ముంబై: జర్మనీ విలాస వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మంగళవారం భారత మార్కెట్లో కొత్త బైక్‌ను విడుదల చేసింది. ‘‘ఎస్ 100 ఆర్’’ పేరుతో వస్తున్న ఈ ప్రీమియం బైక్ ధర రూ.17.9 లక్షలుగా ఉంది. కంప్లీట్లీ బిల్ట్ అప్ యూనిట్ (సీబీయూ) రూపంలో భారత్‌లోకి దిగుమతి అవుతోంది. స్టాండర్డ్, ప్రో, ప్రో ఎం స్పోర్ట్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో కొత్తగా డెవలప్ చేసిన వాటర్ కూల్డ్ 4–సిలిండర్ ఇన్–లైన్ ఇంజిన్‌ను అమర్చారు.
3 సెకన్లలో
బీఎండబ్ల్యూ ఎస్ 100 ఆర్ బైకు కేవలం 3.2 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గరిష్టంగా గంటకు 250 కి.మీ. వేగం ప్రయాణించగలదు. ప్రీమియం బైకులను కోరుకునే యువతను దృష్టిలో పెట్టుకొని రెండో తరానికి చెందిన బీఎండబ్ల్యూ ఎస్ 100 ఆర్ బైక్‌లను రూపొందించామని భారత్ విభాగపు ప్రెసిడెంట్ విక్రమ్ పావా తెలిపారు. దేశవ్యాప్తంగా ఉండే అన్ని బీఎండబ్ల్యూ డీలర్‌షిప్‌ల వద్ద కొత్త మోడల్‌ను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
చదవండి: హోప్ ఎలక్ట్రిక్: సింగిల్ ఛార్జ్ తో 125 కి.మీ. ప్రయాణం
Comments
Please login to add a commentAdd a comment