18 లక్షలు పెట్టి బైక్‌ కొన్న హీరో | Shahid Kapoor New Bike Worth More Than Rs 18 Lakh | Sakshi
Sakshi News home page

18 లక్షలు పెట్టి బైక్‌ కొన్న హీరో

Mar 8 2019 3:57 PM | Updated on Mar 8 2019 3:59 PM

Shahid Kapoor New Bike Worth More Than Rs 18 Lakh - Sakshi

హైఎండ్‌ బైకులంటే అమితాసక్తి చూపించే బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ ఖరీదైన బైక్‌ సొంతం చేసుకున్నాడు.

ముంబై: బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ ఖరీదైన బైక్‌ సొంతం చేసుకున్నాడు. అత్యంత శక్తివంతమైన బీఎండబ్ల్యూ ఆర్‌ 1250 జీఎస్‌ ఎడ్‌వెంచరస్‌ మోటార్‌సైకిల్‌ కొన్నాడు. రూ. 18.25 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌) వెచ్చించి దీన్ని కొనుగోలు చేశాడు. కొత్త బైక్‌తో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. హైఎండ్‌ బైకులంటే అమితాసక్తి చూపించే షాహిద్‌ కపూర్‌ దగ్గర డుకాటి స్కాంబ్లర్‌ 1200, హార్లే-డేవిడ్‌సన్‌ ఫాట్‌బాయ్‌, యమహా ఎంటీ 01 బైక్‌లు ఉన్నాయి. బీఎండబ్ల్యూ జీ310 ఆర్‌ బైక్‌ను టెస్ట్‌ రైడ్‌ చేసిన ఫొటోను కొద్ది రోజుల క్రితం ట్విటర్‌లో పెట్టాడు. ముంబై ట్రాఫిక్‌లో నడపడానికి అత్యంత అనువుగా ఈ బైక్‌ ఉంటుందని పేర్కొన్నాడు. అయితే ఈ బైక్‌ను కొన్నాడా, లేదా అనేది వెల్లడించలేదు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, సౌరవ్‌ గంగూలీ, యువరాజ్‌ సింగ్‌ తదితర ప్రముఖులు కూడా బీఎండబ్ల్యూ బైకులు వాడుతున్నారు.

షాహిద్‌ కపూర్‌ ప్రస్తుతం సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో అర్జున్‌రెడ్డి’  హిందీ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈసినిమాకు కబీర్‌ సింగ్‌ అనే టైటిల్‌ పెట్టారు. టీ సిరీస్‌, సినీ 1 స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను 2019 జూన్‌ 21న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement