లక్ష గొంతుకలను ఢిల్లీకి వినిపిద్దాం..
Published Wed, Aug 28 2013 3:19 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ఈ నెల 30న తలపెట్టిన లక్షగొంతుల ఆకాంక్షను ఢిల్లీకి వినిపించాలని అఖిలపక్ష కమిటీ తీర్మానించింది. మంగళవారం స్థానిక షాదీఖానాలో లక్ష గొంతుకల ఉద్యమంపై కులసంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అరవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు హాజరై కార్యక్రమం విజయవంతంపై దశాదిశను నిర్ధేశించారు. 30న వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసి ఉంచాలన్న నిర్ణయాన్ని వ్యాపారులు సమావేశంలో ప్రకటించారు. లక్సెట్టిపేట, చెన్నూర్, బెల్లంపల్లి రోడ్లు దిగ్బంధించాలని నిర్ణయించారు.
ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం వరకు లక్ష మందితో ఎక్కడికక్కడే తమ గళాన్ని వినిపించాలని తీర్మానం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల, కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉద్యమంలో భాగస్వాములు అవుతారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు. పార్టీల ప్రమేయం లేకుండా తెలంగాణవాదులుగానే కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ జెండాలను ఎవరూ తీసుకరావద్దని వక్తలు కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు మంగీలాల్‌సోమాని, ఆర్.కృష్ణారావు, వ్యాపార సంస్థల ప్రతినిధి గురిజాల రాధాకిషన్‌రావు, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, టీడీపీ జిల్లా కన్వీనర్ గాజుల ముకేశ్‌గౌడ్, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు టి.శ్రీనివాస్,
పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతి సత్యనారాయణ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం అసోసియేషన్ ప్రతినిధులు బాలాజీ, ప్రవీణ్, కళాశాలల ప్రతినిధు లు భూమేశ్, మల్లారెడ్డి, డీటీఎఫ్ నాయకుడు కె.రాంరెడ్డి, టీయూటీఎఫ్ ప్రతినిధి ఆగాచారి, కమ్యూనిస్టు పార్టీ కన్వీనర్, కో కన్వీనర్ నైనాల వెంకటేశ్వర్లు, జయరావు, న్యాయవాది చుంచు సదానందం, కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొగరి సుధాకర్, నాయకులు, వ్యాపారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement