ప్రాణం తీసిన అతివేగం
Published Sun, Jan 1 2017 9:23 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
- నూతన సంవత్సర వేడుకల్లో విషాదం
- రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
చనుగొండ్ల(గూడూరు రూరల్): కొత్త సంవత్సరాది వేడుకలను స్నేహితులతో కలిసి నిర్వహించుకునేందుకు బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడు అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వేడుకలు చేసుకోకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు.
ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా నడుపుతూ అదుపుతప్పి బ్రిడ్జి దిమ్మెను ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. చనుగొండ్ల సమీపంలో జరిగిన ఈ ఘటనలో కోడుమూరుకు చెందిన గాజుల రుద్రప్ప(20) మరణించాడు. రుద్రప్ప గోరంట్ల రోడ్డులోని పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. చనుగొండ్ల సమీపంలోని వై.ఖానాపురంలో స్నేహితుడితో కలిసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు అర్ధరాత్రి 12 గంటల సమయంలో కుటుంబ సభ్యులకు చెప్పి బయలుదేరాడు. చనుగొండ్ల దాటిన తరువాత వేగంగా బైక్‌ను నడుపుతున్న రుద్రప్ప అదుపుతప్పి దిగువ కాలువపై నిర్మించిన బ్రిడ్జి దిమ్మెను ఢీకొట్టాడు. దీంతో బైక్ పై నుంచి కాలువలోకి పడి మృతి చెందాడు. ఉదయం అటుగా వెళ్తున్న వాహనదారులు గుర్తించి సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Advertisement
Advertisement