
సాయిపల్లవి చెల్లి పూజా కన్నన్ ఇటీవలే తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించింది.

సెప్టెంబర్‌లో క్లోజ్ ఫ్రెండ్ వినీత్‌ను పెళ్లాడింది.

ఈ అపురూప ఘట్టానికి మూడు నెలలు నిండాయి.

ఈ సందర్భంగా సాయిపల్లవి ఆ వెడ్డింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

నా చెల్లి పెళ్లి తర్వాత నా లైఫ్ ఓ కొత్త దశలోకి వెళ్తుందని ఎప్పుడూ అనుకోలేదు.

వివాహ వేడుకలో ప్రతి క్షణం ఎంజాయ్ చేశాను.

సంతోషపడ్డాం, కన్నీళ్లు పెట్టుకున్నాం, ఆడుకున్నాం, పాడుకున్నాం.

కానీ నా చెల్లి ఈ నిర్ణయం తీసుకోవడానికి నేను రెడీగా లేనేమో అనిపించింది.

ఇకపై తనకు ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వలేను.

పూజా భర్త.. తనను నాలాగా లేదా నాకంటే ఎక్కువగానే ఆమెను ప్రేమిస్తున్నాడు.

పెళ్లయి మూడు నెలలవుతోంది.

ఇలాంటి ఫీలింగ్ ఇదివరకెప్పుడూ లేదు అని రాసుకొచ్చింది.

కాగా సాయిపల్లవి చివరగా అమరన్ సినిమాలో నటించింది.




























