ప్రాణాలు తీసిన అతివేగం | speed taken lives | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన అతివేగం

Published Thu, Nov 17 2016 11:43 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ప్రాణాలు తీసిన అతివేగం - Sakshi

ప్రాణాలు తీసిన అతివేగం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
– ఒకరికి తీవ్ర గాయాలు
– హెబ్బటం వద్ద ఘటన
 
హొళగుంద: మండల పరిధిలోని హొళగుంద–ఆదోని మార్గంలో లింగంపల్లి క్రాస్‌ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. హొళగుందకు చెందిన వడ్డే రాజు (20).. మోటారు సైకిల్‌పై ఆదోనిలోని కల్లుబావిలో జరుగుతున్న శుభకార్యానికి రాత్రి బయల్దేరారు. హెబ్బటం గ్రామానికి చెందిన చిన్న లక్ష్మన్న (25), శేషగిరి.. కర్ణాటకలోని ఉత్తనూరుకు మోటార్‌ సైకిల్‌ వెళ్తున్నారు. లింగంపల్లి క్రాస్‌ వద్ద ఇరువురి మోటార్‌ సైకిళ్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో వడ్డే రాజు, చిన్నలక్ష్మన్న, శేషగిరి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా వడ్డే రాజు, చిన్న లక్షమన్న మార్గమధ్యలో మృతి చెందారు. శేషగిరి..తీవ్రంగాయాలతో చికిత్స పొందుతున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement