సరికొత్త ప్రేమకథగా స్పీడ్‌220.. ఆసక్తిగా ట్రైలర్‌! | Tollywood Movie Speed220 Trailer Out Now | Sakshi
Sakshi News home page

Speed220 Trailer: ఆర్ఎక్స్ 100 లాంటి ప్రేమకథా చిత్రం.. ఆసక్తిగా ట్రైలర్‌!

Published Tue, Aug 20 2024 9:09 PM | Last Updated on Tue, Aug 20 2024 9:09 PM

Tollywood Movie Speed220 Trailer Out Now

గణేష్, హేమంత్ ,ప్రీతి సుందర్, జాహ్నవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'స్పీడ్220'. ఈ సినిమాకు హర్ష బీజగం దర్శకత్వం వహిస్తున్నారు. విజయలక్ష్మి ప్రొడక్షన్ పతాకంపై కొండమూరి ఫణి, మందపల్లి సూర్యనారాయణ, మదినేని దుర్గారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్  చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా తమారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..' ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఆర్ఎక్స్ 100 సినిమా మాదిరి ఒక కొత్త కథ. విభిన్నమైనటువంటి పాత్రలతో చక్కటి దర్శకత్వ ప్రతిభ ఇందులో చూపించారు'  అని కొనియాడారు.  నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు  కృతజ్ఞతలు.. ఆర్ఎక్స్ 100 లాంటి  మంచి సక్సెస్ అవుతుందన్న నమ్మకముందని దర్శకుడు హర్ష బీజగం అన్నారు.

ఈ చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..' మంచి కథతో దర్శకుడు హర్ష రావడం జరిగింది. కథ వినిన వెంటనే మా విజయలక్ష్మి ప్రొడక్షన్ సంస్థ ద్వారా సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నాం.ఇదొక మంచి ప్రేమ కథ. ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల్లో  ప్రేమ వల్ల జరిగే ఇబ్బందులు, ప్రేమికులు మధ్యన సంఘర్షణ కళ్లకు కట్టినట్లుగా చూపించేలా దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించారు' అని అన్నారు. ఈ మూవీని ఆగస్టు 23న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి శేఖర్ మోపురి  సంగీతమందించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement