చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ ఇండియా’ తాజాగా ఏప్రిల్ నుంచి కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్ ప్రాతిపదికన ధరల పెంపు 3–5.5 శాతం శ్రేణిలో ఉంటుందని పేర్కొంది. విడిభాగాలపై దిగుమతి సుంకం పెంపు దీనికి ప్రధాన కారణమని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా తెలిపారు.
మరొకవైపు బీఎండబ్ల్యూ ఇండియా తన చెన్నైలోని ప్లాంటులో 11వ వార్షికోత్సవ వేడుక నిర్వహించింది. సంస్థ బ్రాండ్ అంబాసిడర్ సచిన్ టెండూల్కర్ ఈ సందర్భంగా ‘స్కిల్ నెక్ట్స్’ పేరిట శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంపెనీ ఇందులో భాగంగా పలు ఇంజినీరింగ్ కాలేజీలు సహా ఐటీఐ వంటి టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్లకు 365 బీఎండబ్ల్యూ ఇంజన్లను, ట్రాన్స్‌మిషన్లను ఉచితంగా అందించనుంది. దీంతో విద్యార్థులు ప్రత్యక్షంగా విద్యను అభ్యసించొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment