
గర్లఫ్రెండ్ కోసం అరెస్టు అయ్యాడో ఓ వ్యక్తి. చివరికి అదే అతడి బండారం మొత్తం బయట పెట్టించి.. జైలు పాలయ్యేలా చేసింది. వివరాల్లోకెళ్తే..ఫ్లోరిడాకు చెందిన జెవోన్ పియర్ జాక్సన్ అనే వ్యక్తి తన స్నేహితురాలికి ఇంటర్యూ ఉండటంతో తానే డ్రాప్ చేయాలని అనుకున్నాడు. ఆమెను కరెక్ట్ టైంకి తీసుకెళ్లి సాయం చేయాలనకున్నాడు జాక్సన్. ఐతే అప్పటికే అతని కారు వెనుక సీటులో తన ముగ్గురు పిల్లలు ఉన్నా..ఆమెను తన కారులో ఎక్కించుకున్నాడు. ఐతే అతను తన గర్లఫ్రెండ్‌కి సాయం చేసి ఇంప్రెస్ చేయాలన్న ఆతృతలో వేగంగా కారుని నడిపాడు.
ఈ క్రమంలో రద్దీగా ఉండే ఫాల్స్ చర్చ్‌రోడ్ వద్ద స్పీడ్‌గా కారుని పోనిచ్చాడు. బ్లాక్ మెర్సిడేజ్ కారులో వేగంగ వెళ్లిపోతున్న జాక్సన్ పోలీసుల వాహనాన్ని సైతం పట్టించుకోకుండా క్రాస్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. దీంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమై జాక్సన్ కారుని అడ్డుకున్నారు. అతను రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఒక తెల్లటి పికప్ కారుని ఢీ కొట్టయేబోతుండగా..త్రుటిలో ప్రమాదం తప్పినట్టు సమాచారం
దీంతో పోలీసులు అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకుని.. విచారించడం ప్రారంభించారు. అతడు గతంలో పలుమార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. అదీగాక కారులో పిల్లలు ఉన్నా కూడా ఇంత ప్రమాదకరమైన వేగంతో నడిపినందుకుగానూ జాక్సన్‌పై పలు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ మేరకు సదరు వ్యక్తి 22 ఏళ్ల జాక్సన్‌ని బ్రెవార్డు కౌంటి జైలుకి తరలించారు. అతను ఈ కేసు విషయమై ఏప్రిల్ 18న కోర్టు ఎదుట హాజరుకావల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.
(చదవండి: టాయిలెట్‌కి వెళ్లలేని అరుదైన సమస్య! పగవాడికూడా వద్దంటూ విలపిస్తున్న మహిళ)
Comments
Please login to add a commentAdd a comment