ప్రాణం తీసిన వేగం
Published Wed, May 24 2017 10:37 PM | Last Updated on Tue, Sep 5 2017 11:54 AM
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
శిరివెళ్ల: వేగం ఓ యువకుడి ప్రాణం తీసింది. మండల పరిధిలోని గోవిందపల్లె, కానాలపల్లె మధ్య 18వ జాతీయ రహదారిపై రోడ్డు డివైడర్‌ను ఢీకొని మోటార్ సైకిల్‌పై వెళ్తున్న బి. సుదర్శన్‌రెడ్డి ( 21 )మృతి చెందాడు. నంద్యాల పట్టణం క్రాంతినగర్‌కు చెందిన ఇతను.. మంగళవారం మైదూకూరులో ఉన్న తన పెద్దనాన్నను చూసి తిరిగి రాత్రి మోటార్ సైకిల్‌పై స్వగ్రామానికి వస్తున్నాడు. వేగంగా వస్తూ ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆటోలో చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వానికి తరలించగా కోలుకోలేక అర్ధరాత్రి దాటాక మృతి చెందాడు. మృతుడు హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. మృతుని తమ్ముడు ఓబులరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకరరెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement