ఖమ్మంలోని ఎస్‌బీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (మెకానికనల్) ఫైనలియర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న ముదిగొండ మండలం మాధాపురం గ్రామానికి చెందిన సైదారావుతో కలిసి బైక్‌పై వైరా వెళ్లి తిరుగు ప్రయాణమయ్యాడు. వీవీ పాలెం వద్ద, ముందు వెళుతున్న వాహనాన్ని దాటేందుకు వేగం పెంచాడు.
సరిగ్గా అదే సమయంలో ఎదురుగా ఖమ్మం నుంచి వైరా వైపు వెళుతున్న డీసీఎం వ్యాన్ ఢీకొంది. తీవ్ర గాయాలతో సాయినాధ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సైదారావుకు స్వల్ప గాయాలయ్యాయి. సాయినా«ధ్ మృతి విషయం తెలియడంతోనే అతను చదువుతున్న కాలేజీలోని విద్యార్థులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో ప్రమాద స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో విగతుడైన సాయినాధ్‌ను చూసి కన్నీరు పెట్టారు. ఈ దుర్వార్తను అతడి కుటుంబీకులకు స్నేహితులు తెలిపారు. గుండెలు పగిలేలా, దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి అర్బన్ ఎస్‌ఐ రాము తరలించారు. సాయినాథ్ కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment